2020 జిఎల్‌ఇ లాంచ్ డేట్ ను ధ్రువీకరించిన మెర్సిడెస్ బెంజ్!
మెర్సిడెస్ బెంజ్ జర్మనీకి చెందిన ఆటోమొబైల్ సంస్థ. ఖరీదైన మరియు విలాసవంతమైన కార్లను తయారు చేయడంలో పేరెన్నిక కన్న కంపెనీలలో మెర్సిడెస్ బెంజ్ ఒకటి . ఇది ఇప్పటికి చాలా కార్లను ఈ బ్రాండ్ నుండి విడుదల చేసింది. ఇప్పుడు ఈ బ్రాండ్ నుంచి విడుదలవుతున్న మరో కార్ బెంజ్ జిఎల్‌ఇ. దీని గురించి మరింత సమాచారం తెలుసుకుందాం!

మెర్సిడెస్ బెంజ్ ఇండియా తన కొత్త జిఎల్‌ఇ ఎస్‌యూవీని భారతీయ మార్కెట్లో విడుదల చేయడానికి సిద్ధమైంది. కొత్త మెర్సిడెస్ బెంజ్ జిఎల్‌ఇ జనవరి 28 నుండి భారత మార్కెట్లో అమ్మకం కానుందని ధ్రువీకరించింది. కొత్తగా మార్కెట్లోకి రానున్న జిఎల్‌ఇ ఎస్‌యూవీలో చాలా వరకు డిజైన్ మార్పులుచేయబడింది. అదనపు ఫీచర్లతో మంచి క్వాలిటీతో ఈ జిఎల్ఇ మార్కెట్లోకి అడుగుపెట్టబోతోంది.

కొత్త మెర్సిడెస్ బెంజ్ జిఎల్‌ఇ పొడవైన వీల్‌బేస్‌తో వస్తుంది. ఇది మరింత విశాలమైన క్యాబిన్‌కు కలిగి ఉంటుంది. బెంజ్ జిఎల్‌ఇ లో హెడ్‌ల్యాంప్‌లు, టైల్లైట్స్ మరియు డిఆర్‌ఎల్‌లతో సహా ఎల్‌ఈడీ లైటింగ్స్ ఉన్నాయి. జిఎల్‌ఇ SUV 12.3-అంగుళాల డ్యూయల్ డిస్ప్లేలతో వస్తుంది. ఈ రెండు డిస్ప్లైలలో ఒకటి ఇన్ఫోటైన్‌మెంట్ కోసం, మరొకటి ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ కోసం ఉపయోగపడుతుంది.

బెంజ్ జిఎల్‌ఇలో ఫీచర్స్ ని గమనించినట్లయితే ఇందులో ఫోర్-జోన్ క్లైమేట్ కంట్రోల్, హ్యాండ్స్ ఫ్రీ పార్కింగ్, పవర్డ్ టెయిల్‌గేట్, 360-డిగ్రీ కెమెరా, ఎలక్ట్రానికల్లీ అడ్జస్ట్బెల్ ఫ్రంట్ మరియు రియర్ సీట్లతో పాటు అడాప్టివ్ ఎయిర్ సస్పెన్షన్ వంటివి ప్రత్యేకంగా కలిగి ఉంటాయి. ఇందులో ఎమ్‌బియుఎక్స్ కనెక్ట్ టెక్నాలజీని కలిగి ఉంటుంది. ఈ టెక్నాలజీ ఇటీవల ప్రవేశపెట్టిన జిఎల్‌సి ఎస్‌యూవీలో తొలిసారిగా ప్రారంభమైంది.

2020 మెర్సిడెస్ బెంజ్ జిఎల్‌ఇ మూడు ట్రిమ్ స్థాయిలను కలిగి ఉంటుంది. అవి వరుసగా జిఎల్‌ఇ 300 డి, జిఎల్‌ఇ 400 డి మరియు జిఎల్‌ఇ 450. మెర్సిడెస్ బెంజ్ జిఎల్‌ఇ 300 డి 2.0 లీటర్ నాలుగు సిలిండర్ డీజిల్ ఇంజిన్‌తో 256 బిహెచ్‌పి మరియు 500 ఎన్ఎమ్ పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. జిఎల్‌ఇ 400 డి పెద్ద 3.0-లీటర్ సిక్స్ సిలిండర్ డీజిల్ యూనిట్ 330 బిహెచ్‌పి మరియు 700 ఎన్ఎమ్ పీక్ టార్క్‌ను అందిస్తోంది. ఫైనల్ ట్రిమ్ పెట్రోల్ వేరియంట్ రూపంలో 3.0-లీటర్ సిక్స్-సిలిండర్ టర్బో-పెట్రోల్ 367 బిహెచ్‌పి మరియు 500 ఎన్ఎమ్ పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

ఇందులో పెట్రోల్ యూనిట్ కూడా తేలికపాటి-హైబ్రిడ్ వ్యవస్థతో జతచేయబడి ఉంటుంది. ఇది ఎలక్ట్రిక్ మోటారు నుండి అదనంగా 22 బిహెచ్‌పిని అందిస్తుంది. మెర్సిడెస్ బెంజ్ జిఎల్‌ఇలోని మూడు ఇంజన్ల ఎంపికలు ప్రారంభం నుండి ఉంటాయి మరియు ఇవి ప్రామాణిక ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ యూనిట్‌కు జతచేయబడతాయి.

కొత్త జిఎల్‌ఇ ఎస్‌యూవీతో పాటు, మెర్సిడెస్ బెంజ్ సంస్థ భారత మార్కెట్లో ఇతర ఉత్పత్తులను ప్రవేశపెట్టాలని చూస్తోంది. ఇందులో జిఎల్‌ఎస్, జిఎల్‌ఇ కూపే, ఎఎమ్‌జి జిటి ఫోర్-డోర్ మరియు ఆల్-ఎలక్ట్రిక్ ఇక్యూసి ఎస్‌యూవీ ఉన్నాయి. ఈ కొత్త మోడళ్లన్నీ ఈ సంవత్సరంలో లేదా 2021 ప్రారంభంలో ఇండియాలో అమ్మకాలు జరపాలని భావిస్తున్నారు.

2020 మెర్సిడెస్ బెంజ్ జిఎల్‌ఇ ఎస్‌యువిపై ఆలోచనలు:
2020లో ఇండియా మార్కెట్లో ఎక్కువ అమ్మకాలు జరపాలనే ఆలోచనలతో పనిచేస్తున్నాయి. బెంజ్ జిఎల్‌ఇ ఎస్‌యువితో ప్రారంభించి ఈ సంవత్సరంలో అనేక ఉత్పత్తులను పాలించయం చేయాలని భావిస్తుంది. ఇండియాలో మెర్సిడెస్ బెంజ్ జిఎల్‌ఇ ఒక సారి ప్రారంభించిన తరువాత ఆడి క్యూ 7 మరియు బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్ 5 వంటి వాటికి పోటీగా ఉండవలసి ఉంటుంది.


Click it and Unblock the Notifications








