2020 హ్యుందాయ్ వెర్నా ఫేస్‌లిఫ్ట్ బుకింగ్స్ స్టార్ట్

'హ్యుందాయ్ మోటార్స్ ఇండియా' భారత మార్కెట్ కోసం 2020 వెర్నా ఫేస్‌లిఫ్ట్‌ను వెల్లడించింది. 2020 హ్యుందాయ్ వెర్నా ఫేస్‌లిఫ్ట్ కొత్త డిజైన్‌తో పాటు అదనపు ఫీచర్లతో నవీనీకరించబడింది. ఈ కొత్త హ్యుందాయ్ ఫేస్‌లిఫ్ట్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

2020 హ్యుందాయ్ వెర్నా ఫేస్‌లిఫ్ట్ బుకింగ్స్ స్టార్ట్

2020 హ్యుందాయ్ ఫేస్‌లిఫ్ట్ బుకింగ్స్ అధికారికంగా ప్రారంభమయ్యాయని కంపెనీ ధ్రువీకరించింది. 2020 హ్యుందాయ్ వెర్నా ఫేస్‌లిఫ్ట్‌ను ఆన్‌లైన్ ద్వారా లేదా కంపెనీ డీలర్‌షిప్‌ల ద్వారా రూ. 25 వేల రూపాయలకు బుక్ చేసుకునే అవకాశం కల్పించబడింది. కొత్త హ్యుందాయ్ వెర్నా ఫేస్‌లిఫ్ట్ మార్చి 26 న ప్రారంభించనుంది. ఈ సెడాన్ డెలివరీలు భారత మార్కెట్లో విడుదలైన వెంటనే ప్రారంభమవుతాయి.

2020 హ్యుందాయ్ వెర్నా ఫేస్‌లిఫ్ట్ బుకింగ్స్ స్టార్ట్

హ్యుందాయ్ వెర్నా ఫేస్‌లిఫ్ట్ మోడల్‌లో లోపల మరియు వెలుపల అనేక మార్పులు చేయబడ్డాయి. ఈ సెడాన్‌లో చేసిన బాహ్య మార్పులు గమనించినట్లైతే ఇందులో ఇంటిగ్రేటెడ్ ఎల్‌ఇడి డిఆర్‌ఎల్‌లతో కొత్తగా రూపొందించిన ఎల్‌ఇడి హెడ్‌ల్యాంప్‌లు, ముందు భాగంలో పునర్నిర్మించిన క్యాస్కేడింగ్ గ్రిల్ డిజైన్, ట్వీక్డ్ ఫ్రంట్ బంపర్, కొత్త డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్, ఎల్‌ఇడి టైల్లైట్స్ మరియు రీ స్టైల్ బంపర్ వున్నాయి.

2020 హ్యుందాయ్ వెర్నా ఫేస్‌లిఫ్ట్ బుకింగ్స్ స్టార్ట్

ఇక లోపల నవీనీకరించిన మార్పులు ఏవంటే ఆపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో మరియు హ్యుందాయ్ యొక్క బ్లూ లింక్ కనెక్టివిటీ టెక్నాలజీ యొక్క సరికొత్త 9 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌.

2020 హ్యుందాయ్ వెర్నా ఫేస్‌లిఫ్ట్ బుకింగ్స్ స్టార్ట్

అంతే కాకుండా ఇందులో 4.2 అంగుళాల టిఎఫ్‌టి సెమీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, సన్‌రూఫ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, వైర్‌లెస్ ఛార్జింగ్, ఆర్కామిస్ సౌండ్ సిస్టమ్ మరియు హ్యాండ్స్ ఫ్రీ బూట్ ఓపెనింగ్, బ్లూ-లింక్ కనెక్ట్ టెక్నాలజీ వంటి అదనపు ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఫోన్ కాల్స్, నావిగేషన్ అసిస్టెంట్, వెదర్ అప్డేట్స్, రిమోట్ ఇంజిన్ స్టార్ట్ / స్టాప్, వెహికల్ ట్రాకింగ్ మరియు జియో-ఫెన్సింగ్ వంటివి కూడా ఉన్నాయి.

2020 హ్యుందాయ్ వెర్నా ఫేస్‌లిఫ్ట్ బుకింగ్స్ స్టార్ట్

కొత్త 2020 హ్యుందాయ్ వెర్నా ఫేస్‌లిఫ్ట్ మూడు ఇంజన్ ఎంపికలతో అందించబడుతుంది. అవి 1.5-లీటర్ పెట్రోల్, 1.5-లీటర్ డీజిల్ మరియు 1.0-లీటర్ టర్బో-పెట్రోల్. ఈ ఇంజిన్‌లన్నీ సరికొత్త బిఎస్ 6 ఉద్గార నిబంధనలకు అనుగుణంగా ఉంటాయి.

2020 హ్యుందాయ్ వెర్నా ఫేస్‌లిఫ్ట్ బుకింగ్స్ స్టార్ట్

1.5-లీటర్ పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఎంపికలు ఆరు స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌కు జతచేయబడతాయి. రెండు ఇంజన్లు ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ యూనిట్ ని కూడా అందుకుంటాయి, ఇందులో పెట్రోల్ కోసం సివిటి మరియు డీజిల్ కోసం టార్క్-కన్వర్టర్ ఉన్నాయి. చిన్న 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఏడు-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ను ప్రామాణికంగా అందుకుంటుంది.

2020 హ్యుందాయ్ వెర్నా ఫేస్‌లిఫ్ట్ బుకింగ్స్ స్టార్ట్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

2020 హ్యుందాయ్ వెర్నా ఫేస్ లిఫ్ట్ భారతదేశంలో త్వరలో లాంచ్ కానుంది. ఇది ఇండియన్ మార్కెట్లో ఒకసారి లాంచ్ అయిన తరువాత మారుతి సుజుకి సియాజ్, వోక్స్వ్యాగన్ వెంటో మరియు రాబోయే హోండా సిటీ వంటి వాటికి ప్రత్య్రర్థిగా ఉంటుంది. హ్యుండై వెర్నా ఫేస్‌లిఫ్ట్ ధరలు స్వల్పంగా పెరిగే అవకాశం ఉంది. దీని ప్రారంభ ధర దాదాపు రూ. 9 లక్షల (ఎక్స్‌షోరూమ్) వరకు ఉండే అవకాశం ఉంటుంది.

Most Read Articles

English summary
2020 Hyundai Verna Facelift Bookings Officially Begin: To Rival The Upcoming Honda City Sedan. Read in Telugu.
Story first published: Friday, March 13, 2020, 11:47 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X