టెస్టింగ్ దశలో కెమెరాకు చిక్కిన సరికొత్త హ్యుందాయ్ ఐ20: స్పై చిత్రాలు, వివరాలు

కొరియన్ కార్ బ్రాండ్ హ్యుందాయ్, భారత మార్కెట్లో విక్రయిస్తున్న ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ ఎలైట్ ఐ20లో ఓ సరికొత్త తరం మోడల్‌ను మార్కెట్లోకి ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఇదివరకటి కథనంలో ప్రచురించిన సంగతి తెలిసినదే. ఈ నేపథ్యంలో, తాజాగా సరికొత్త హ్యుందాయ్ ఐ20 టెస్టింగ్ దశలో ఉండగా మరోసారి కెమెరాకి చిక్కింది.

టెస్టింగ్ దశలో కెమెరాకు చిక్కిన సరికొత్త హ్యుందాయ్ ఐ20: స్పై చిత్రాలు, వివరాలు

టీమ్‌బిహెచ్‌పిలో విడుదలైన చిత్రాల ప్రకారం, కొత్త తరం హ్యుందాయ్ ఐ20 కారుని కంపెనీ భారీగా క్యామోఫ్లేజ్ చేసి హర్యానా నెంబర్ ప్లేట్‌తో టెస్టింగ్ చేస్తుండటాన్ని మనం గమనించవచ్చు. ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న ఎలైట్ ఐ20తో పోల్చుకుంటే, సరికొత్త డిజైన్ మరియు అధునాతన ఫీచర్లతో కొత్త తరం ఐ20 అందుబాటులోకి రానుంది.

టెస్టింగ్ దశలో కెమెరాకు చిక్కిన సరికొత్త హ్యుందాయ్ ఐ20: స్పై చిత్రాలు, వివరాలు

హ్యుందాయ్ ఇప్పటికే తమ నెక్స్ట్ జెననరేషన్ ఐ20 ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌ను వివిధ అంతర్జాతీయ మార్కెట్లలో విక్రయిస్తోంది. క్యామోఫ్లేజ్‌లో ఉన్న ఈ టెస్టింగ్ వాహన రూపం చూడటానికి అంతర్జాతీయ మోడల్ మాదిరిగానే అనిపిస్తుంది. అయితే, దీని అల్లాయ్ వీల్స్ మాత్రం కాస్తంత భిన్నంగా, ఫంకీగా కనిపిస్తాయి.

టెస్టింగ్ దశలో కెమెరాకు చిక్కిన సరికొత్త హ్యుందాయ్ ఐ20: స్పై చిత్రాలు, వివరాలు

దేశీయ మార్కెట్లో విడుదల చేయటానికి ముందే, హ్యుందాయ్ తమ కొత్త తరం ఐ20 కారును భారత రోడ్లపై విస్తృతంగా పరీక్షిస్తోంది. ఓవరాల్ ఐ20 సిల్హౌట్‌ను మాత్రం యధావిధిగా ఉంచినట్లు అనిపిస్తుంది. కొత్త షార్క్‌ఫిన్ యాంటెన్నా మరియు 15 ఇంచ్ అల్లాయ్ వీల్స్‌తో ఇది ఇంటర్నేషనల్ మార్కెట్లలో లభించే మోడల్‌లా అనిపిస్తుంది.

టెస్టింగ్ దశలో కెమెరాకు చిక్కిన సరికొత్త హ్యుందాయ్ ఐ20: స్పై చిత్రాలు, వివరాలు

కొత్త తరం హ్యుందాయ్ ఎలైట్ ఐ20లో కొత్త క్యాస్కేడింగ్ గ్రిల్, మరింత అందగా కనిపించే హెడ్‌ల్యాంప్స్, కొత్త వ్రాప్ అరౌండ్ స్ప్లిట్ టెయిల్ లాంప్స్ మరియు ఈ రెండింటి అనుసంధానించే లైట్ బార్, కొత్త డ్యూయల్-టోన్ అల్లాయ్-వీల్ డిజైన్ వంటి ఫీచర్లతో ఇది ప్రస్తుత తరం ఐ20 కంటే మరింత ప్రీమియంగా కనిపిస్తుంది.

టెస్టింగ్ దశలో కెమెరాకు చిక్కిన సరికొత్త హ్యుందాయ్ ఐ20: స్పై చిత్రాలు, వివరాలు

అన్ని హ్యుందాయ్ మోడళ్ల మాదిరిగానే, కొత్త తరం ఐ20 ఇంటీరియర్స్ కూడా ఫూర్తి ఫీచర్లతో లోడ్ చేయబడనుంది. ఇందులో కొత్త డాష్‌బోర్డ్ డిజైన్, ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కోసం రెండు 10.25 ఇంచ్ డిస్‌ప్లేలు మరియు ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటోతో పాటుగా బ్రాండ్ యొక్క కనెక్టింగ్ టెక్నాలజీ ‘బ్లూలింక్'ని సపోర్ట్ చేసే కొత్త టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఉండొచ్చని అంచనా.

టెస్టింగ్ దశలో కెమెరాకు చిక్కిన సరికొత్త హ్యుందాయ్ ఐ20: స్పై చిత్రాలు, వివరాలు

కొత్త తరం హ్యుందాయ్ ఎలైట్ ఐ20 కారులో హ్యుందాయ్ వెన్యూలో కనిపించే సాంకేతిక పరిజ్ఞాన్ని ఆఫర్ చేయనున్నారు. వెన్యూ కాంపాక్ట్ ఎస్‌యూవీలో 33 వాయిస్ కమాండ్లతో కూడిన సాంకేతిక పరిజ్ఞానాన్ని కొత్త ఐ20 కారులో కూడా చూసే అవకాశం ఉంటుంది.

టెస్టింగ్ దశలో కెమెరాకు చిక్కిన సరికొత్త హ్యుందాయ్ ఐ20: స్పై చిత్రాలు, వివరాలు

ఈ కొత్త కారులో ఉండబోయే కొన్ని ముఖ్యమైన ఫీచర్లలో ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ సీట్లు, డ్యూయెల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, రియర్ ఎయిర్ కండిషనింగ్ వెంట్స్ మరియు బోస్ ప్రీమియం ఆడియో సిస్టమ్ మొదలైనవి ఉండొచ్చని సమాచారం. భద్రతా ఫీచర్ల విషయానికి వస్తే, ఇందులో బ్లైండ్ స్పాట్ మోనిటరింగ్, బహుళ ఎయిర్‌బ్యాగులు, ఐఎస్ఓ-ఫిక్స్ మౌంట్‌లు మొదలైనవి ఉండనున్నాయి.

టెస్టింగ్ దశలో కెమెరాకు చిక్కిన సరికొత్త హ్యుందాయ్ ఐ20: స్పై చిత్రాలు, వివరాలు

ఇంజన్ ఆప్షన్స్ విషయానికి వస్తే, కొత్త తరం హ్యుందాయ్ ఎలైట్ ఐ20 మూడు ఇంజన్ ఆప్షన్లతో లభ్యం కానుంది. ఇందులో 1.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్, 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ మరియు 1.5-లీటర్ డీజిల్ ఇంజన్‌లు ఉండనున్నాయి. ఇవే ఇంజన్లను కియా సెల్టోస్ మోడల్‌లో కూడా ఉపయోగిస్తున్నారు.

టెస్టింగ్ దశలో కెమెరాకు చిక్కిన సరికొత్త హ్యుందాయ్ ఐ20: స్పై చిత్రాలు, వివరాలు

ఈ ఇంజన్లన్నీ స్టాండర్డ్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో లభ్యం కానున్నాయి. అయితే, 1.2-లీటర్ పెట్రోల్‌పై ఆప్షనల్ సివిటి మరియు 1.5-లీటర్ డీజిల్‌పై టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లను ఆఫర్ చేసే అవకాశం ఉంది. అలాగే, ఇందులో శక్తివంతమైన 1.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌ను 6-స్పీడ్ ఐఎమ్‌టి (ఇంటెలిజెంట్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్) మరియు 7-స్పీడ్ డిసిటి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో విడుదల చేయవచ్చని తెలుస్తోంది.

టెస్టింగ్ దశలో కెమెరాకు చిక్కిన సరికొత్త హ్యుందాయ్ ఐ20: స్పై చిత్రాలు, వివరాలు

కొత్త తరం హ్యుందాయ్ ఐ20 హ్యాచ్‌బ్యాక్ టెస్టింగ్‌పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

కొత్త తరం హ్యుందాయ్ ఎలైట్ ఐ20లో డిజైన్ మరియు ఫీచర్ల పరంగా అనేక మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉంది. ఇది ఈ విభాగంలో మారుతి సుజుకి బాలెనో, టాటా ఆల్ట్రోజ్, ఫోక్స్‌వ్యాగన్ పోలో, టొయోటా గ్లాంజా మరియు హోండా జాజ్ వంటి ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ మోడళ్లతో పోటీగా నిలుస్తుంది.

Source:TeamBHP

Article Published On: Friday, October 2, 2020, 7:19 [IST]
English summary
Hyundai will be launching an all-new Hyundai i20 in the Indian market sometime during the festive season this year. The next-generation premium hatchback features updated design and features along with new powertrain options as well. Read in Telugu.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+