ఇండియన్ మార్కెట్లో త్వరలో అడుగుపెట్టనున్న బిఎస్ 6 హ్యుందాయ్ ఎలాంట్రా

హ్యుందాయ్ కంపెనీ తన బ్రాండ్ అయిన ఎలంట్రాను బిఎస్ 6 కంప్లైంట్ డీజిల్ ఇంజిన్‌ వెర్షన్ లో పరిచయం చేయనున్నారు. ఈ కొత్త హ్యుందాయ్ ఎలాంట్రా ఈ ఏడాది బిఎస్ 6 కంప్లైంట్ డీజిల్ ఎలంట్రాను కంపెనీ విడుదల చేస్తుందని భావిస్తున్నారు. బిఎస్-6 హ్యుందాయ్ ఎలాంట్రా గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.

ఇండియన్ మార్కెట్లో త్వరలో అడుగుపెట్టనున్న బిఎస్ 6 హ్యుందాయ్ ఎలాంట్రా

కార్‌ దేఖో ప్రకారం, కంపెనీ బిఎస్ 6 డీజిల్ పవర్‌ట్రెయిన్ ఎంపికలను కలిగి ఉన్న ప్రీమియం సెడాన్‌ యొక్క డాక్యుమెంట్ వెల్లడించింది. మాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్లతో ఎలంట్రా అందుబాటులో ఉంటుందని డాక్యుమెంట్ లో తెలియజేయబడింది.

ఇండియన్ మార్కెట్లో త్వరలో అడుగుపెట్టనున్న బిఎస్ 6 హ్యుందాయ్ ఎలాంట్రా

బిఎస్-6 డీజిల్ వెర్షన్ ఎలాంట్రా 1.5 లీటర్ నాలుగు సిలిండర్ల డీజిల్ ఇంజిన్ కలిగి ఉంది. 114 బిహెచ్‌పి మరియు 250 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. దీనికి ఆరు స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌కు జతచేయబడుతుంది.

ఇండియన్ మార్కెట్లో త్వరలో అడుగుపెట్టనున్న బిఎస్ 6 హ్యుందాయ్ ఎలాంట్రా

బిఎస్-6 ఎలాంట్రా మూడు వేరియంట్లలో లభిస్తుంది. అవి ఎస్, ఎస్ఎక్స్ మరియు ఎస్ఎక్స్ (ఓ) వేరియంట్లు. ఎస్ వేరియంట్ మాన్యువల్ ట్రాన్స్మిషన్కు పరిమితం చేయబడుతుంది, మరియు ఎస్ఎక్స్ (ఓ) ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో మాత్రమే అందించబడుతుంది. అయితే ఎస్ఎక్స్ వేరియంట్ మాత్రమే మాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఎంపికలతో అందించబడుతుంది.

ఇండియన్ మార్కెట్లో త్వరలో అడుగుపెట్టనున్న బిఎస్ 6 హ్యుందాయ్ ఎలాంట్రా

ఆన్-సేల్ హ్యుందాయ్ ఎలంట్రా మోడల్, సింగిల్ ఇంజన్ ఎంపికతో లభిస్తుంది. 2.0 లీటర్ పెట్రోల్ ఇంజన్ 152 బిహెచ్‌పి మరియు 192 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది ఆప్సనల్ సిక్స్-స్పీడ్ టార్క్-కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో ఆరు-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జతచేయబడుతుంది.

ఇండియన్ మార్కెట్లో త్వరలో అడుగుపెట్టనున్న బిఎస్ 6 హ్యుందాయ్ ఎలాంట్రా

పవర్‌ట్రెయిన్‌తో పాటు, ఎలంట్రా డీజిల్ వేరియంట్‌లు దాని పెట్రోల్ వేరియంట్ల నుండి అన్ని లక్షణాలను కూడా కలిగి ఉంటుందని ఆశించవచ్చు. ఈ కొత్త బిఎస్-6 ఎలాంట్రాలో కొత్త ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌లు, ట్రయాంగులర్ ఫాగ్ లైట్స్, అల్లాయ్ వీల్స్ వంటివి ఉన్నాయి.

ఇండియన్ మార్కెట్లో త్వరలో అడుగుపెట్టనున్న బిఎస్ 6 హ్యుందాయ్ ఎలాంట్రా

కొత్త హ్యుందాయ్ ఎలాంట్రా లోపలి భాగంలో ఆపిల్ కార్ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో, ఇన్ఫినిటీ సౌండ్ సిస్టమ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, టైర్-ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, వైర్‌లెస్ ఛార్జింగ్, 10 వే పవర్-అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్‌తో ఎనిమిది అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను కలిగి ఉంది. , హ్యాండ్స్-ఫ్రీ టెయిల్‌గేట్ మరియు క్రూయిజ్ కంట్రోల్ వంటివి కూడా ఇందులో ఉంటాయి.

ఇండియన్ మార్కెట్లో త్వరలో అడుగుపెట్టనున్న బిఎస్ 6 హ్యుందాయ్ ఎలాంట్రా

హ్యుందాయ్ ఎలంట్రా డీజిల్ వెర్షన్ ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసిన తరువాత హోండా సివిక్ మరియు స్కోడా ఆక్టేవియా వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. హ్యుందాయ్ బిఎస్-6 ఎలంట్రా డీజిల్ ధర రూ. 16 లక్షల నుంచి రూ. 21 లక్షల మధ్య ఉంటుందని భావిస్తున్నారు.

ఇండియన్ మార్కెట్లో త్వరలో అడుగుపెట్టనున్న బిఎస్ 6 హ్యుందాయ్ ఎలాంట్రా

డ్రైవ్‌‌స్పార్క్ తెలుగు అభిప్రాయం.. !

హ్యుందాయ్ ఎలాంట్రా ప్రీమియం సెడాన్ 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ని కలిగి ఉంటుంది. అంతే కాకుండా ప్రీమియం సెడాన్‌తో కొత్త పవర్‌ట్రెయిన్ ఆప్షన్‌ను విడుదల చేయడం ద్వారా ఎలంట్రా అమ్మకాలను పెంచాలని హ్యుందాయ్ లక్ష్యంగా పెట్టుకుంది.

Most Read Articles

English summary
Hyundai Elantra BS6 1.5-Litre Diesel Engine To Be Introduced Soon In India. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X