కొత్త హ్యుందాయ్ ఐ20 బుకింగ్స్ షురూ.. రూ.21,000 లకే బుక్ చేసుకోవచ్చు..

హ్యుందాయ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కొత్త తరం 2020 ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ ఐ20 కోసం నేటి (అక్టోబర్ 28, 2020వ తేదీ) నుండి అధికారికంగా బుకింగ్‌లను స్వీకరిస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. కస్టమర్లు ఇప్పుడు రూ.21,000 టోకెన్ అమౌంట్ చెల్లించి కొత్త హ్యుందాయ్ ఐ20 కారును బుక్ చేసుకోవచ్చు.

కొత్త హ్యుందాయ్ ఐ20 బుకింగ్స్ షురూ.. రూ.21,000 లకే బుక్ చేసుకోవచ్చు..

దేశవ్యాప్తంగా ఉన్న హ్యుందాయ్ అధీకృత డీలరును సంప్రదించి కానీ లేదా హ్యుందాయ్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి కానీ కస్టమర్లు ఈ కొత్త కారును బుక్ చేసుకోవచ్చని కంపెనీ వివరించింది. బుకింగ్స్ ప్రారంభ తేదీతో పాటుగా కంపెనీ ఈ కొత్త తరం మోడల్‌ను మార్కెట్లో విడుదల చేసే తేదీని కూడా ప్రకటించింది.

కొత్త హ్యుందాయ్ ఐ20 బుకింగ్స్ షురూ.. రూ.21,000 లకే బుక్ చేసుకోవచ్చు..

కంపెనీ పేర్కొన్న సమాచారం ప్రకారం, నవంబర్ 5, 2020వ తేదీన కొత్త 2020 హ్యుందాయ్ ఐ20 కారును భారత మార్కెట్లో విడుదల చేయనున్నారు. ఇప్పటికే దేశంలోని కొన్ని ప్రముఖ డీలర్‌షిప్ కేంద్రాలలో కొత్త తరం హ్యుందాయ్ ఐ20ని ప్రదర్శనకు ఉంచినట్లు సమాచారం. కొత్త హ్యుందాయ్ ఐ20 హ్యాచ్‌బ్యాక్‌ను ఇంటీరియర్ మరియు ఎక్స్టీరియర్ పరంగా పూర్తిగా రీడిజైన్ చేశారు.

MOST READ:బజాజ్ సిటి100 'కడక్' మోటార్‌సైకిల్ విడుదల; ధర, ఫీచర్లు

కొత్త హ్యుందాయ్ ఐ20 బుకింగ్స్ షురూ.. రూ.21,000 లకే బుక్ చేసుకోవచ్చు..

ఇదివరకటి హ్యుందాయ్ ఎలైట్ ఐ20తో పోల్చుకుంటే, సరికొత్త డిజైన్ మరియు అధునాతన ఫీచర్లతో కొత్త తరం ఐ20 అందుబాటులోకి రానుంది. అయితే, ఓవరాల్ ఐ20 సిల్హౌట్ మాత్రం యధావిధిగా ఉండనుంది. కొత్త హ్యుందాయ్ ఐ20 కారను బ్రాండ్ యొక్క 'సెన్సియస్ స్పోర్టినెస్' గ్లోబల్ డిజైన్ లాంగ్వేజ్‌ను అనుసరించి డిజైన్ చేశారు.

ఈ కారు ముందు భాగంలో పెద్ద క్యాస్కేడింగ్ గ్రిల్, షార్ప్‌గా కనిపించే ఎల్‌ఈడి హెడ్‌ల్యాంప్‌లు, ఎల్‌ఈడి డిఆర్‌ఎల్‌లు, జెడ్ ఆకారంలో ఉండే ఎల్‌ఈడి టెయిల్ లైట్స్, ఫ్రంట్ బంపర్‌పై త్రిభుజాకార ఫాగ్ ల్యాంప్ హౌసింగ్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, స్టైలిష్ అల్లాయ్ వీల్స్ డిజైన్ మరియు డ్యూయెల్-టోన్ పెయింట్ స్కీమ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

MOST READ:నీటిపై ల్యాండ్ అయ్యే విమానం మీరు ఎప్పుడైనా చూసారా.. అయితే ఇది చూడండి

కొత్త హ్యుందాయ్ ఐ20 బుకింగ్స్ షురూ.. రూ.21,000 లకే బుక్ చేసుకోవచ్చు..

ఇంటీరియర్స్‌లో కూడా అనేక కొత్త ఫీచర్లు ఉన్నాయి. ఇందులో పూర్తిగా సరికొత్త డిజైన్‌తో కూడిన డాష్‌బోర్డ్ మరియు క్యాబిన్ లేఅవుట్ కనిపిస్తుంది. ఇందులో మౌంటెడ్ కంట్రోల్స్‌తో కూడిన స్పోర్టి స్టీరింగ్ వీల్, ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటోలతో పాటుగా బ్రాండ్ యొక్క బ్లూ లింక్ కనెక్ట్ టెక్నాలజీతో కూడిన పెద్ద ఫ్లోటింగ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్, వైర్‌లెస్ ఛార్జింగ్, బోస్ స్పీకర్లు, యాంబియంట్ లైటింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

కొత్త హ్యుందాయ్ ఐ20 బుకింగ్స్ షురూ.. రూ.21,000 లకే బుక్ చేసుకోవచ్చు..

కొత్త హ్యుందాయ్ ఐ20 మొత్తం నాలుగు వేరియంట్లలో (మాగ్నా, స్పోర్ట్జ్, ఆస్టా, ఆస్టా ఆప్షనల్) లభ్యం కానుంది. ఇది 1.2 లీటర్ పెట్రోల్, 1.5 లీటర్ డీజిల్ మరియు 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లతో లభ్యం కానుంది. కస్టమర్ ఎంచుకునే ఇంజన్‌ను బట్టి, ఇందులోని ట్రాన్సిమిషన్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. ఈ జాబితాలో మాన్యువల్ ట్రాన్స్‌మిషన్, ఇంటెలిజెంట్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ (ఐఎమ్‌టి), ఇంటెలిజెంట్ వేరియబుల్ ట్రాన్స్‌మిషన్ (ఐవిటి) మరియు 7-స్పీడ్ డిసిటి ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లు ఉన్నాయి.

MOST READ:చీపురు పట్టి రోడ్డు శుభ్రం చేసిన ట్రాఫిక్ పోలీస్.. ఎందుకో తెలుసా ?

కొత్త హ్యుందాయ్ ఐ20 బుకింగ్స్ షురూ.. రూ.21,000 లకే బుక్ చేసుకోవచ్చు..

సరికొత్త హ్యుందాయ్ ఐ20 ఆరు మోనో-టోన్ (సింగిల్ కలర్) మరియు రెండు డ్యూయల్-టోన్ (డబుల్ కలర్) పెయింట్ స్కీమ్స్‌లో లభిస్తుంది. మోనో-టోన్ కలర్ ఆప్షన్లలో పోలార్ వైట్, టైఫూన్ సిల్వర్, టైటాన్ గ్రే, ఫైరీ రెడ్, స్టార్రి నైట్ మరియు మెటాలిక్ కాపర్ ఉన్నాయి. అలాగే, డ్యూయెల్-టోన్ కలర్ ఆప్షన్లలో ఫైరీ రెడ్ / బ్లాక్ రూఫ్ మరియు పోలార్ వైట్ / బ్లాక్ రూఫ్ ఉన్నాయి. అయితే, ఈ రెండు కలర్ ఆప్షన్లు మాత్రం టాప్-ఎండ్ వేరియంట్లలో మాత్రమే లభిస్తాయి.

కొత్త హ్యుందాయ్ ఐ20 బుకింగ్స్ షురూ.. రూ.21,000 లకే బుక్ చేసుకోవచ్చు..

కొత్త ఐ20 బుకింగ్స్ ప్రారంభం గురించి హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ ఎమ్‌డి మరియు సీఈఓ ఎస్ఎస్ కిమ్ మాట్లాడుతూ, "హ్యుందాయ్ సంస్థ కోసం ఐ20 ఒక సూపర్ పెర్ఫార్మర్ బ్రాండ్, ఇది ఆధునిక భారతీయ వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా ఒక దశాబ్దానికి పైగా మార్కెట్ లీడర్‌గా కొనసాగింది. సరికొత్త ఐ20 ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ విభాగంలో దాని సొగసైన స్టైల్, ఉత్కంఠభరితమైన పనితీరు మరియు సరిపోలని కొత్త సాంకేతికతలతో సరికొత్త బెంచ్‌మార్క్‌లను తిరిగి స్థాపించేందుకు అన్ని విధాలుగా సిద్ధంగా ఉందని" అన్నారు.

MOST READ:నడి రోడ్డుపై పోలీస్ చెంప చెళ్లుమనిపించిన మహిళ.. ఎందుకో తెలుసా

కొత్త హ్యుందాయ్ ఐ20 బుకింగ్స్ షురూ.. రూ.21,000 లకే బుక్ చేసుకోవచ్చు..

కొత్త తరం హ్యుందాయ్ ఐ20 భారత మార్కెట్లో విడుదలైన తర్వాత, ఇది ఈ విభాగంలో మారుతి సుజుకి బాలెనో, టాటా ఆల్ట్రోజ్, ఫోక్స్‌వ్యాగన్ పోలో మరియు హోండా జాజ్ వంటి ప్రీమియం మోడళ్లకు పోటీగా నిలుస్తుంది. ఈ మోడల్ విడుదల సమయంలో దీని ధరను అధికారికంగా ప్రకటించనున్నారు. అయితే, మార్కెట్ అంచనాల ప్రకారం, దీని ధర రూ.5 లక్షల నుండి రూ.10 లక్షల మధ్యలో (ఎక్స్-షోరూమ్) ఉండొచ్చని తెలుస్తోంది.

కొత్త హ్యుందాయ్ ఐ20 బుకింగ్స్ షురూ.. రూ.21,000 లకే బుక్ చేసుకోవచ్చు..

కొత్త 2020 హ్యుందాయ్ ఐ20 బుకింగ్స్ ప్రారంభంపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

పూర్తి రీడిజైన్‌తో వస్తున్న సరికొత్త హ్యుందాయ్ ఐ20 గతంలో కంటే మరింత స్పోర్టియర్‌గా, ప్రీమయంగా కనిపిస్తుంది. ఈ కొత్త మోడల్ ఇప్పుడు మునపటి కన్నా ఎక్కువ మంది కస్టమర్లను ఆకర్షించగలదని కంపెనీ ధీమాగా ఉంది. ఈ కారుకి సంబంధించిన మరిన్ని వివరాలు నవంబర్ 5న వెల్లడి కానున్నాయి.

Most Read Articles

English summary
Hyundai has announced the start of bookings for their upcoming 'all-new' i20 premium hatchback for the Indian market. The all-new Hyundai i20 can now be booked online for an amount of Rs 21,000. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X