డీలర్ల వద్దకు చేరుకుంటున్న హోండా సిటీ, మరికొద్ది రోజుల్లోనే విడుదల - వివరాలు

నేడు కొత్త 2020 డబ్ల్యూఆర్-వి ఎస్‌యూవీని విడుదల చేసిన హోండా కార్స్ ఇండియా త్వరలోనే మరొ కొత్త మోడల్‌ను మార్కెట్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే బుకింగ్స్ ప్రారంభించబడిన సరికొత్త ఐదవ తరం హోండా సిటీ సెడాన్‌ను భారత మార్కెట్లో విడుదల చేసేందుకు సర్వం సిద్ధమైంది. మరికొద్ది రోజుల్లోనే ఈ మోడల్ మార్కెట్లోకి రానుంది.

డీలర్ల వద్దకు చేరుకుంటున్న హోండా సిటీ, మరికొద్ది రోజుల్లోనే విడుదల - వివరాలు

కొత్త హోండా సిటీ ధర మినహా ఇతర అన్ని వివరాలు ఇప్పటికే విడుదలయ్యాయి. మా డ్రైవ్‌స్పార్క్ బృందం కూడా కొత్త సిటీ సెడాన్ కారు పెట్రోల్, డీజిల్ వెర్షన్లను ఇటీవలే టెస్ట్ డ్రైవ్ చేసింది. - పూర్తి రివ్యూ కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

డీలర్ల వద్దకు చేరుకుంటున్న హోండా సిటీ, మరికొద్ది రోజుల్లోనే విడుదల - వివరాలు

ఆటోకార్ ఇండియా విడుదల చేసిన చిత్రాల ప్రకారం, ఇప్పటికే కొత్త హోండా సిటీ సెడాన్ డీలర్‌షిప్ కేంద్రాలకు చేరుకుంటోంది. ఈ చిత్రాన్ని చూస్తుంటే, ఇది పెట్రోల్ వెర్షన్ ఐ-విటెక్ మోడల్‌గా తెలుస్తోంది.

డీలర్ల వద్దకు చేరుకుంటున్న హోండా సిటీ, మరికొద్ది రోజుల్లోనే విడుదల - వివరాలు

హోండా విడుదల చేయనున్న ఈ కొత్త సిటీ సెడాన్ ఐదవ తరానికి చెందినది. ఈ మోడల్‌ను పూర్తిగా రీడిజైన్ చేసి, అనేక ఫీచర్లను జోడించారు. ఇందులో జోడించిన కొన్ని ఫీచర్లు ఈ సెగ్మెంట్‌లోనే మొట్టమొదటివి కావటం విశేషం.

డీలర్ల వద్దకు చేరుకుంటున్న హోండా సిటీ, మరికొద్ది రోజుల్లోనే విడుదల - వివరాలు

కొత్త 2020 హోండా సిటీ సెడాన్ పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో లభ్యం కానుంది. పెట్రోల్ వెర్షన్‌లో 1.5-లీటర్ ఐ-విటిఇసి (డిఓహెచ్‌సి) డబుల్ ఓవర్-హెడ్ కామ్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 120 బిహెచ్‌పి శక్తిని మరియు 145 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది.

డీలర్ల వద్దకు చేరుకుంటున్న హోండా సిటీ, మరికొద్ది రోజుల్లోనే విడుదల - వివరాలు

ఇకపోతే 1.5-లీటర్ ఐ-డిటిఇసి డీజిల్ ఇంజన్ గరిష్టంగా 100 బిహెచ్‌పి శక్తిని మరియు 200 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ రెండు ఇంజన్లు కూడా స్టాండర్డ్ 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో లభిస్తాయి. పెట్రోల్ వెర్షన్‌లో ఆప్షనల్ 7-స్పీడ్ సివిటి ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆఫర్ చేస్తున్నారు.

డీలర్ల వద్దకు చేరుకుంటున్న హోండా సిటీ, మరికొద్ది రోజుల్లోనే విడుదల - వివరాలు

మునపటి మోడల్‌తో పోల్చుకుంటే కొత్త హోండా సిటీ సెడాన్‌ను కాస్తంత పొడవుగా, వెడల్పుగా ఉండేలా డిజైన్ చేశారు. ఫలితంగా ఇంటీరియర్‌లో మరింత విశాలమైన స్థలం ఉంటుంది. సైడ్ డిజైన్‌లో బోల్డ్ క్యారెక్టర్ లైన్స్ ఉంటాయి, వీటిని జపనీస్ పురాతన యోధులు ఉపయోగించే కటానా ఖడ్గం నుంచి స్పూర్తి పొంది డిజైన్ చేశారు.

డీలర్ల వద్దకు చేరుకుంటున్న హోండా సిటీ, మరికొద్ది రోజుల్లోనే విడుదల - వివరాలు

ఇందులో కొత్త హెడ్‌ల్యాంప్స్ క్లస్టర్‌ ఉంటుంది. ఎల్‌ఇడి డిఆర్‌ఎల్, ఎల్-ఆకారపు ఎల్ఇడి టర్న్ సిగ్నల్‌, సిరీస్‌లో ఉంచిన తొమ్మిది పూర్తి-ఎల్‌ఇడి లైట్లను కలిపి ఒకే క్లస్టర్‌లో అమర్చారు. వెనుక భాగంలో, ఇది Z-ఆకారంలో ఉండే వ్రాప్ అరౌండ్ ఎల్ఇడి టెయిల్ ల్యాంప్స్ ఉంటాయి. ఇంకా ఇందులో 16 ఇంచ్ డైమండ్-కట్ డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్ కూడా ఉన్నాయి.

డీలర్ల వద్దకు చేరుకుంటున్న హోండా సిటీ, మరికొద్ది రోజుల్లోనే విడుదల - వివరాలు

లోపలి భాగంలో, కొత్త సిటీ పూర్తిగా కొత్త క్యాబిన్‌ను తలపిస్తుంది. ఇంటీరియర్లలో చేసిన మార్పులను గమనిస్తే, ఇందులో 8 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను కలిగి ఉంటుంది. ఇది ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లేతో పాటుగా సెగ్మెంట్-ఫస్ట్ అలెక్సా రిమోట్ వాయిస్ అసిస్ట్ ఫీచర్‌తో వస్తుంది.

డీలర్ల వద్దకు చేరుకుంటున్న హోండా సిటీ, మరికొద్ది రోజుల్లోనే విడుదల - వివరాలు

ఇది టెలిమాటిక్స్ కంట్రోల్ యూనిట్ (టిసియు) తో బ్రాండ్ యొక్క సరికొత్త కనెక్టింగ్ టెక్నాలజీని కలిగి ఉంటుంది, ఇది 32కి పైగా కనెక్టింగ్ ఫీచర్లు, కొత్త మల్టీ-ఫంక్షనల్ స్టీరింగ్ వీల్, సెగ్మెంట్-ఫస్ట్ 7 ఇంచ్ టిఎఫ్‌టి డిస్‌ప్లేతో ఇరువైపులా అనలాగ్ డయల్‌లను కలిగి ఉంటుంది. కొత్త సిటీ సెడాన్‌లో తొలిసారిగా జి-మీటర్‌ను కూడా జోడించారు. ఇది కార్నరింగ్ ఫోర్సెస్‌ని కొలవడంలో సహకరిస్తుంది. ఇంకా ఇందులో ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, రివైజ్ చేసిన ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

డీలర్ల వద్దకు చేరుకుంటున్న హోండా సిటీ, మరికొద్ది రోజుల్లోనే విడుదల - వివరాలు

ఐదవ తరం హోండా సిటీ సెడాన్‌లో అధునాతన భద్రతా ఫీచర్లు ఉన్నాయి. ఎడమ వైపు రియర్ వ్యూ మిర్రర్ క్రింది భాగంలో అమర్చిన లేన్ మోనటరింగ్ మిర్రర్ ఉంటుంది, ఈ కెమెరా లైఫ్ ఫీడ్‌ను డ్యాష్‌బోర్డ్ స్క్రీన్‌పై రిలే చేస్తుంది. ఇంకా ఇందులో డ్యూయెల్ ఫ్రంట్ ఐ-ఎస్ఆర్ఎస్ ఎయిర్ బ్యాగ్స్, వెహికల్ స్టెబిలిటీ అసిస్ట్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, ఆరు ఎయిర్ బ్యాగ్స్, ఈబిడితో కూడిన ఏబిఎస్ వంటి మరెన్నో ఫీచర్లున్నాయి.

డీలర్ల వద్దకు చేరుకుంటున్న హోండా సిటీ, మరికొద్ది రోజుల్లోనే విడుదల - వివరాలు

హోండా సిటీ సెడాన్ డీలర్‌షిప్‌లకు రావటంపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

హోండా సిటీ సెడాన్ డీలర్‌షిప్‌లకు రావటాన్ని చూస్తుంటే, మరికొద్ది రోజుల్లోనే ఈ మోడల్ మార్కెట్లో విడుదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే కొత్త 2020 హోండా డబ్ల్యూఆర్-వి ఎస్‌యూవీని విడుదల చేసిన హోండా ఈ నెలలోనే కొత్త సిటీ సెడాన్‌ను, కొత్త జాజ్ హ్యాచ్‌బ్యాక్‌ను కూడా విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.

Source:Autocar India

More from DriveSpark

Article Published On: Thursday, July 2, 2020, 17:49 [IST]
English summary
The fifth-generation Honda City is almost ready to launch in the Indian market. We expect the company to announce the launch sometime next month. Read in Telugu.
Read more on: #హోండా #honda
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+