Just In
- 39 min ago
కుటుంబం కోసం ఆటో డ్రైవర్‌గా మారిన 21 ఏళ్ల అమ్మాయి.. ఎక్కడో తెలుసా ?
- 3 hrs ago
మారుతి సుజుకి కస్టమర్లకు షాక్.. రూ.34,000 మేర పెరిగిన ధరలు..
- 4 hrs ago
డీలర్ల వద్దకు చేరుకుంటున్న కొత్త 2021 టొయోటా ఫార్చ్యూనర్ ఫేస్‌లిఫ్ట్
- 4 hrs ago
విడుదలకు ముందే జీప్ కంపాస్ ఫేస్‌లిఫ్ట్ వేరియంట్ల వివరాలు లీక్
Don't Miss
- Finance
ఢిల్లీలో రూ.85 దాటిన పెట్రోల్ ధరలు, ముంబైలో రూ.92
- News
25 ఏళ్ల సీఏ స్టూడెంట్ను బంధించిన పేరంట్స్.. 6 నెలలు చీకటిలో, ఏమిచ్చారంటే..
- Movies
త్రివిక్రమ్-రామ్ సినిమా.. అది అతడినే అడగాలి.. స్రవంతి రవికిశోర్ కామెంట్స్ వైరల్
- Sports
టీమిండియా విజయం వెనుక అలుపెరగని యోధుడు.!
- Lifestyle
ఆర్థిక, రాహు-కేతు సమస్యలా? కర్పూరంలో లవంగాలు వేసి కాల్చండి .. అప్పుడు జరిగే అద్భుతాలను చూడండి .. ఆశ్చర్యపోతారు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
కొత్త 2020 మారుతి సుజుకి ఎస్-క్రాస్ వేరియంట్లు, ఫీచర్ల వివరాలు లీక్
భారతదేశపు అగ్రగామి కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ నుంచి తాజాగా రానున్న కొత్త ఉత్పత్తి '2020 ఎస్-క్రాస్'. నెక్సా డీలర్‌షిప్‌ల ద్వారా ప్రత్యేకంగా విక్రయించబడుతున్న ఈ మోడల్‌లో కంపెనీ కొత్త అప్‌డేటెడ్ వెర్షన్‌ను మార్కెట్లో విడుదల చేసేందుకు సర్వం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం, ఈ మోడల్ ఆగస్ట్ 5 విడుదల కావచ్చని తెలుస్తోంది.

తాజాగా, కొత్త 2020 మారుతి సుజుకి ఎస్-క్రాస్ బిఎస్6 మోడల్‌కు సంబంధించిన వేరియంట్లు, ఫీచర్ల వివరాలను వెల్లడించే బ్రోచర్ ఇంటర్నెట్‌లో లీక్ అయ్యింది. మరోవైపు నెక్సా డీలర్లు కూడా ఈ కొత్త ఎస్-క్రాస్ క్రాసోవర్ కోసం బుకింగ్‌లను కూడా ప్రారంభించారు. రూ.11,000 టోకెన్ అమౌంట్‌తో కస్టమర్లు ఈ మోడల్‌ను బుక్ చేసుకోవచ్చు.

కార్‌దేఖో నుంచి వచ్చిన తాజా నివేదిక ప్రకారం, మారుతి సుజుకి 2020 ఎస్-క్రాస్‌ను మొత్తం ఏడు వేరియంట్లలో విక్రయించనున్నట్లు తెలుస్తోంది. ఇందులో నాలుగు మ్యాన్యువల్ మూడు ఆటోమేటిక్ వేరియంట్లు ఉన్నాయి. అవి - సిగ్మా, డెల్టా, జెటా, ఆల్ఫా, డెల్టా ఏటి, జెటా ఏటి మరియు ఆల్ఫా ఏటి.
MOST READ:ఈ వారంలో టాప్ 5 కార్ న్యూస్.. చూసారా

ఈ బ్రోచర్‌లో కొత్త ఎస్-క్రాస్ కలర్ ఆప్షన్లు కూడా వెల్లడయ్యాయి. ఇది బ్లూ, బ్రౌన్, గ్రే, వైట్, సిల్వర్ అనే ఐదు ఆకర్షనీయమైన రంగుల్లో లభ్యం కానుంది. కాగా, మారుతి సుజుకి తమ బిఎస్4 వెర్షన్ ఎస్-క్రాస్ కారును రూ.8.80 లక్షల నుండి రూ.11.43 లక్షల (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) మధ్యలో విక్రయించింది. ఈ నేపథ్యంలో, కొత్త బిఎస్6 ఎస్-క్రాస్ ధరలు కూడా అదే రేంజ్‌లో ఉండొచ్చని అంచనా.

కొత్త 2020 మారుతి సుజుకి ఎస్-క్రాస్ క్రాసోవర్ ఇంటీరియర్ మరియు ఎక్స్‌టీరియర్లలో కొద్దిపాటి మార్పులు చేర్పులు చేశారు. ఎక్స్‌టీరియర్ మార్పులలో రీడిజైన్ చేసిన ఎల్ఈడి హెడ్‌ల్యాంప్స్, టెయిల్ ల్యాంప్స్, అల్లాయ్ వీల్స్ వంటి వాటిని గమనించవచ్చు. అయితే, ఓవరాల్ డిజైన్ మరియు సిల్హౌట్ మాత్రం ఇదివరకటిలానే ఉంటుంది.
MOST READ:శ్రామిక్ ట్రైన్స్ వల్ల ఇండియన్ రైల్వే ఎంత వసూలు చేసిందో తెలుసా ?

ఈ ప్రీమియం క్రాసోవర్ ఇంటీరియర్‌లో చేసిన మార్పుల విషయానికి వస్తే ఇందులో ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే మరియు వాయిస్ కమాండ్స్‌ను సపోర్ట్ చేసే సరికొత్త స్మార్ట్‌ప్లే స్టూడియో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను కలిగి ఉంటుంది. ఇంకా కొత్త 2020 ఎస్-క్రాస్ కారులోని అప్‌హోలెస్ట్రీని కూడా అప్‌గ్రేడ్ చేయనున్నారు, ఇది కారుకి మరింత ప్రీమియం లుక్ అండ్ ఫీల్‌ని ఆఫర్ చేయనుంది.

కొత్త బిఎస్6 2020 మారుతి సుజుకి ఎస్-క్రాస్ క్రాసోవర్‌లో సుజుకి నుండి పాపులర్ అయిన 1.5-లీటర్ ‘ఎస్‌హెచ్‌విఎస్' స్మార్ట్ హైబ్రిడ్ టెక్నాలజీ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించనున్నారు. ఈ 1.5 లీటర్, ఫోర్ సిలిండర్, మైల్డ్-హైబ్రిడ్ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 104 బిహెచ్‌పి శక్తిని మరియు 138 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
MOST READ:కోవిడ్-19 ఎఫెక్ట్: ఇకపై యూబర్ టాక్సీలో ప్రయాణం సాగనుంది ఇలా..!

ఈ ఇంజన్ స్టాండర్డ్ ఫైవ్-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉండొచ్చని సమాచారం. ఈ కొత్త మోడల్ విడుదల సమయంలో కంపెనీ హై-స్పెక్ వేరియంట్‌లపై ఆప్షనల్ ఫోర్-స్పీడ్ టార్క్-కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ను ఆఫర్ చేయవచ్చనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం మారుతి సుజుకి విక్రయిస్తున్న ఎర్టిగా, సియాజ్ మరియు విటారా బ్రెజ్జా కాంపాక్ట్-ఎస్‌యూవీ వంటి ఇతర మోడళ్లలో కూడా కంపెనీ ఈ అధునాతన ఇంజన్‌ను ఆఫర్ చేస్తోంది. బిఎస్4 మోడళ్లలో ఉపయోగించిన ఇంజన్లను నిలిపివేయాలని కంపెనీ నిర్ణయించినందున, ప్రస్తుతానికి ఎస్-క్రాస్ కేవలం పెట్రోల్ ఇంజన్‌తోనే లభ్యం కానుంది, ఇందులో డీజిల్ ఇంజన్ ఉండదు.

2020 మారుతి సుజుకి ఎస్-క్రాస్ బిఎస్6 క్రాసోవర్‌పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.
కొత్తగా వస్తున్న అధునాతన పెట్రోల్ ఇంజన్‌తో మారుతి సుజుకి ఎస్-క్రాస్ మరింత ఎక్కువ మంది కస్టమర్లను ఆకర్షించే అవకాశం ఉంది. గతంలో కంపెనీ ఇందులో 1.6-లీటర్ డీజిల్ ఇంజన్‌ను ఆఫర్ చేసేది, అయితే, తాజా ఉద్గార నిబంధనల కారణంగా, కంపెనీ ఇందులో డీజిల్ ఇంజన్‌ను నిలిపివేసింది. భవిష్యత్తులో ఇందులో డీజిల్ వెర్షన్‌ను కూడా పరిచయం చేసినట్లయితే, ఈ మోడల్ అమ్మకాలు మరింత పుంజుకునే అవకాశం ఉంది.
MOST READ:బిఎస్ 4 వాహన అమ్మకాలపై ఫాడా విచారణను వాయిదా వేసిన సుప్రీంకోర్ట్, ఎందుకంటే ?