మహీంద్రా టియువి300 ప్లస్ పేటెంట్ చిత్రాలు లీక్: కొత్త వివరాలు వెల్లడి!

ప్రముఖ దేశీయ యుటిలిటీ వాహన దిగ్గజం మహీంద్రా, భారత మార్కెట్ కోసం మరిన్ని కొత్త వాహనాలను పరిచయం చేయనుంది. ఈ కొత్త మోడళ్ల విడుదల వచ్చే నెల సరికొత్త మహీంద్రా థార్‌తో ప్రారంభం కానుంది. ఈ జాబితాలో సరికొత్త మహీంద్రా టియువి300 కూడా ఉంది.

మహీంద్రా టియువి300 ప్లస్ పేటెంట్ చిత్రాలు లీక్: కొత్త వివరాలు వెల్లడి!

భారతదేశంలోని తాజా ఉద్గార ప్రమాణాలకు అనుగుణంగా మహీంద్రా తమ ప్రోడక్ట్ లైనప్‌ను కూడా అప్‌డేట్ చేస్తోంది. ఈ నేపథ్యంలో మహీంద్రా టియువి300 లైనప్‌ను కూడా కంపెనీ అప్‌డేట్ చేయనుంది. ఇందులో టియువి300 ప్లస్ కూడా ఉంది. ఇందుకు సంబంధించిన పేటెంట్ చిత్రాలు ఇటీవలే లీక్ అయ్యాయి.

మహీంద్రా టియువి300 ప్లస్ పేటెంట్ చిత్రాలు లీక్: కొత్త వివరాలు వెల్లడి!

గాడివాడి లీక్ చేసిన టియువి300 ప్లస్ ఎక్స్‌టెండెడ్ ఎస్‌యూవీ పేటెంట్ చిత్రాలను గమనిస్తే, ఇందులో బోల్డ్ గ్రిల్ మరియు మధ్యలో ఉంచిన మహీంద్రా లోగోతో కొత్తగా డిజైన్ చేసిన ఫ్రంట్ ఫాసియాను గమనించవచ్చు. ఇందులో వెర్టికల్ స్లాట్ గ్రిల్ క్రింది భాగంలో హనీకోంబ్ ప్యాటర్న్‌లో ఉన్న విశాలమైన ఎయిర్-ఇన్‌టేక్‌ను కూడా చూడొచ్చు.

MOST READ:ఎట్టకేలకు భారత మార్కెట్లో అడుగుపెట్టిన కియా సోనెట్ ఎస్‌యూవీ : ధర & ఇతర వివరాలు

మహీంద్రా టియువి300 ప్లస్ పేటెంట్ చిత్రాలు లీక్: కొత్త వివరాలు వెల్లడి!

ఇతర డిజైన్ మార్పులలో ఇంటిగ్రేటెడ్ డిఆర్‌ఎల్‌ల పైభాగంలో అమర్చిన కొత్త హెడ్‌ల్యాంప్‌లు, రీడిజైన్ చేసిన బంపర్ మరియు ఫాగ్ ల్యాంప్ హౌసింగ్ ఉన్నాయి. ఇంకా ఇందులో రీడిజైన్ చేయబడిన టెయిల్-ల్యాంప్స్, రియర్ బంపర్స్ మరియు బూట్ లిడ్ వంటి మార్పులను కూడా గమనించవచ్చు.

మహీంద్రా టియువి300 ప్లస్ పేటెంట్ చిత్రాలు లీక్: కొత్త వివరాలు వెల్లడి!

ఫేస్‌లిఫ్టెడ్ ఎస్‌యూవీలో కొత్త డ్యూయెల్-టోన్ అల్లాయ్ వీల్స్ ఉండనున్నాయి. టియువి300 ప్లస్ ఎస్‌యూవీ బాక్సీ సిల్హౌట్ చూడటానికి ఇదివరకటిలానే ఉంటుంది. టియువి300 ప్లస్ ప్లాట్‌ఫామ్‌పై 2020 మహీంద్రా థార్ మరియు నెక్స్ట్ జనరేషన్ స్కార్పియో మోడళ్లను కూడా తయారు చేస్తున్నారు.

MOST READ:నమ్మండి.. ఇది నిజంగా రాయల్ ఎన్‌ఫీల్డ్ థండర్బర్డ్ 350 బైక్

మహీంద్రా టియువి300 ప్లస్ పేటెంట్ చిత్రాలు లీక్: కొత్త వివరాలు వెల్లడి!

ఇక ఇంటీరియర్స్ విషయానికి వస్తే, మహీంద్రా టియువి300 ప్లస్ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌లో ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటోలను సపోర్ట్ చేసే అప్‌డేటెడ్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంటుందని తెలుస్తోంది. క్యాబిన్‌లో పూర్తి రిఫ్రెష్డ్ ఫీల్‌ని ఇచ్చేలా మహీంద్రా జాగ్రత్తలు తీసుకోనుంది.

మహీంద్రా టియువి300 ప్లస్ పేటెంట్ చిత్రాలు లీక్: కొత్త వివరాలు వెల్లడి!

కొత్త టియువి300 ప్లస్‌లో అతిపెద్ద మార్పుగా ఇందులోని బిఎస్-6 ఇంజన్‌గా చెప్పుకోవచ్చు, దీని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. బిఎస్4 మోడళ్లలో ఉపయోగించిన 2.2-లీటర్ డీజిల్ ఇంజన్ గరిష్టంగా 120 బిహెచ్‌పి శక్తిని మరియు 280 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. సరికొత్త థార్‌లో కనిపించినట్లుగా, టియువి300లో కూడా పెట్రోల్ ఇంజన్‌ను జోడించే అవకాశం ఉంది.

MOST READ:మరోసారి అమెరికన్ మార్కెట్లో అడుగుపెట్టనున్న మహీంద్రా రోక్సర్

మహీంద్రా టియువి300 ప్లస్ పేటెంట్ చిత్రాలు లీక్: కొత్త వివరాలు వెల్లడి!

టియువి300 కాంపాక్ట్ ఎస్‌యూవీని ఆధారంగా చేసుకొని ఇందులో ఎక్స్టెండెడ్ వెర్షన్‌గా టియువి300 ప్లస్ ఫుల్ సైజ్ ఎస్‌యూవీని 2018లో విడుదల చేశారు. టియువి300తో పోల్చుకుంటే టియువి300 ప్లస్ 445 మిమీ ఎక్కువ పొడవును కలిగి ఉంటుంది. టియువి300 ప్లస్ ఎస్‌యూవీలో 9 సీట్ల కాన్ఫిగరేషన్‌ను కలిగి ఉంటుంది.

మహీంద్రా టియువి300 ప్లస్ పేటెంట్ చిత్రాలు లీక్: కొత్త వివరాలు వెల్లడి!

మహీంద్రా టియూవి300 పేటెంట్ చిత్రాల లీక్‌పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

ఆన్‌లైన్‌లో లీకైన పేటెంట్ చిత్రాలను చూస్తుంటే, టియువి300 ప్లస్ అభివృద్ధి ధశ పూర్తయినట్లుగా తెలుస్తోంది. కొత్త-తరం టియువి300 ప్లస్ కొత్త ఎక్స్‌టీరియర్, ఇంటీరియర్ డిజైన్‌లను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఇది ఖరీదైన అనుభూతిని ఇస్తుందని అంచనా. మార్కెట్లో ఇది టాటా హారియర్, హ్యుందాయ్ క్రెటా మరియు కియా సెల్టోస్ వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది.

Source: Gaadiwaadi

MOST READ:మీకు తెలుసా.. ప్రపంచంలోనే అత్యంత పొడవైన సొరంగం మార్గం, ఇదే

Most Read Articles

English summary
Mahindra is expected to launch a slew of updated models starting with the Thar from next month. The company will also be updating its TUV300 line-up to comply with the latest emission standards. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X