కొత్త 2020 హోండా సిటీ బ్రోచర్ లీక్ - వేరియంట్ల వివరాలు

హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ తమ తర్వాతి తరం 2020 హోండా సిటీ సెడాన్‌ను ఈ నెల 15వ తేదీన మార్కెట్లో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. వాస్తవానికి ఈ మోడల్ ఎప్పుడో మార్కెట్లో విడుదల కావల్సి ఉండగా, కోవిడ్-19 మహమ్మారి కారణంగా విడుదల జాప్యమైంది.

కొత్త 2020 హోండా సిటీ బ్రోచర్ లీక్ - వేరియంట్ల వివరాలు

హోండా డీలర్లు ఇప్పటికే కొత్త 2020 సిటీ సెడాన్ కోసం బుకింగ్స్ కూడా స్వీకరిస్తున్నారు. దేశంలోని కొన్ని ప్రధాన డీలర్‌షిప్ కేంద్రాలలో ఇప్పటికే కొత్త సిటీ దర్శనమిస్తోంది. ఈ నేపథ్యంలో, విడుదలకు ముందే కొత్త సిటీ సెడాన్‌కు సంబంధించిన బ్రోచర్ ఒకటి ఆన్‌లైన్‌లో లీక్ అయ్యింది.

కొత్త 2020 హోండా సిటీ బ్రోచర్ లీక్ - వేరియంట్ల వివరాలు

టీమ్‌బిహెచ్‌పిలో లీక్ అయిన హోండా సిటీ వేరియంట్ బ్రోచర్ ప్రకారం, ఈ సరికొత్త ఐదవ తరం హోండా సిటీ V, VX మరియు ZX అనే మూడు వేరియంట్లలో లభ్యం కానుంది. లీకైన బ్రోచర్ ప్రకారం, కొత్త సిటీ బేస్ వేరియంట్ అయిన V లోనే ఫీచర్లను ఫుల్‌గా లోడ్ చేశారు.

MOST READ: జులై 14న హ్యుందాయ్ టక్సన్ ఎస్‌యూవీ విడుదల - వివరాలు

కొత్త 2020 హోండా సిటీ బ్రోచర్ లీక్ - వేరియంట్ల వివరాలు

హోండా సిటీ V వేరియంట్‌లోని ఫీచర్లను గమనిస్తే, ఇందులో ఇంటిగ్రేటెడ్ ఎల్‌ఈడి డిఆర్‌ఎల్‌లు, ఎల్‌ఇడి టెయిల్ ల్యాంప్స్, హాలోజన్ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్‌, 15 ఇంచ్ అల్లాయ్ వీల్స్‌ వంటి ఎక్స్‌టీరియర్ ఫీచర్లు ఉన్నాయి. ఇంటీరియర్స్‌లో డ్యూయెల్-టోన్ బ్లాక్ అండ్ బేజ్ ఇంటీరియర్ కలర్ స్కీమ్ ఉంటుంది. ప్రీమియం లుక్ కోసం కారు లోపలి భాగాల్లో క్రోమ్ యాక్సెంట్స్, ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటోను సపోర్ట్ చేసే 8 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 4 స్పీకర్లు, రియర్ ఎసి వెంట్స్, టిల్ట్ మరియు టెలిస్కోపిక్ స్టీరింగ్ వీల్, అడ్జస్టబల్ అండ్ ఫోల్డింగ్ వింగ్ మిర్రర్స్, క్రూయిజ్ కంట్రోల్, ఇంజన్ స్టార్ట్ / స్టాప్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఫీచర్లున్నాయి.

కొత్త 2020 హోండా సిటీ బ్రోచర్ లీక్ - వేరియంట్ల వివరాలు

సేఫ్టీ ఫీచర్లను గమనిస్తే, ఇందులో 4 ఎయిర్‌బ్యాగ్‌లు, రియర్ పార్కింగ్ సెన్సార్లు, హిల్ స్టార్ట్ అసిస్ట్, వెహికల్ స్టెబిలిటీ అసిస్ట్ మరియు రియర్‌వ్యూ కెమెరా ఫీచర్లు ఉన్నాయి. అన్ని వేరియంట్లలో ఈబిడితో కూడిన ఏబిఎస్‌ను స్టాండర్డ్ ఫీచర్‌గా అందిస్తున్నారు.

MOST READ: ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో చేరిన కొత్త హెలికాఫ్టర్లు ఇవే

కొత్త 2020 హోండా సిటీ బ్రోచర్ లీక్ - వేరియంట్ల వివరాలు

హోండా సిటీ VX వేరియంట్ విషయానికి వస్తే, ఇందులో 16 ఇంచ్ డ్యూయెల్-టోన్ డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్, ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్స్, ఆటో పించ్ ఫంక్షన్‌తో వన్-టచ్ ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, లెదర్ అప్‌హోలెస్ట్రీ, 7 ఇంచ్ హెచ్‌డి డిజిటల్ కలర్ టిఎఫ్‌టి ఎమ్ఐడి, 4 ట్వీటర్లు మరియు 8 స్పీకర్లతో సౌండ్ సిస్టమ్ ఆఫర్ చేస్తున్నారు. సేఫ్టీ ఫీచర్లను గమనిస్తే, ఇందులో ఆరు ఎస్ఆర్ఎస్ ఎయిర్‌బ్యాగులు, ఆటో-డిమ్మింగ్ ఐఆర్‌విఎమ్ (ఇన్‌సైడ్ రియర్ వ్యూ మిర్రర్), స్టీరింగ్ స్క్రోల్ సెలెక్టర్ మరియు ఆటో-లాకింగ్ ఫీచర్లు ఉన్నాయి.

కొత్త 2020 హోండా సిటీ బ్రోచర్ లీక్ - వేరియంట్ల వివరాలు

ఇకపోతే టాప్-ఎండ్ అయిన హోండా సిటీ ZX వేరియంట్‌లో V మరియు VX వేరియంట్లలో లభించే అన్ని ఫీచర్లకు అదనంగా, ఈ వేరియంట్‌కు ఇంటిగ్రేటెడ్ ఎల్‌ఈడి డైనమిక్ టర్న్ సిగ్నల్స్, ఎల్‌ఈడి ఫాగ్ ల్యాంప్స్ మరియు ఆటో-ఫోల్డింగ్ ఓఆర్‌విఎమ్ (సైడ్ మిర్రర్స్), 9 ఎల్‌ఈడి ఆర్రే హెడ్‌ల్యాంప్స్ ఉన్నాయి. ఇంటీరియర్‌లో, రంధ్రాలు కలిగిన లెథర్ అప్‌హోలెస్ట్రీ, ఉడెన్ యాక్సెంట్స్, వన్-టచ్ అప్ అండ్ డౌన్ యాంటీ పించ్ పవర్ విండోస్, రిమోట్ ఆపరేటెడ్ సన్‌రూఫ్ వంటి ప్రీమియం ఫీచర్లున్నాయి.

MOST READ: 2 కోట్ల విలువైన లంబోర్ఘిని కారుని సొంతం చేసుకున్న భారతీయ నిరుద్యోగి, ఎలానో తెలుసా ?

కొత్త 2020 హోండా సిటీ బ్రోచర్ లీక్ - వేరియంట్ల వివరాలు

ఇంకా ఇందులో హ్యాండ్లింగ్ అసిస్ట్, హిల్ స్టార్ట్, మొత్తం ఆరు ఐ-ఎస్ఆర్ఎస్ ఎయిర్ బ్యాగ్స్, వెహికల్ స్టెబిలిటీ అసిస్ట్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (టిపిఎంఎస్), ఈబిడితో కూడిన ఏబిఎస్ వంటి సేఫ్టీ ఫీచర్లు కూడా ఉన్నాయి.

కొత్త 2020 హోండా సిటీ బ్రోచర్ లీక్ - వేరియంట్ల వివరాలు

కొత్త హోండా సిటీ ధర మినహా ఇతర అన్ని వివరాలు ఇప్పటికే విడుదలయ్యాయి. మా డ్రైవ్‌స్పార్క్ బృందం కూడా కొత్త సిటీ సెడాన్ కారు పెట్రోల్, డీజిల్ వెర్షన్లను ఇటీవలే టెస్ట్ డ్రైవ్ చేసింది. - పూర్తి రివ్యూ కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

MOST READ: మీరు ఇప్పటివరకు చూడని అరుదైన మరియు అందమైన హిందుస్తాన్ ట్రెక్కర్

కొత్త 2020 హోండా సిటీ బ్రోచర్ లీక్ - వేరియంట్ల వివరాలు

కొత్త 2020 హోండా సిటీ సెడాన్ పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో లభ్యం కానుంది. పెట్రోల్ వెర్షన్‌లో 1.5-లీటర్ ఐ-విటిఇసి (డిఓహెచ్‌సి) డబుల్ ఓవర్-హెడ్ కామ్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 120 బిహెచ్‌పి శక్తిని మరియు 145 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది.

కొత్త 2020 హోండా సిటీ బ్రోచర్ లీక్ - వేరియంట్ల వివరాలు

ఇకపోతే 1.5-లీటర్ ఐ-డిటిఇసి డీజిల్ ఇంజన్ గరిష్టంగా 100 బిహెచ్‌పి శక్తిని మరియు 200 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ రెండు ఇంజన్లు కూడా స్టాండర్డ్ 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో లభిస్తాయి. కేవలం పెట్రోల్ వెర్షన్‌లో మాత్రమే ఆప్షనల్ 7-స్పీడ్ సివిటి ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ను ఆఫర్ చేస్తున్నారు.

MOST READ: టాటా నానో కారును ఢీ కొట్టి దెబ్బతిన్న హోండా సిటీ కార్ ; [వీడియో]

కొత్త 2020 హోండా సిటీ బ్రోచర్ లీక్ - వేరియంట్ల వివరాలు

హోండా సిటీ సెడాన్ వేరియంట్ బ్రోచర్ లీక్‌పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

ఈ బ్రోచర్‌ను చూస్తుంటే, హోండా నుంచి వస్తున్న ఐదవ తరం సిటీ సెడాన్ బేస్ V వేరియంట్‌లో కంపెనీ బెస్ట్-ఇన్ క్లాస్ ఫీచర్లను ఆఫర్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. ప్రారంభ ధరలోనే కారులో కావల్సిన దాదాపు అన్ని ఫీచర్లు ఈ వేరియంట్‌లో లభ్యమవుతున్నాయి. కొత్త హోండా సిటీ సెడాన్ ఈ సెగ్మెంట్లో హ్యుందాయ్ వెర్నా, స్కోడా రాపిడ్, ఫోక్స్‌వ్యాగన్ వెంటో టొయోటా యారిస్ వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది.

Source: Team BHP

Most Read Articles

Read more on: #హోండా #honda
English summary
As per a recent report by Teambhp, the all-new fifth-generation Honda City will be available in three variants: V, VX and ZX. According to the leaked brochure, the new City will be loaded with features from the base V trim onwards. Read in Telugu.
Story first published: Sunday, July 12, 2020, 9:05 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X