7 రోజుల్లో కొత్త హ్యుందాయ్ క్రెటా బుకింగ్స్ ఎంతో తెలుసా.. !

హ్యుందాయ్ మోటార్స్ ఇండియా తమ రాబోయే 2020 క్రెటా ఎస్‌యువి ఇప్పటికే 10,000 యూనిట్ల బుకింగ్స్ దాటిందని కంపెనీ ప్రకటించింది. 2020 హ్యుందాయ్ క్రెటా కోసం బుకింగ్ మార్చి 2 వ తేదీన అధికారికంగా ప్రారంభమైంది. ఈ కొత్త హ్యుందాయ్ క్రెటా గురించి మరింత సమాచారం తెలుసుకుందాం.. !

7 రోజుల్లో కొత్త హ్యుందాయ్ క్రెటా బుకింగ్స్ ఎంతో తెలుసా.. !

2020 హ్యుందాయ్ క్రెటా భిన్నమైన డిజైన్ కలిగి ఉంటుంది. అంతే కాకుండా కొత్త ఫీచర్స్ మరియు కొత్త పవర్‌ట్రైన్ ఎంపికలను కూడా కలిగి ఉంటుంది. న్యూ హ్యుందాయ్ క్రెటా 2020 ఆటో ఎక్స్‌పోలో ప్రారంభించినప్పటి నుంచి మార్కెట్లో వినియోగదారులకి కొత్త ఆసక్తిని కలిగించింది.

7 రోజుల్లో కొత్త హ్యుందాయ్ క్రెటా బుకింగ్స్ ఎంతో తెలుసా.. !

కొత్త క్రెటా ఎస్‌యువి అవుట్‌గోయింగ్ మోడల్‌కు భిన్నంగా కనిపిస్తుంది. కొత్త హ్యుందాయ్ క్రెటాలో ఇప్పుడు డ్యూయల్-హెడ్‌ల్యాంప్ సెటప్‌ను కలిగి ఉంది. ప్రధాన ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్ యూనిట్ చుట్టూ ఎల్‌ఈడీ డిఆర్‌ఎల్‌లు కొద్దిగా దిగువన ఉంటాయి. ఇదే విధమైన డిజైన్‌ను ఎల్‌ఈడీ టైల్లైట్స్‌తో ముందుకు వెళుతుంది. సైడ్ ప్రొఫైల్ స్వల్పంగా అప్‌డేట్స్‌తో పాటు కొత్తగా రూపొందించిన అల్లాయ్ వీల్స్‌ని కలిగి ఉంటుంది.

7 రోజుల్లో కొత్త హ్యుందాయ్ క్రెటా బుకింగ్స్ ఎంతో తెలుసా.. !

కొత్త హ్యుందాయ్ క్రెటా యొక్క ఇంటీరియర్స్ పూర్తిగా నవీకరించబడిన క్యాబిన్ మరియు డాష్‌బోర్డ్‌తో వస్తుంది. క్రెటా యొక్క ఇంటీరియర్స్ ఇప్పుడు ఎక్కువ ప్రీమియంతో కనిపిస్తోంది మరియు అవుట్గోయింగ్ మోడల్ కంటే ఎక్కువ ఖరీదైనదిగా ఉంటుంది. అంతే కాకుండా ఇందులో బ్లూ లింక్ కనెక్టివిటీ టెక్నాలజీ యొక్క తాజా వెర్షన్‌తో కొత్త టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో సహా కొత్త ఫీచర్లను కూడా అందిస్తుంది.

7 రోజుల్లో కొత్త హ్యుందాయ్ క్రెటా బుకింగ్స్ ఎంతో తెలుసా.. !

ఇందులో 1.5-లీటర్ పెట్రోల్ మరియు డీజిల్ యూనిట్లు ఉన్నాయి. రెండూ వరుసగా 115 బిహెచ్‌పి మరియు 144 ఎన్ఎమ్ మరియు 250 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తాయి. 2020 క్రెటా 1.4 లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్‌ని కలిగి ఉంటుంది. ఇది సెల్టోస్‌లో ఉన్న అదే 140 బిహెచ్‌పి శక్తిని విడుదల చేస్తుంది. మూడు ఇంజన్లు ఆరు స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో పాటు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఎంపికలను కలిగి ఉంటుంది.

7 రోజుల్లో కొత్త హ్యుందాయ్ క్రెటా బుకింగ్స్ ఎంతో తెలుసా.. !

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

హ్యుందాయ్ క్రెటా భారత మార్కెట్లో అత్యంత ప్రాచుర్యం పొందిన మిడ్-సైజ్ ఎస్‌యువిలలో ఒకటి. అయితే ఇండియన్ మార్కెట్లో కియా సెల్టోస్ మరియు ఎంజి హెక్టర్ వంటి కొత్త ప్రత్యర్థులు ప్రారంభమైనప్పటినుంచి, ఈ ఎస్‌యువి అమ్మకాలు గణనీయంగా తగ్గాయి. కానీ కొత్త హ్యుందాయ్ క్రెటా రావడంతో ఇది తిరిగి మార్కెట్లో మంచి అమ్మకాలను సాధించడానికి ప్రయత్నాలు సాగిస్తోంది.

More from DriveSpark

Article Published On: Thursday, March 12, 2020, 9:51 [IST]
English summary
New Hyundai Creta Bookings Cross 10,000 Units In 7 Days: India Launch Scheduled For 17th March. Read in Telugu.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+