మారుతి సుజుకి బాలెనో టర్బో వేరియంట్ వస్తోంది; ఇదిగో టీజర్..

భారతదేశపు అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా, తమ ప్రీమియం నెక్సా డీలర్‌షిప్ కేంద్రాల ద్వారా విక్రయిస్తున్న ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ బాలెనోలో కంపెనీ మరో కొత్త వేరియంట్‌ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇందుకు సంబంధించి కంపెనీ ఓ కొత్త టీజర్‌ను కూడా విడుదల చేసింది.

మారుతి సుజుకి బాలెనో టర్బో వేరియంట్ వస్తోంది; ఇదిగో టీజర్..

ప్రస్తుతం భారతదేశంలో కొనసాగుతున్న పండుగ సీజన్‌లో బాలెనో అమ్మకాలను పెంచుకునేందుకు కంపెనీ ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే, కంపెనీ "త్వరలో ఒక పెద్ద ఆశ్చర్యం రాబోతోంది!" అంటూ ఓ కొత్త టీజర్‌ను విడుదల చేసింది. ఈ టీజర్‌ను బట్టి చూస్తుంటే, కంపెనీ బాలెనో టర్బో వేరియంట్‌ను విడుదల చేయవచ్చని తెలుస్తోంది.

మారుతి సుజుకి బాలెనో టర్బో వేరియంట్ వస్తోంది; ఇదిగో టీజర్..

గతంలో మారుతి సుజుకి 1.0 లీటర్, టర్బోచార్జ్డ్, త్రీ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ కలిగిన బాలెనో‘ఆర్ఎస్' వెర్షన్‌ను ఆఫర్ చేసినట్లుగానే కొత్త బాలెనో టర్బో పెట్రోల్ వేరియంట్‌ను కూడా విడుదల చేయవచ్చని తెలుస్తోంది. అయితే, అప్పట్లో బాలెనో ఆర్‌ఎస్ అమ్మకాలు సరిగా లేకపోవడంతో కంపెనీ ఈ మోడల్‌ను నిలిపివేసింది.

MOST READ:లగ్జరీ బైక్ కొన్న సాధారణ యువకుడు.. ఇంతకీ ఎలా కొన్నాడో తెలుసా?

మారుతి సుజుకి బాలెనో టర్బో వేరియంట్ వస్తోంది; ఇదిగో టీజర్..

బాలెనో ఆర్ఎస్ వేరియంట్ 100 బిహెచ్‌పి పవర్‌ను మరియు 150 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉండేది.

మారుతి సుజుకి బాలెనో టర్బో వేరియంట్ వస్తోంది; ఇదిగో టీజర్..

బాలెనో ముందు భాగంలో ఎల్‌ఈడి లైటింగ్ సెటప్‌తో కూడిన ప్రొజెక్టర్ హెడ్‌లైట్‌ ఉంటుంది. ఇందులో ప్రకాశవంతమైన ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్లను కూడా అమర్చారు. ముందు వైపు చేసిన క్రోమ్ గార్నిష్ కారణంగా బాలెనో మరింత ప్రీమియం లుక్ అండ్ ఫీల్‌ను కలిగి ఉంటుంది.

MOST READ:భారత మార్కెట్లో టాటా ఆల్ట్రోజ్ XM + వేరియంట్ లాంచ్ : ధర & ఇతర వివరాలు

మారుతి సుజుకి బాలెనో టర్బో వేరియంట్ వస్తోంది; ఇదిగో టీజర్..

మారుతి సుజుకి బాలెనో ఇంటీరియర్స్‌లో డ్యూయల్-టోన్ ఇంటీరియర్ థీమ్ కలిగి ఉంటుంది. మారుతి సుజుకి నుండి రానున్న కొత్త వేరియంట్ బాలెనోలో కూడా కంపెనీ యొక్క స్మార్ట్‌ప్లే స్టూడియోతో కూడిన పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంటుందని అంచనా. ఇంది ఆండ్రాయిడ్ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లేలను కూడా సపోర్ట్ చేసే అవకాశం ఉంది.

మారుతి సుజుకి బాలెనో టర్బో వేరియంట్ వస్తోంది; ఇదిగో టీజర్..

మారుతి సుజుకి బాలెనోకి సంబంధించిన ఇటీవలి వార్తలను గమనిస్తే, కంపెనీ భారత్‌లో బాలెనో అమ్మకాలు ప్రారంభించినప్పటి నుండి ఇప్పటి వరకూ 8 లక్షల యూనిట్లకు పైగా విక్రయించి ఓ కొత్త మైలురాయిని చేరుకుంది. కంపెనీ ఈ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌ను తొలిసారిగా 2015లో భారత మార్కెట్లో విడుదల చేశారు. కేవలం ఐదేళ్ల కాలంలో బాలెనో ఈ అరుదైన మైలురాయిని చేరుకోగలిగింది.

MOST READ:ఒక్క ఫోటో ద్వారా లాక్‌డౌన్ ఫీలింగ్స్ పంచుకున్న ఆనంద్ మహీంద్రా.. ఆ ఫోటో మీరు చూడండి

మారుతి సుజుకి బాలెనో టర్బో వేరియంట్ వస్తోంది; ఇదిగో టీజర్..

మారుతి సుజుకి బాలెనో కొత్త వేరియంట్‌పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

మారుతి సుజుకి నుండి రాబోయే కొత్త బాలెనో వేరియంట్ ఖచ్చితంగా శక్తివంతమైనది మరియు వేగవంతమైనది మాత్రం తెలుస్తోంది. ప్రస్తుతం దేశంలో టర్బో పెట్రోల్ ఇంజన్ కలిగి ఉన్న కార్లకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని మారుతి సుజుకి ఇండియా ఇందులో కూడా టర్బో వేరియంట్‌ను ప్రవేశపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Most Read Articles

English summary
Maruti Suzuki Releases New Teaser For The Baleno, Expected To Be Powered By A Turbo Petrol Engine. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X