ఇకపై చేతి సంజ్ఞలతో కంట్రోల్ చేయొచ్చు; బెంజ్ కారులో కొత్త ఇన్ఫోటైన్‌మెంట్!

మారుతున్న కాలంతో పాటుగా కార్లలో ఇన్ఫోటైన్‌మెంట్ కూడా మారుతూ వస్తోంది. ఒకప్పుడు రేడియోలతో ప్రారంభమైన ఇన్ఫోటైన్‌మెంట్ ఇ్పపుడు పెద్ద టచ్‌స్క్రీన్‌లకు చేరుకుంది. తాజాగా.. జర్మన్ లగ్జరీ కార్ బ్రాండ్ మెర్సిడెస్ బెంజ్ తమ కారులో గరిష్టంగా 12.8 ఇంచ్‌లో పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్‌ను ఆవిష్కరించింది. ఈ ఏడాది మార్కెట్లోకి రానున్న కొత్త 2021 మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్ కారులో దీనిని ఉపయోగించనున్నారు.

ఇకపై చేతి సంజ్ఞలతో కంట్రోల్ చేయొచ్చు; బెంజ్ కారులో కొత్త ఇన్ఫోటైన్‌మెంట్!

ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి భారత మార్కెట్లో విడుదల కానున్న కొత్త 2021 మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్ కారు ఇంటీరియర్ చిత్రాలను కంపెనీ టీజర్ రూపంలో విడుదల చేసింది. ఇందులో ఈ మోడల్ ఉపయోగించనున్న పెద్ద 12.8 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను కంపెనీ రివీల్ చేసింది. దీనిని కంట్రోల్ చేయటానికి భౌతిక ఎలాంటి బటన్లను ఉండవు. దీనిని పూర్తిగా టచ్ కంట్రోల్స్, వాయిస్ కమాండ్స్, గెశ్చర్ కంట్రోల్ ద్వారా మాత్రమే కంట్రోల్ చేయాల్సి ఉంటుంది.

ఇకపై చేతి సంజ్ఞలతో కంట్రోల్ చేయొచ్చు; బెంజ్ కారులో కొత్త ఇన్ఫోటైన్‌మెంట్!

ఈ కొత్త టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ స్క్రీన్ దిగువ భాగంలో ఓ శాశ్వత బ్యాండ్ ఉంటుంది. ఇది వాహనంలోని క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్‌కు డెడికేట్ చేయబడి ఉంటుంది. ప్రస్తుత తరం మోడళ్లతో పోలిస్తే ఈ కొత్త సిస్టమ్‌లో 27 తక్కువ కంట్రోల్ బటన్లు మరియు స్విచ్‌లు ఉన్నాయని మెర్సిడెస్ బెంజ్ పేర్కొంది.

MOST READ: ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో చేరిన కొత్త హెలికాఫ్టర్లు ఇవే

ఇకపై చేతి సంజ్ఞలతో కంట్రోల్ చేయొచ్చు; బెంజ్ కారులో కొత్త ఇన్ఫోటైన్‌మెంట్!

కన్సోల్ మధ్యలో దీర్ఘచతురస్రాకార ఆకారంలో ఉన్న ఓఎల్ఈడి స్క్రీన్ ఉంటుంది, ఇది అప్‌గ్రేడ్ చేసిన గ్రాఫిక్స్ మరియు సహజ రంగులను ప్రదర్శిస్తుంది. ఈ కొత్త టచ్‌స్క్రీన్ ప్రస్తుత తరం ఎస్-క్లాస్ మోడళ్లలో కనిపించే ఎల్‌సిడి యూనిట్ల కంటే తక్కువ విద్యుత్‌ను వినియోగించుకుంటుంది.

ఇకపై చేతి సంజ్ఞలతో కంట్రోల్ చేయొచ్చు; బెంజ్ కారులో కొత్త ఇన్ఫోటైన్‌మెంట్!

ఈ సిస్టమ్ 50 శాతం ఎక్కువ ప్రాసెసింగ్ శక్తితో వచ్చే బ్రాండ్ యొక్క కొత్త ఎమ్‌బియూఎక్స్ టెక్నాలజీని కలిగి ఉంటుంది. ఇందులో అంతర్నిర్మితంగా ఉండే 320 జిబి సాలిడ్-స్టేట్ హార్డ్ డ్రైవ్‌ను కూడా ఉంటుంది. టచ్, స్వైప్, పించ్ ఆప్షన్ల ద్వారా మెనూ ఫీచర్లను కంట్రోల్ చేయవచ్చు.

MOST READ: 2 కోట్ల విలువైన లంబోర్ఘిని కారుని సొంతం చేసుకున్న భారతీయ నిరుద్యోగి, ఎలానో తెలుసా ?

ఇకపై చేతి సంజ్ఞలతో కంట్రోల్ చేయొచ్చు; బెంజ్ కారులో కొత్త ఇన్ఫోటైన్‌మెంట్!

ఇందులో కొత్తగా చేర్చిన 'హే మెర్సిడెస్' వాయిస్ అసిస్టెంట్ సిస్టమ్‌ను మరింత మెరుగపరచారు. పాత మోడళ్లతో పోలిస్తే ఇది 27 వేర్వేరు భాషలను అర్థం చేసుకోగలదని కంపెనీ చెబుతోంది.

టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను అటుంచితే, ఈ కారులో కొత్తగా త్రీ డైమన్షనల్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను కూడా జోడించారు. ఈ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌లో నాలుగు వేర్వేరు డిస్‌ప్లే స్టైల్స్ మరియు మూడు విభిన్న మోడ్స్ ఉంటాయి. కొత్త 2021 మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్ కూడా హెడ్-అప్ డిస్‌ప్లేతో రానుంది. ఇది ఇది ఆగ్మెంటెడ్ రియాలిటీ (ఏఆర్)ని కూడా సపోర్ట్ చేస్తుంది.

ఇకపై చేతి సంజ్ఞలతో కంట్రోల్ చేయొచ్చు; బెంజ్ కారులో కొత్త ఇన్ఫోటైన్‌మెంట్!

ఈ కొత్త టెక్నాలజీ సాయంతో 2021 మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్ సుమారు 10 మీటర్ల వర్చ్యువల్ డిస్టెన్స్ వరకూ నావిగేషన్ దిశలను ప్రొజెక్ట్ చేయగలదు. అంటే, ఇది నావిగేషన్‌కు సంబంధించిన డైరెక్షనల్ యారోస్ మరియు ఇతర సూచనలను రహదారి ఉపరితలంపై ప్రొజెక్ట్ చేస్తుంది.

MOST READ: మీరు ఇప్పటివరకు చూడని అరుదైన మరియు అందమైన హిందుస్తాన్ ట్రెక్కర్

ఇకపై చేతి సంజ్ఞలతో కంట్రోల్ చేయొచ్చు; బెంజ్ కారులో కొత్త ఇన్ఫోటైన్‌మెంట్!

కొత్త మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్ కారులో కొత్తగా జోడించిన 12.8 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌లే కాకుండా, ఇందులో వెనుక సీచులో కూర్చునే ప్రయాణీకుల వినోదం కోసం కూడా మూడు స్క్రీన్‌లు ఉంచాయి. ఈ స్క్రీన్‌లకు కూడా ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను యాక్సెస్ చేసుకునేందుకు పూర్తి సౌలభ్యం ఉంటుంది.

ఇకపై చేతి సంజ్ఞలతో కంట్రోల్ చేయొచ్చు; బెంజ్ కారులో కొత్త ఇన్ఫోటైన్‌మెంట్!

యూజర్లు ఈ స్క్రీన్‌ల మధ్య కంటెంట్‌ను షేర్ చేసుకోవచ్చు మరియు ప్రయాణీకులు వారికి నచ్చిన విధంగా ప్రొఫైళ్లను సెటప్ చేసుకోవచ్చు. ఇలా సెటప్ చేసుకున్న ప్రొఫైళ్లను క్లౌడ్‌లో భద్రపరచుకోవచ్చు మరియు ఇతర అనుకూలమైన మెర్సిడెస్ బెంజ్ మోడళ్లకు లేదా అదే మెర్క్‌లోని ఇతర సీట్లలో ఉండే స్క్రీన్‌లకు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

MOST READ: పేద ప్రజల వైద్య సేవకు మొబైల్ క్లినిక్ వ్యాన్ అందించిన ఫోక్స్‌వ్యాగన్ & స్కోడా

ఇకపై చేతి సంజ్ఞలతో కంట్రోల్ చేయొచ్చు; బెంజ్ కారులో కొత్త ఇన్ఫోటైన్‌మెంట్!

మెర్సిడెస్ బెంజ్ కొత్త ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

మెర్సిడెస్ బెంజ్ ప్రకటించిన ఈ ఫీచర్లను చూస్తుంటే, కారులో వినోదం కోసం ఏర్పాటు చేసిన ఈ కొత్త ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ చాలా ఫ్యూచరిస్టిక్‌గా అనిపిస్తోంది. అతి తక్కువ కంట్రోల్స్‌తో మరియు చేతితో తాకాల్సిన అవసరం లేకుండానే హ్యాండ్ గెశ్చర్స్ (చేతి సంజ్ఞల ద్వారా) ఈ సిస్టమ్‌ను కంట్రోల్ చేసుకోవటం నిజంగా అద్భుతమైన ఫీచర్‌గా చెప్పుకోవచ్చు.

Most Read Articles

English summary
German luxury vehicle manufacturer, Mercedes-Benz has released teaser images of the interiors of the new S-Class that is scheduled for a September launch in the Indian market. Read in Telugu.
Story first published: Sunday, July 12, 2020, 15:00 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X