కొత్త 2020 హ్యుందాయ్ టక్సన్ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ ; ధర & ఇతర వివరాలు

హ్యుందాయ్ ఇండియా కొత్త టక్సన్ ఫేస్ లిఫ్ట్ ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ కొత్త (2020) హ్యుందాయ్ టక్సన్ ఫేస్‌లిఫ్ట్ యొక్క ప్రారంభ ధర రూ. 22.3 లక్షలు (ఎక్స్‌షోరూమ్, ఇండియా). ఈ కొత్త హ్యుందాయ్ టక్సన్ గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

కొత్త 2020 హ్యుందాయ్ టక్సన్ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ ; ధర & ఇతర వివరాలు

కొత్త హ్యుందాయ్ టక్సన్ మూడు వేరియంట్లలో లభిస్తుంది. అవి జిఎల్ (ఓ), జిఎల్ఎస్ మరియు జిఎల్ఎస్ 4 డబ్ల్యుడి అనే మూడు వేరియంట్లు. ఈ మూడు వేరియంట్లలో టాప్-స్పెక్ ట్రిమ్, డీజిల్ యూనిట్‌తో మాత్రమే అందించబడుతుంది. మిగిలిన రెండు (జిఎల్ (ఓ) మరియు జిఎల్‌ఎస్) పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఎంపికలతో వస్తాయి.

కొత్త 2020 హ్యుందాయ్ టక్సన్ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ ; ధర & ఇతర వివరాలు

ఈ ఏడాది ప్రారంభంలో ఫిబ్రవరిలో జరిగిన 2020 ఆటో ఎక్స్‌పోలో కొత్త హ్యుందాయ్ టక్సన్ ఫేస్‌లిఫ్ట్‌ను ప్రదర్శించబడింది. కొత్త హ్యుందాయ్ టక్సన్ ఫేస్ లిఫ్ట్ దాని మునుపటి మోడల్ కంటే ఎక్కువ నవీనీకరణలు కలిగి ఉంటుంది. అంతే కాకుండా అనేక కొత్త ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది.

కొత్త 2020 హ్యుందాయ్ టక్సన్ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ ; ధర & ఇతర వివరాలు

హ్యుందాయ్ టక్సన్ ఫేస్‌లిఫ్ట్ లో మాడిఫైడ్ ఎల్‌ఇడి హెడ్‌ల్యాంప్‌లు, ఎల్‌ఇడి డిఆర్‌ఎల్‌లు, పెద్ద క్యాస్కేడింగ్ ఫ్రంట్ గ్రిల్, రివైజ్డ్ ఫ్రంట్ మరియు రియర్ బంపర్స్, కొత్తగా రూపొందించిన 18 అంగుళాల అల్లాయ్ వీల్స్కలిగి ఉంటుంది. అంతే కాకుండా ఎల్‌ఇడి టైల్లైట్స్ కూడా ఉంటాయి.

కొత్త హ్యుందాయ్ టక్సన్ కొంచెం సవరించిన నంబర్ ప్లేట్ హౌసింగ్, రెయిన్ సెన్సింగ్ వైపర్స్, ముందు భాగంలో సిల్వర్ ఫినిషెడ్ స్కఫ్ ప్లేట్లు మరియు వెనుక ట్విన్ ఎగ్జాస్ట్ టిప్స్ కలిగి ఉంది.

కొత్త 2020 హ్యుందాయ్ టక్సన్ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ ; ధర & ఇతర వివరాలు

టక్సన్ ఫేస్ లిఫ్ట్ లో ఫ్లోటింగ్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు కొత్త ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌తో పూర్తిగా పునఃరూపకల్పన చేసిన డాష్‌బోర్డ్ ఉంటుంది. ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఆపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో మరియు బ్రాండ్ యొక్క లేటెస్ట్ వెర్షన్ బ్లూ లింక్ కనెక్ట్ టెక్నాలజీతో వస్తుంది.

కొత్త 2020 హ్యుందాయ్ టక్సన్ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ ; ధర & ఇతర వివరాలు

కొత్త హ్యుందాయ్ టక్సన్ ఎస్‌యూవీ ఇంటీరియర్‌లలోని ఇతర ఫీచర్స్ గమనించినట్లయితే ఇందులో డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, పనోరమిక్ సన్‌రూఫ్, పవర్-అడ్జస్టబుల్ డ్రైవర్ మరియు ఫ్రంట్ ప్యాసింజర్ సీట్లు, ఎక్స్టెండెడ్ లగేజ్ స్పెస్ కోసం 60:40 స్ప్లిట్ రియర్ సీట్లు, రిమోట్ ఇంజిన్ స్టార్ట్ / స్టాప్, వైర్‌లెస్ ఛార్జింగ్ వంటివి ఉంటాయి.

కొత్త 2020 హ్యుందాయ్ టక్సన్ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ ; ధర & ఇతర వివరాలు

పవర్‌ట్రెయిన్ విషయానికొస్తే, హ్యుందాయ్ టక్సన్ ఫేస్‌లిఫ్ట్ పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఎంపికలతో వస్తుంది. ఇందులో 150 బిహెచ్‌పి మరియు 192 ఎన్ఎమ్ పీక్ టార్క్ ఉత్పత్తి చేసే 2.0-లీటర్ పెట్రోల్ యూనిట్ ఉంటుంది మరియు ఇది ఆరు-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జతచేయబడుతుంది.

కొత్త 2020 హ్యుందాయ్ టక్సన్ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ ; ధర & ఇతర వివరాలు

ఇక పొతే ఇందులో ఉన్న 2.0 లీటర్ డీజిల్ ఇంజిన్ 180 బిహెచ్‌పి మరియు 400 ఎన్ఎమ్ పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

కొత్త 2020 హ్యుందాయ్ టక్సన్ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ ; ధర & ఇతర వివరాలు

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం :

కొత్త హ్యుందాయ్ టక్సన్ ఫేస్‌లిఫ్ట్ భారత మార్కెట్లో సరికొత్త ప్రీమియం ఎస్‌యూవీ ఆఫర్. కొత్త హ్యుందాయ్ టక్సన్, స్కోడా కరోక్, హోండా సిఆర్-వి మరియు జీప్ కంపాస్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. ఈ ఎస్‌యూవీ చూడటానికి చాలా ఆకర్షణీయంగా తయారుచేయబడింది.

More from DriveSpark

Article Published On: Tuesday, July 14, 2020, 14:26 [IST]
English summary
2020 Hyundai Tucson Facelift Launched In India. Read in Telugu.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+