మారుతి బ్రిజా పెట్రోల్‌పై బుకింగ్స్ ప్రారంభం.. వెయిటింగ్ పీరియండ్ ఎంతంటే?

2020 మారుతి బ్రిజా ఎస్‌యూవీని ఆవిష్కరించిన మారుతి సుజుకి, ఇప్పుడు దీని విడుదలకు సిద్దమవుతోంది. ఈ నేపథ్యంలో పెట్రోల్ వెర్షన్ మారుతి బ్రిజా మోడల్ గురించి పలు కీలక విషయాలు బయటికొచ్చాయి. బుకింగ్స్, బుకింగ్ ధర, వేరియంట్లు, మరియు వెయిటింగ్ పీరియడ్‌తో పాటు పూర్తి వివరాలు మీకోసం...

మారుతి బ్రిజా పెట్రోల్‌పై బుకింగ్స్ ప్రారంభం.. వెయిటింగ్ పీరియండ్ ఎంతంటే?

అతి త్వరలో విడుదల కానున్న 2020 మారుతి సుజుకి వితారా బ్రిజా పెట్రోల్ వేరియంట్ మీద రూ. 11,000 బుకింగ్ ధరతో బుకింగ్స్ ప్రారంభించినట్లు మోటార్ అరేనా ఇండియా షోరూమ్ ప్రతినిధులు తెలిపారు.

మారుతి బ్రిజా పెట్రోల్‌పై బుకింగ్స్ ప్రారంభం.. వెయిటింగ్ పీరియండ్ ఎంతంటే?

2020 మారుతి వితారా బ్రిజా బీఎస్6 పెట్రోల్ ఇంజన్‌తో 2 విభిన్న గేర్‌బాక్స్ ఆప్షన్లు మరియు నాలుగు వేరియంట్లలో అందుబాటులోకి రానుంది. కస్టమర్లు దీనిని 5-స్పీడ్ మ్యాన్యువల్ లేదా ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో ఎంచుకోవచ్చు.

మారుతి బ్రిజా పెట్రోల్‌పై బుకింగ్స్ ప్రారంభం.. వెయిటింగ్ పీరియండ్ ఎంతంటే?

వేరియంట్ల విషయానికి వస్తే, మారుతి సుజుకి వితారా బ్రిజా పెట్రోల్ వెర్షన్ LXi, VXi, ZXi మరియు ZXi+ వేరియంట్లలో లభిస్తుంది. అయితే మారుతి బ్రిజా బేసిక్ వేరియంట్ LXi మాత్రం ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో కాకుండా కేవలం మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌లోనే లభిస్తుంది.

మారుతి బ్రిజా పెట్రోల్‌పై బుకింగ్స్ ప్రారంభం.. వెయిటింగ్ పీరియండ్ ఎంతంటే?

కలర్స్ కూడా రెండు రకాల ఆప్షన్లలో లభిస్తోంది. ఒకటి మెటాలిక్ (సింగల్ టోన్) కాగా, మరొకటి డ్యూయల్ టోన్. మెటాలిక్ ఆప్షన్‌లో.. పర్ల్ ఆర్కిటిక్, ప్రీమియం సిల్వర్, గ్రానైట్ గ్రే, ఆటమ్ ఆరేంజ్, టార్క్ బ్లూ మరియు సిజ్లింగ్ రెడ్. డ్యూయల్ టోన పెయింట్ స్కీమ్ విషయానికి వస్తే, రెడ్ అండ్ బ్లాక్, గ్రే అండ్ ఆరేంజ్ మరియు బ్లూ అండ్ బ్లాక్.

మారుతి బ్రిజా పెట్రోల్‌పై బుకింగ్స్ ప్రారంభం.. వెయిటింగ్ పీరియండ్ ఎంతంటే?

మారుతి అంతర్గత సమాచారం మేరకు, కస్టమర్లు ఎంచుకునే వేరియంట్ ఆధారంగా బీఎస్6 మారుతి బ్రిజా పెట్రోల్ వేరియంట్ వెయిటింగ్ పీరియడ్ సుమారుగా 6 నుండి 8 వారాలు ఉండొచ్చు.

మారుతి బ్రిజా పెట్రోల్‌పై బుకింగ్స్ ప్రారంభం.. వెయిటింగ్ పీరియండ్ ఎంతంటే?

సాంకేతిక వివరాల విషయానికొస్తే, మారుతి బ్రిజా బీఎస్6 వెర్షన్‌లో 1.5-లీటర్ సామర్థ్యం గల కె-సిరీస్ పెట్రోల్ ఇంజన్ కలదు. ఇది 104బిహెచ్‌పి పవర్ మరియు 138ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. మ్యాన్యువల్ వేరియంట్ మైలేజ్ 17.03కిమీలు మరియు ఆటోమేటిక్ వేరియంట్ మైలేజ్ లీటరుకు 18.76కిలోమీటర్లు.

మారుతి బ్రిజా పెట్రోల్‌పై బుకింగ్స్ ప్రారంభం.. వెయిటింగ్ పీరియండ్ ఎంతంటే?

మారుతి సుజుకి వితారా బ్రిజా కాంపాక్ట్ ఎస్‌యూవీని 2016లో ఇండియన్ మార్కెట్లోకి లాంచ్ చేసింది. సుమారుగా మూడేళ్లపాటు సెగ్మెంట్ లీడర్‌గా రాణించిన వితారా బ్రిజాకు హ్యుందాయ్ ఇటీవల విడుదల చేసిన వెన్యూ కాంపాక్ట్ ఎస్‌యూవీ గట్టి పోటీనిస్తోంది.

మారుతి బ్రిజా పెట్రోల్‌పై బుకింగ్స్ ప్రారంభం.. వెయిటింగ్ పీరియండ్ ఎంతంటే?

తొలుత తీవ్రమైన పోటీ ధాటికి రెండో స్థానానికి పడిపోయినప్పటికీ, నెమ్మదిగా సేల్స్ పుంజుకుని మళ్లీ తన స్థానాన్ని పధిల పరుచుకుంది. మారుతి వితారా బ్రిజా విడుదలైనప్పటి నుండి ఏకంగా 5 లక్షల బ్రిజా కార్లు అమ్ముడుపోయాయి. కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్లో ఈ మైలురాయి సాధించిన ఏకైక మోడల్ కూడా ఇదే!

Source: Rushlane

Most Read Articles

English summary
Maruti Brezza petrol bookings at Rs 11k – Variants, Colours, Waiting period. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X