హ్యుందాయ్ నుంచి రానున్న సరికొత్త ఎలైట్ ఐ20 - ఫొటోలు, వివరాలు

కొరియన్ కార్ బ్రాండ్ హ్యుందాయ్ ఇండియా, దేశీయ విపణిలో విక్రయిస్తున్న ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ ఎలైట్ ఐ20లో ఓ సరికొత్త తరం మోడల్‌ను మార్కెట్లోకి ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. మార్కెట్లో లభిస్తున్న ప్రస్తుతరం ఎలైట్ ఐ20తో పోల్చుకుంటే, సరికొత్త డిజైన్ మరియు అధునాతన ఫీచర్లతో ఇది అందుబాటులోకి రానుంది.

హ్యుందాయ్ నుంచి రానున్న సరికొత్త ఎలైట్ ఐ20 - ఫొటోలు, వివరాలు

హ్యుందాయ్ తమ నెక్స్ట్ జెననరేషన్ ఎలైట్ ఐ20 హ్యాచ్‌బ్యాక్‌ను దేశీయ మార్కెట్లో విడుదల చేయటానికి ముందే, భారత రోడ్లపై ఈ మోడల్‌ను విస్తృతంగా పరీక్షిస్తోంది. ఈ నేపథ్యంలో, తాజాగా రష్‌లేన్ కొత్త తరం ఎలైట్ ఐ20 స్పై చిత్రాలను ఇంటర్నెట్‌లో లీక్ చేసింది. పూర్తిగా క్యామోఫ్లేజ్ చేసిన ఎలైట్ ఐ20 కారును కంపెనీ హైదరాబాద్ రోడ్లపై టెస్టింగ్ చేస్తోంది.

హ్యుందాయ్ నుంచి రానున్న సరికొత్త ఎలైట్ ఐ20 - ఫొటోలు, వివరాలు

ఈ టెస్టింగ్ వాహనాన్ని పూర్తిగా క్యామోఫ్లేజ్ చేయటం వలన ఇందులోని డిజైన్ ఫీచర్లు స్పష్టంగా కనిపించకపోయినప్పటికీ, దీని బాడీలైన్స్ చూస్తుంటే, ఇది పూర్తిగా కొత్త డిజైన్‌తో రాబోతున్నట్లు అర్థమవుతుంది. ఏయితే, ఓవరాల్ ఐ20 సిల్హౌట్‌ను మాత్రం యధావిధిగా ఉంచినట్లు అనిపిస్తుంది. కొత్త షార్క్‌ఫిన్ యాంటెన్నా మరియు 15 ఇంచ్ అల్లాయ్ వీల్స్‌తో ఇది ఇంటర్నేషనల్ మార్కెట్లలో లభించే మోడల్‌లా అనిపిస్తుంది.

MOST READ:భారత్‌లో రెనాల్ట్ డస్టర్ టర్బో పెట్రోల్ లాంచ్ ; ధర & ఇతర వివరాలు

హ్యుందాయ్ నుంచి రానున్న సరికొత్త ఎలైట్ ఐ20 - ఫొటోలు, వివరాలు

కొత్త తరం హ్యుందాయ్ ఎలైట్ ఐ20లో కొత్త క్యాస్కేడింగ్ గ్రిల్, మరింత అందగా కనిపించే హెడ్‌ల్యాంప్స్, కొత్త వ్రాప్ అరౌండ్ స్ప్లిట్ టెయిల్ లాంప్స్ మరియు ఈ రెండింటి అనుసంధానించే లైట్ బార్, కొత్త డ్యూయల్-టోన్ అల్లాయ్-వీల్ డిజైన్ వంటి ఫీచర్లతో ఇది ప్రస్తుత తరం ఐ20 కంటే మరింత ప్రీమియంగా కనిపిస్తుంది.

హ్యుందాయ్ నుంచి రానున్న సరికొత్త ఎలైట్ ఐ20 - ఫొటోలు, వివరాలు

అన్ని హ్యుందాయ్ మోడళ్ల మాదిరిగానే, కొత్త తరం ఐ20 ఇంటీరియర్స్ కూడా ఫూర్తి ఫీచర్లతో లోడ్ చేయబడనుంది. ఇందులో కొత్త డాష్‌బోర్డ్ డిజైన్, ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కోసం రెండు 10.25 ఇంచ్ డిస్‌ప్లేలు మరియు ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటోతో పాటుగా బ్రాండ్ యొక్క కనెక్టింగ్ టెక్నాలజీ ‘బ్లూలింక్'ని సపోర్ట్ చేసే కొత్త టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఉండొచ్చని అంచనా.

MOST READ:భారీగా తగ్గిన వోల్వో ఎక్స్‌సి టి4 ఆర్-డిజైన్ పెట్రోల్ వేరియంట్ ధర - వివరాలు

హ్యుందాయ్ నుంచి రానున్న సరికొత్త ఎలైట్ ఐ20 - ఫొటోలు, వివరాలు

కొత్త తరం హ్యుందాయ్ ఎలైట్ ఐ20 కారులో హ్యుందాయ్ వెన్యూలో కనిపించే సాంకేతిక పరిజ్ఞాన్ని ఆఫర్ చేయనున్నారు. వెన్యూ కాంపాక్ట్ ఎస్‌యూవీలో 33 వాయిస్ కమాండ్లతో కూడిన సాంకేతిక పరిజ్ఞానాన్ని కొత్త ఐ20 కారులో కూడా చూసే అవకాశం ఉంటుంది.

హ్యుందాయ్ నుంచి రానున్న సరికొత్త ఎలైట్ ఐ20 - ఫొటోలు, వివరాలు

ఈ కొత్త కారులో ఉండబోయే కొన్ని ముఖ్యమైన ఫీచర్లలో ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ సీట్లు, డ్యూయెల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, రియర్ ఎయిర్ కండిషనింగ్ వెంట్స్ మరియు బోస్ ప్రీమియం ఆడియో సిస్టమ్ మొదలైనవి ఉండొచ్చని సమాచారం. భద్రతా ఫీచర్ల విషయానికి వస్తే, ఇందులో బ్లైండ్ స్పాట్ మోనిటరింగ్, బహుళ ఎయిర్‌బ్యాగులు, ఐఎస్ఓ-ఫిక్స్ మౌంట్‌లు మొదలైనవి ఉండనున్నాయి.

MOST READ:ముంబై నుండి చెన్నైకి 1,350 కి.మీ నడిచిన వృద్ధుడు, ఇతని కథ వింటే మీకు కన్నీళ్లు వస్తాయి

హ్యుందాయ్ నుంచి రానున్న సరికొత్త ఎలైట్ ఐ20 - ఫొటోలు, వివరాలు

ఇంజన్ ఆప్షన్స్ విషయానికి వస్తే, కొత్త తరం హ్యుందాయ్ ఎలైట్ ఐ20 మూడు ఇంజన్ ఆప్షన్లతో లభ్యం కానుంది. ఇందులో 1.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్, 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ మరియు 1.5-లీటర్ డీజిల్ ఇంజన్‌లు ఉండనున్నాయి. ఇవే ఇంజన్లను కియా సెల్టోస్ మోడల్‌లో కూడా ఉపయోగిస్తున్నారు.

హ్యుందాయ్ నుంచి రానున్న సరికొత్త ఎలైట్ ఐ20 - ఫొటోలు, వివరాలు

ఈ ఇంజన్లన్నీ స్టాండర్డ్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో లభ్యం కానున్నాయి. అయితే, 1.2-లీటర్ పెట్రోల్‌పై ఆప్షనల్ సివిటి మరియు 1.5-లీటర్ డీజిల్‌పై టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లను ఆఫర్ చేసే అవకాశం ఉంది. అలాగే, ఇందులో శక్తివంతమైన 1.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌ను 6-స్పీడ్ ఐఎమ్‌టి (ఇంటెలిజెంట్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్) మరియు 7-స్పీడ్ డిసిటి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో విడుదల చేయవచ్చని తెలుస్తోంది.

MOST READ:చిన్న నిర్లక్ష్యం ఎంత పెద్ద ప్రమాదానికి కారణమవుతుందో చూడండి

హ్యుందాయ్ నుంచి రానున్న సరికొత్త ఎలైట్ ఐ20 - ఫొటోలు, వివరాలు

కొత్త తరం హ్యుందాయ్ ఎలైట్ ఐ20 మార్కెట్లో విడదలైన తర్వాత ఇది ఈ విభాగంలో మారుతి సుజుకి బాలెనో, టాటా ఆల్ట్రోజ్, ఫోక్స్‌వ్యాగన్ పోలో, టొయోటా గ్లాంజా మరియు హోండా జాజ్ వంటి ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ మోడళ్లతో పోటీగా నిలుస్తుంది. ఇందులో చేయబోయే కొత్త మార్పుల కారణంగా, ప్రస్తుత తరం ఎలైట్ ఐ20 మోడల్‌తో పోలిస్తే కొత్త తరం ఎలైట్ ఐ20 ధరల్లో గణనీయమైన పెరుగుదల ఉండొచ్చని అంచనా.

హ్యుందాయ్ నుంచి రానున్న సరికొత్త ఎలైట్ ఐ20 - ఫొటోలు, వివరాలు

కొత్త తరం హ్యుందాయ్ ఎలైట్ ఐ20 హ్యాచ్‌బ్యాక్‌పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

కొత్త తరం హ్యుందాయ్ ఎలైట్ ఐ20లో డిజైన్ మరియు ఫీచర్ల పరంగా అనేక మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉంది. ఈ మోడల్‌ను పూర్తిగా క్యామోఫ్లేజ్ చేసి టెస్టింగ్ చేయటాన్ని చూస్తుంటే, ఈ మోడల్ వచ్చే ఏడాది వరకూ ఉత్పత్తి దశకు చేరుకునే అవకాశాలు కనిపించడం లేదు. ప్రస్తుత తరం ఐ20 మోడల్ కేవలం పెట్రోల్ ఇంజన్‌తో మాత్రమే లభిస్తుండగా, కొత్త తరం ఐ20 మాత్రం బెస్ట్ ఇన్-క్లాస్ ఫీచర్లతో పాటుగా మూడు రకాల ఇంజన్, గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభ్యమయ్యే అవకాశం ఉంది.

Source:Rushlane

Most Read Articles

English summary
Hyundai India will be launching a next-generation model of the i20 premium hatchback in the market. The upcoming model will feature a new design and a host of updates inside and out over the current-gen Elite i20. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X