టెస్టింగ్‌లో కొత్త 2021 మహీంద్రా ఎక్స్‌యూవీ500; కొత్త వివరాలు వెల్లడి

ఎస్‌యూవీ స్పెషలిస్ట్ మహీంద్రా అందిస్తున్న ప్రీమియం ఎస్‌యూవీ 'ఎక్స్‌యూవీ500'లో కంపెనీ ఓ కొత్త తరం మోడల్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఇదివరకటి కథనంలో ప్రచురించిన సంగతి తెలిసినదే. కాగా, కంపెనీ ఈ కొత్త 2021 మహీంద్రా ఎక్స్‌యూవీ500ని బెంగుళూరు రోడ్లపై టెస్టింగ్ చేస్తుండగా ఆ చిత్రాలను డ్రైవ్‌స్పార్క్ టీమ్ తమ కెమెరాలో బంధించింది.

టెస్టింగ్‌లో కొత్త 2021 మహీంద్రా ఎక్స్‌యూవీ500; కొత్త వివరాలు వెల్లడి

మహీంద్రా తమ నెక్ట్స్ జనరేషన్ ఎక్స్‌యూవీ500 మోడల్‌ను పూర్తిగా క్యామోఫ్లేజ్ చేసి కర్ణాటక రోడ్లపై పరీక్షిస్తోంది. వచ్చే ఏడాది ఆరంభంలో ఇది భారత మార్కెట్లో విడుదలయ్యే అవకాశం ఉంది. కొత్త తరం 2021 మహీంద్రా ఎక్స్‌యూవీ500 అనేక కొత్త ఫీచర్లు మరియు డిజైన్ ఇంజన్ అప్‌గ్రేడ్స్‌ను కలిగి ఉంది.

టెస్టింగ్‌లో కొత్త 2021 మహీంద్రా ఎక్స్‌యూవీ500; కొత్త వివరాలు వెల్లడి

ఈ స్పై చిత్రాలను గమనిస్తే, హెడ్‌ల్యాంప్‌లు మరియు టెయిల్ ల్యాంప్స్‌కి సంబంధించిన డీటేల్స్ వెల్లడయ్యాయి. దీని ముందు భాగాన్ని పూర్తిగా రీడిజైన్ చేసినట్లుగా అనిపిస్తోంది. ప్రస్తుత తరం ఎక్స్‌యూవీ500తో పోల్చుకుంటే ఈ కొత్త మోడల్ సరికొత్త ఫ్రంట్ ఫాసియాని కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో ఇంటిగ్రేటెడ్ డిఆర్ఎల్‌లతో కూడిన కొత్త హెడ్‌ల్యాంప్ యూనిట్ ఉండే అవకాశం ఉంది.

టెస్టింగ్‌లో కొత్త 2021 మహీంద్రా ఎక్స్‌యూవీ500; కొత్త వివరాలు వెల్లడి

వెనుక వైపు ఫొటోలను గమనిస్తే, ఈ ఎస్‌యూవీ ఇప్పుడు మరింత విశాలంగా ఉన్నట్లు అనిపిస్తుంది మరియు వెనుక వైపు బంపర్ మరియు టెయిల్ ల్యాంప్స్‌ను పూర్తిగా రీడిజైన్ చేశారు. ఇంకా కొత్త బోనెట్ డిజైన్, డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్, ఫ్లష్-టైప్ డోర్ హ్యాండిల్స్ మరియు షార్క్ ఫిన్ యాంటెన్నా వంటి ఫీచర్లు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

టెస్టింగ్‌లో కొత్త 2021 మహీంద్రా ఎక్స్‌యూవీ500; కొత్త వివరాలు వెల్లడి

ఇకపోతే కొత్త 2021 మహీంద్రా ఎక్స్‌యూవీ500 ఇంటీరియర్స్‌ను కూడా పూర్తిగా రీడిజైన్ చేయనున్నారు. ఇందులో సరికొత్త డాష్‌బోర్డ్ లేఅవుట్, కొత్త ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లేతో పాటుగా బ్రాండ్ యొక్క సరికొత్త కనెక్టింగ్ టెక్నాలజీని సపోర్ట్ చేసే అప్‌డేటెడ్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మొదలైనవి ఉండే అవకాశం ఉంది.

టెస్టింగ్‌లో కొత్త 2021 మహీంద్రా ఎక్స్‌యూవీ500; కొత్త వివరాలు వెల్లడి

ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న ఎక్స్‌యూవీ500లో ఫీచర్లకు ఎలాంటి కొదవ లేనప్పటికీ, ఈ విభాగంలో కొత్తగా పుట్టుకొస్తున్న మోడళ్లలో అనేక లేటెస్ట్ టెక్నాలజీ మరియు కంఫర్ట్ ఫీచర్లు లభిస్తున్న నేపథ్యంలో, మహీంద్రా కూడా తమ కొత్త తరం ఎక్స్‌యూవీ500ని కాంపిటీటర్లకు గట్టి సవాల్ విసిరేలా అభివృద్ధి చేయనుంది.

టెస్టింగ్‌లో కొత్త 2021 మహీంద్రా ఎక్స్‌యూవీ500; కొత్త వివరాలు వెల్లడి

ఇంజన్ విషయానికి వస్తే, కొత్త 2021 ఎక్స్‌యూవీ500లో కొత్త 2.2-లీటర్ ఫోర్ సిలిండర్ టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజన్‌ను ఉండొచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఇంజన్ గరిష్టంగా 152 బిహెచ్‌పి శక్తిని మరియు 360 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది మరియు ఇది 6-స్పీడ్ మ్యాన్యువల్ లేదా 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభ్యం కానుంది.

టెస్టింగ్‌లో కొత్త 2021 మహీంద్రా ఎక్స్‌యూవీ500; కొత్త వివరాలు వెల్లడి

అంతేకాకుండా, మహీంద్రా తమ కొత్త 2021 ఎక్స్‌యూవీ500 మోడల్‌ను కొత్త టర్బో-పెట్రోల్ ఇంజన్‌తో కూడా అందించవచ్చనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. బహుశా ఇది 2.0-లీటర్ టి-జిడి ఎమ్‌స్టాలియన్ కావచ్చు, ఇదే ఇంజన్‌ను కొత్త తరం 2020 మహీంద్రా థార్‌లో కూడా ఉపయోగిస్తు్ననారు. ఈ టర్బో పెట్రోల్ ఇంజన్ 150 బిహెచ్‌పి వవర్‌ను మరియు 320 ఎన్ఎమ్‌ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభ్యం కానుంది.

టెస్టింగ్‌లో కొత్త 2021 మహీంద్రా ఎక్స్‌యూవీ500; కొత్త వివరాలు వెల్లడి

కొత్త 2021 మహీంద్రా ఎక్స్‌యూవీ500పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

మహీంద్రా ఎక్స్‌యూవీ500 దేశంలో అత్యధికంగా అమ్ముడైన ఎస్‌యూవీలలో ఒకటి. ఇది బ్రాండ్ యొక్క మొట్టమొదటి మోనోకోక్ ఎస్‌యూవీ, ఈ మోడల్‌ను కంపెనీ ఇతర దేశాలలో కూడా విక్రయిస్తోంది. మహీంద్రా ఎక్స్‌యూవీ500కు కంపెనీ ఇప్పుడు కొత్త రూపంతో సరికొత్త హంగులను కూడా జోడించనుంది. ఇది ఖచ్చితంగా మునపటి కన్నా మరింత మెరుగ్గా, ప్రీమియంగా ఉంటుందనేది మా అభిప్రాయం.

Article Published On: Saturday, October 17, 2020, 11:42 [IST]
English summary
The next-generation Mahindra XUV500 has been spotted testing ahead of its launch in India. We have exclusive images of the 2021 Mahindra XUV500 that has been completely camouflaged testing in Bangalore. Read in Telugu.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+