కొత్త 2020 హోండా జాజ్ విడుదల - ధర, ఫీచర్లు, మార్పులు, వివరాలు

హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ తమ కొత్త '2020 జాజ్ బిఎస్6' ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. దేశీయ విపణిలో కొత్త హోండా జాజ్ ప్రారంభ ధర రూ.7.50 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది.

కొత్త 2020 హోండా జాజ్ విడుదల - ధర, ఫీచర్లు, మార్పులు, వివరాలు

కొత్త 2020 హోండా జాజ్ కారు కేవలం పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌తో మాత్రమే లభ్యం కానుంది. ఇది మూడు వేరియంట్లలో (వి, విఎక్స్, జెడ్ఎక్స్) లభిస్తుంది. ప్రతి వేరియంట్ మ్యాన్యువల్ లేదా సివిటి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభిస్తుంది.

కొత్త 2020 హోండా జాజ్ విడుదల - ధర, ఫీచర్లు, మార్పులు, వివరాలు

పెట్రోల్ ఇంజన్ విషయానికి వస్తే, కొత్త 2020 హోండా జాజ్ హ్యాచ్‌బ్యాక్‌లో బిఎస్4 మోడళ్లలో ఉపయోగించిన అదే 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్‌ను కొత్తగా బిఎస్6కి అప్‌డేట్ చేశారు. ఈ ఇంజన్ మునపటి మాదిరిగానే 89 బిహెచ్‌పి శక్తిని మరియు 110 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది.

MOST READ: స్కొడా ఎన్యాక్ ఐవి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఇంటీరియర్ స్కెచెస్ విడుదల

కొత్త 2020 హోండా జాజ్ విడుదల - ధర, ఫీచర్లు, మార్పులు, వివరాలు

ఈ ఇంజన్ 5-స్పీడ్ మాన్యువల్ లేదా 7-స్పీడ్ సివిటి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో జతచేయబడి ఉంటుంది. ఈ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌లో సెగ్మెంట్ ఫస్ట్ ఫీచర్‌గా ఆటోమేటిక్ గేర్‌బాక్స్ వేరియంట్లలో స్పోర్టీ పాడిల్ షిఫ్టర్లను కూడా ఆఫర్ చేస్తున్నారు.

కొత్త 2020 హోండా జాజ్ విడుదల - ధర, ఫీచర్లు, మార్పులు, వివరాలు

హోండా పేర్కొన్న సమాచారం ప్రకారం, మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జతచేయబడిన కొత్త బిఎస్6 కంప్లైంట్ జాజ్ లీటరుకు 16.6 కి.మీ మైలేజీనిస్తుంది. అలాగే, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడిన జాజ్ లీటరుకు 17.1 కి.మీ మైలేజీని అందిస్తుంది. ఆ రెండు గణాంకాలు ఏఆర్ఏఐ ధృవీకరించబడిన డేటా, వాస్తవ పరిస్థితులలో ఇవి మారే అవకాశం ఉంది.

MOST READ: మహీంద్రా మరాజో బిఎస్6 విడుదల - ధర, ఫీచర్లు, వివరాలు

కొత్త 2020 హోండా జాజ్ విడుదల - ధర, ఫీచర్లు, మార్పులు, వివరాలు

కొత్త 2020 హోండా జాజ్ బిఎస్‌6 మోడల్‌లో కేవలం ఇంజన్ అప్‌గ్రేడ్స్ మాత్రమే కాకుండా, డిజైన్ పరంగా కొన్ని కాస్మోటిక్ మార్పులు కూడా ఉన్నాయి. మునపటి తరం హోండా జాజ్ హ్యాచ్‌బ్యాక్‌తో పోల్చుకుంటే కొత్త 2020 హోండా జాజ్ హ్యాచ్‌బ్యాక్ కారులో ఇంటీరియర్ మరియు ఎక్స్‌టీరియర్లలో మార్పులు చేర్పులు ఉన్నాయి.

కొత్త 2020 హోండా జాజ్ విడుదల - ధర, ఫీచర్లు, మార్పులు, వివరాలు

ఎక్స్‌టీరియర్లలో చేసిన మార్పుల విషయానికి వస్తే, ఇందులో ప్రధానంగా క్రోమ్ యాక్సెంట్స్‌తో గార్నిష్ చేసిన గ్లోసీ బ్లాక్ ఫ్రంట్ గ్రిల్, ఇంటిగ్రేటెడ్ ఎల్‌ఈడి డిఆర్‌ఎల్స్‌తో కూడిన హెడ్‌లైట్స్, కొత్త ఫాగ్ లాంప్స్ మరియు రీడిజైన్ చేసిన ఫ్రంట్ అండ్ రియర్ బంపర్, అన్ని వైపులా ఎల్ఈడి లైట్స్, కొత్త అల్లాయ్ వీల్స్ డిజైన్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ కొత్త మార్పులతో రానున్న 2020 హోండా జాజ్ బయటి వైపు నుంచి మరింత షార్ప్ లుక్‌తో కనిపించనుంది.

MOST READ: కియా సోనెట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ మైలేజ్ గణాంకాలను వెల్లడించిన ఏఆర్ఏఐ!

కొత్త 2020 హోండా జాజ్ విడుదల - ధర, ఫీచర్లు, మార్పులు, వివరాలు

ఇక ఇంటీరియర్స్‌లో చేసిన మార్పుల విషయానికి వస్తే, వన్ టచ్ ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్, క్రూయిజ్ కంట్రోల్, కీలెస్ ఎంట్రీ, మాన్యువల్ మరియు సివిటి రెండింటిలోనూ పుష్-బటన్ స్టార్ట్ / స్టాప్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లేను సపోర్ట్ చేసే 7 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

కొత్త 2020 హోండా జాజ్ విడుదల - ధర, ఫీచర్లు, మార్పులు, వివరాలు

సేఫ్టీ ఫీచర్లను గమనిస్తే, కొత్త హోండా జాజ్‌లో రెండు ఎస్‌ఆర్‌ఎస్ ఎయిర్‌బ్యాగులు, ఈబిడితో కూడిన ఏబిఎస్, గైడ్‌లైన్స్‌తో కూడిన రియర్ కెమెరా, రియర్ పార్కింగ్ సెన్సార్లు, ఇంపాక్ట్-మిటిగేషన్ ఫ్రంట్ హెడ్‌రెస్ట్, యాంటీ-తెఫ్ట్ సిస్టమ్, ప్రమాద సమయంలో పాదచారుల గాయం తగ్గించే టెక్నాలజీ మరియు వన్-టచ్ పించ్ గార్డుతో డ్రైవర్ సైడ్ విండో ఆపరేషన్ వంటి కొన్ని కీలకమైన ఫీచర్లు ఉన్నాయి.

MOST READ: గుడ్‌న్యూస్.. డిసెంబర్ 31 వరకూ వాహన డాక్యుమెంట్స్ వ్యాలిడిటీ పొడగింపు

కొత్త 2020 హోండా జాజ్ విడుదల - ధర, ఫీచర్లు, మార్పులు, వివరాలు

కొత్త హోండా జాజ్ ఐదు రంగులో లభ్యమవుతుంది. అవి - రేడియంట్ రెడ్ మెటాలిక్, ప్లాటినం వైట్ పెరల్, లూనార్ సిల్వర్ మెటాలిక్, గోల్డెన్ బ్రౌన్ మెటాలిక్, మోడరన్ స్టీల్ మెటాలిక్. దేశవ్యాప్తంగా ఉన్న హోండా డీలర్లు ఇప్పటికే కొత్త జాజ్ కోసం బుకింగ్‌లను కూడా స్వీకరిస్తున్నారు.

కొత్త 2020 హోండా జాజ్ విడుదల - ధర, ఫీచర్లు, మార్పులు, వివరాలు

కస్టమర్లు హోండా డీలర్‌షిప్ కేంద్రాలలో రూ.21,000 బుకింగ్ అడ్వాన్స్ చెల్లించి 2020 బిఎస్6 జాజ్ కారును బుక్ చేసుకోవచ్చు. లేదంటే, కస్టమర్లు ఇంటి వద్ద నుంచే హోండా కార్స్ ఇండియా అధీకృత వెబ్‌సైట్‌ను సందర్శించి 'హోండా ఫ్రమ్ హోమ్' ప్లాటఫామ్ ద్వారా రూ.5,000 నామమాత్రపు మొత్తాన్ని చెల్లించి ఈ కారును బుక్ చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది.

MOST READ: టాటా మోటార్స్ ఛైర్మన్‌కు అందజేసిన టాటా నెక్సాన్ ఇవి

కొత్త 2020 హోండా జాజ్ విడుదల - ధర, ఫీచర్లు, మార్పులు, వివరాలు

హోండా జాజ్ బిఎస్6 ప్రీమియం హ్యాచ్‍బ్యాక్ విడుదలపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ విభాగంలో విడుదలైన కొత్త 2020 హోండా జాజ్ సరికొత్త స్టైల్ మరియు ఫీచర్లతో మునుపటి కన్నా మరింత ఆకర్షనీయంగా మారింది. కొత్త జాజ్ ఈ విభాగంలో మారుతి సుజుకి బాలెనో, టొయోటా గ్లాంజా, టాటా ఆల్ట్రోజ్ మరియు ఫోక్స్‌వ్యాగన్ పోలో వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది.

Most Read Articles

Read more on: #హోండా #honda
English summary
Honda Cars India has introduced the 2020 Jazz premium hatchback in the Indian market. The new Honda Jazz hatchback is available with a starting price of Rs 7.50 lakh, ex-showroom (Delhi). Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X