మారుతి సుజుకి నుంచి నెక్స్ట్ జెనరేషన్ సెలెరియో: సరికొత్త డిజైన్, సరికొత్త ఫీచర్లు

భారతదేశపు నెంబర్ వన్ ప్యాసింజర్ కార్ కంపెనీ మారుతి సుజుకి ఇండియా, దేశీయ విపణిలో విక్రయిస్తున్న సెలెరియో హ్యాచ్‌బ్యాక్‌లో ఓ కొత్త తరం మోడల్‌ను ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. మారుతి నుంచి రానున్న కొత్త 2020 సెలెరియో పూర్తిగా కొత్త డిజైన్, అప్‌డేటెడ్ ఇంటీరియర్స్, సరికొత్త ఫీచర్లు మరియు పరికరాలను కలిగి ఉంటుందని సమాచారం.

మారుతి సుజుకి నుంచి నెక్స్ట్ జెనరేషన్ సెలెరియో: సరికొత్త డిజైన్, సరికొత్త ఫీచర్లు

మారుతి సుజుకి ఇండియా ఇప్పటికే తమ కొత్త తరం సెలెరియో కారును భారత రోడ్లపై విస్తృతంగా పరీక్షిస్తోంది. తాజాగా, ఆటోకార్ ఇండియా నుండి వచ్చిన నివేదికల ప్రకారం, నెక్స్ట్ జనరేషన్ సెలెరియో ఈ ఏడాది దీపావళి నాటికి భారత మార్కెట్లలో విడుదల కావచ్చని తెలుస్తోంది. ఇది ప్రస్తుత సెలెరియోకి ఫేస్‌లిఫ్ట్‌లా కాకుండా, పూర్తిగా రిఫ్రెష్ డిజైన్‌తో వస్తుందని తెలుస్తోంది.

మారుతి సుజుకి నుంచి నెక్స్ట్ జెనరేషన్ సెలెరియో: సరికొత్త డిజైన్, సరికొత్త ఫీచర్లు

కొత్త తరం సెలెరియో పరిమాణంలో కాస్తంత పెద్దగా ఉండొచ్చని సమాచారం. ఎక్స్‌టీరియర్ మరియు ఇంటీరియర్స్‌లో కూడా రిఫ్రెష్డ్ డిజైన్, కొత్త ఫీచర్లు మరియు పరికరాలతో పాటుగా అప్‌డేటెడ్ మెకానికల్స్ కూడా ఉండనున్నాయి. అంటే, ఇంజన్ పరంగా కూడా కొత్త సెలెరియోలో మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉంది.

MOST READ: టాప్ కార్ న్యూస్: మార్కెట్లోకి కొత్తగా వచ్చిన కార్లు; ఎస్‌యూవీలదే పైచేయి

మారుతి సుజుకి నుంచి నెక్స్ట్ జెనరేషన్ సెలెరియో: సరికొత్త డిజైన్, సరికొత్త ఫీచర్లు

కొత్త తరం సెలెరియో హ్యాచ్‌బ్యాక్ కారును మారుతి సుజుకి బ్రాండ్ యొక్క ‘హియర్‌టెక్ట్' ప్లాట్‌ఫామ్‌పై తయారు చేయవచ్చని తెలుస్తోంది. ఇదే ప్లాట్‌ఫామ్‌పై వ్యాగన్ఆర్ కారును కూడా తయారు చేస్తున్నారు. వ్యాగన్ఆర్ మాదిరిగానే, కొత్త తరం సెలెరియో బ్రాండ్ యొక్క లేటెస్ట్ స్మార్ట్ ప్లే స్టూడియో ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో మరిన్ని ఇతర పరికరాలను షేర్ చేసుకునే అవకాశం ఉంది.

మారుతి సుజుకి నుంచి నెక్స్ట్ జెనరేషన్ సెలెరియో: సరికొత్త డిజైన్, సరికొత్త ఫీచర్లు

ఇక ఇంజన్ ఆప్షన్స్ విషయానికి వస్తే, కొత్త తరం మారుతి సుజుకి సెలెరియోను వాగన్ఆర్ మాదిరిగానే రెండు ఇంజన్ ఆప్షన్లతో ఆఫర్ చేసే అవకాశం ఉంది. ఇందులో బిఎస్6 1.0-లీటర్ పెట్రోల్ మరియు 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్స్ ఉండనున్నట్లు సమాచారం. ఈ రెండు ఇంజన్ల పవర్, టార్క్ గణాంకాలు ప్రస్తుత వ్యాగన్ఆర్ హ్యాచ్‌బ్యాక్‌తో సమానంగా ఉంటాయి. కొత్త సెలెరియో 5-స్పీడ్ మాన్యువల్ లేదా ఏఎమ్‌టి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభ్యం కానుంది.

MOST READ: మారుతి సుజుకి ఎలక్ట్రిక్ వ్యాగన్ఆర్; త్వరలో విడుదల

మారుతి సుజుకి నుంచి నెక్స్ట్ జెనరేషన్ సెలెరియో: సరికొత్త డిజైన్, సరికొత్త ఫీచర్లు

ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న మారుతి సుజుకి సెలెరియో కారును తొలిసారిగా 2014లో భారత మార్కెట్లో ప్రవేశపెట్టారు. కంపెనీ నుండి ఎంట్రీ లెవల్ కార్ విభాగంలో లభ్యమవుతున్న సెలెరియో ధరలు రూ.4.46 లక్షల నుండి రూ.5.73 లక్షల (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) మధ్యలో ఉన్నాయి.

మారుతి సుజుకి నుంచి నెక్స్ట్ జెనరేషన్ సెలెరియో: సరికొత్త డిజైన్, సరికొత్త ఫీచర్లు

కాగా.. మారుతి సుజుకి నుంచి కొత్తగా రానున్న నెక్స్ట్ జనరేషన్ సెలెరియో ఆఫర్ చేయబోయే ప్రీమియం ఫీచర్ల కారణంగా దాని ధర కూడా ప్రీమియంగానే ఉండే అవకాశం ఉంది. కొత్త మారుతి సెలెరియో గురించి పూర్తి సమాచారం ఇంకా తెలియకపోయినప్పటికీ, మార్కెట్లో దీని ధరలు రూ.5.50 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభం కావచ్చని అంచనా.

MOST READ: టాటా మోటార్స్ ఛైర్మన్‌కు అందజేసిన టాటా నెక్సాన్ ఇవి

మారుతి సుజుకి నుంచి నెక్స్ట్ జెనరేషన్ సెలెరియో: సరికొత్త డిజైన్, సరికొత్త ఫీచర్లు

కొత్త తరం మారుతి సుజుకి సెలెరియోపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

ప్రస్తుత తరం సెలెరియోతో పోల్చుకుంటే కొత్త తరం మారుతి సుజుకి సెలెరియోలో అనేక మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉంది. మార్కెట్లో ఈ కొత్త తరం సెలెరియో ఈ విభాగంలోని టాటా టియాగో, హ్యుందాయ్ శాంత్రో వంటి మోడళ్లకు పోటీగా నిలిచే అవకాశం ఉంది.

Source:Autocar India

Most Read Articles

English summary
Maruti Suzuki is said to be working on the new-generation Celerio hatchback for the Indian market. The 2020 Maruti Suzuki Celerio is expected to feature a completely new design, updated interiors, and a host of new features and equipment. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X