Just In
- 2 hrs ago
525 హార్స్ పవర్ వి8 ఇంజన్‌తో వస్తున్న మోస్ట్ పవర్ఫుల్ డిఫెండర్ వి8
- 3 hrs ago
45 లీటర్ల ఇంధన ట్యాంక్‌లో 48 లీటర్ల పెట్రోల్.. దీనితో మొదలైన గొడవ.. చివరికి ఏమైందంటే
- 4 hrs ago
సూపర్ సోకో నుండి మూడు సరికొత్త ఎలక్ట్రిక్ టూవీలర్స్
- 4 hrs ago
చెన్నైలో కొత్త డీలర్షిప్ ప్రారంభించిన వోల్వో.. పూర్తి వివరాలు
Don't Miss
- News
భారత్‌లో రెండో రోజూ భారీగా పెరిగిన కరోనా కేసులు: 16వేలకు పైగానే, మరణాలు పెరిగాయి
- Sports
రెండు రోజుల్లోనే 22 టెస్టులు పూర్తి.. ఇంగ్లండ్ జట్టుదే ఆధిపత్యం!! భారత్ ఎన్నిసార్లంటే?
- Movies
మహేశ్‌కు మళ్లీ కథ చెప్పిన సక్సెస్ఫుల్ డైరెక్టర్: ఈ సారి మరో ప్రయోగం అంటూ రిప్లై
- Finance
గుడ్‌న్యూస్, 30,000 మందికి క్యాప్‌జెమిని ఉద్యోగాలు! ఫ్రెషర్స్, ఎక్స్‌పీరియన్స్‌కు అవకాశం
- Lifestyle
ఈ 4 రాశుల వారికి లీడర్ షిప్ క్వాలిటీస్ ఉండవు... ఈ జాబితాలో మీ రాశి ఉందేమో చూసెయ్యండి...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
నెక్స్ట్ జెనరేషన్ మారుతి సుజుకి సెలెరియో; స్పై చిత్రాలు, వివరాలు
భారతదేశపు అగ్రగామి ప్యాసింజర్ కార్ కంపెనీ మారుతి సుజుకి ఇండియా, దేశీయ విపణిలో విక్రయిస్తున్న సెలెరియో హ్యాచ్‌బ్యాక్‌లో ఓ కొత్త తరం మోడల్‌ను ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఇదివరకటి కథనంలో ప్రచురించిన సంగతి తెలిసినదే. కాగా, తాజాగా హర్యానాలో టెస్టింగ్ చేస్తున్న కొత్త తరం సెలెరియో ఫొటోలు ఇంటర్నెట్‌లో లీక్ అయ్యాయి.

మారుతి నుంచి రానున్న కొత్త తరం సెలెరియో పూర్తిగా కొత్త డిజైన్, అప్‌డేటెడ్ ఇంటీరియర్స్, సరికొత్త ఫీచర్లు మరియు పరికరాలను కలిగి ఉంటుందని తెలుస్తోంది. మారుతి సుజుకి ఇండియా ఇప్పటికే తమ కొత్త తరం సెలెరియో కారును భారత రోడ్లపై విస్తృతంగా పరీక్షిస్తోంది.

ఈ ఏడాది ఎప్పుడైనా తరువాతి తరం సెలెరియోను కంపెనీ విడుదల చేయనుంది. ప్రారంభించటానికి ముందు, కొత్త హ్యాచ్‌బ్యాక్ దేశంలో పరీక్షలను గుర్తించింది. కాగా, 'ఆటోఎక్స్' లీక్ చేసిన స్పై చిత్రాలు, కొత్త సెలెరియో కారుని కొన్ని ఫీచర్లను బహిర్గతం చేసేలా ఉన్నాయి.
MOST READ:జర్మనీ కంపెనీ కారు కొన్న భారతీయ నటుడు, ఎవరో తెలుసా ?

పూర్తిగా క్యామోఫ్లేజ్ చేయబడిన కొత్త తరం సెలెరియోని మారుతి సుజుకి హర్యానాలో టెస్టింగ్ చేస్తోంది. నెక్స్ట్ జనరేషన్ సెలెరియో ఈ ఏడాది దీపావళి నాటికి భారత మార్కెట్లలో విడుదల కావచ్చని తెలుస్తోంది. ఇది ప్రస్తుత సెలెరియోకి ఫేస్‌లిఫ్ట్‌లా కాకుండా, పూర్తిగా రిఫ్రెష్ డిజైన్‌తో వస్తుందని సమాచారం.

కొత్త తరం సెలెరియో పరిమాణంలో కాస్తంత పెద్దగా ఉండొచ్చని తెలుస్తోంది. ఈ హ్యాచ్‌బ్యాక్‌కు అధిక గ్రౌండ్ క్లియరెన్స్‌తో క్రాసోవర్ లుక్‌ని ఇచ్చినట్లుగా అనిపిస్తుంది. ఎక్స్‌టీరియర్ మరియు ఇంటీరియర్స్‌లో కూడా రిఫ్రెష్డ్ డిజైన్, కొత్త ఫీచర్లు ఉండనున్నాయి.
MOST READ:భీష్మ డైరెక్టర్‌కి రేంజ్ రోవర్ గిఫ్ట్ గా ఇచ్చిన హీరో నితిన్, ఎందుకో తెలుసా !

కొత్త తరం సెలెరియో హ్యాచ్‌బ్యాక్ కారును మారుతి సుజుకి బ్రాండ్ యొక్క ‘హియర్‌టెక్ట్' ప్లాట్‌ఫామ్‌పై తయారు చేయనున్నారు. ఇదే ప్లాట్‌ఫామ్‌పై ఎస్-ప్రెసో, ఇగ్నిస్, వ్యాగన్ఆర్, డిజైర్, స్విఫ్ట్, బాలెనో, ఎస్-క్రాస్, ఎర్టిగా మరియు ఎక్స్ఎల్6 మోడళ్లను కూడా తయారు చేస్తున్నారు.

హియర్‌టెక్ట్ ప్లాట్‌ఫామ్‌పై తయారు కానున్న కొత్త సెలెరియో మరింత మెరుగైన భద్రత, మైలేజ్ మరియు డ్రైవింగ్ డైనమిక్స్‌ను ఆఫర్ చేస్తుందని కంపెనీ పేర్కొంది. కొత్త తరం సెలెరియోలో మారుతి సుజుకి నుండి పాపులర్ అయిన లేటెస్ట్ స్మార్ట్ ప్లే స్టూడియో ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను ఉపయోగించే అవకాశం ఉంది.
MOST READ:ఇది చూసారా.. ప్రమాదకరమైన స్థలంలో పార్కింగ్ చేయడానికి ఎగబడుతున్న ప్రజలు

కొత్త తరం సెలెరియోలో ఇంజన్ పరంగా ఎలాంటి మార్పులు ఉండబోవని తెలుస్తోంది. ఇందులోని కె10బి పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 6000 ఆర్‌పిఎమ్ వద్ద 68 బిహెచ్‌పి పవర్‌ను మరియు 3500 ఆర్‌పిఎమ్ వద్ద 90 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇది స్టాండర్డ్ 5-స్పీడ్ మ్యాన్యువల్ లేదా ఏఎమ్‌టి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభించే అవకాశం ఉంది.

ప్రస్తుతం మారుతి సుజుకి మెరుగైన ఇంధన సామర్థ్యం కోసం సెలెరియోను ఫ్యాక్టరీతో ఫిట్టెడ్ సిఎన్‌జి కిట్‌తో కూడా అందిస్తోంది. కొత్త తరం సెలెరియోని కూడా సిఎన్‌జి వెర్షన్‌లో విడుదల చేయనున్నట్లు సమాచారం. సిఎన్‌జి మోడళ్లు బ్రాండ్ యొక్క గ్రీన్ మైల్ ప్రణాళికలో భాగంగా ఉంటాయి. ఈ ప్రణాళికలో భాగంగా, దేశంలో ఎక్కువ సిఎన్‌జి కార్లను అమ్మడం ద్వారా కాలుష్యాన్ని తగ్గించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.
MOST READ:కొత్త కారు కొన్న సన్నీలియోన్ : ఈ కార్ రేటెంతో ఎంతో తెలుసా ?

మారుతి సుజుకి ఇండియా నుండి ఎంట్రీ లెవల్ కార్ విభాగంలో లభ్యమవుతున్న సెలెరియో ధరలు రూ.4.46 లక్షల నుండి రూ.5.73 లక్షల (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) మధ్యలో ఉన్నాయి. ప్రస్తుత తరం సెలెరియోతో పోల్చుకుంటే కొత్త తరం మారుతి సుజుకి సెలెరియోలో అనేక మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉంది.

నెక్స్ట్ జనరేషన్ సెలెరియోలో ఆఫర్ చేయబోయే ప్రీమియం ఫీచర్ల కారణంగా దాని ధర కూడా ప్రీమియంగానే ఉండే అవకాశం ఉంది. కొత్త మారుతి సెలెరియో గురించి పూర్తి సమాచారం ఇంకా తెలియకపోయినప్పటికీ, మార్కెట్లో దీని ధర రూ.5.50 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభం కావచ్చని అంచనా.

కొత్త తరం మారుతి సుజుకి సెలెరియో స్పైచిత్రాలపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.
ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న మారుతి సుజుకి సెలెరియో కారును తొలిసారిగా 2014లో భారత మార్కెట్లో ప్రవేశపెట్టారు. కొత్త తరం సెలెరియోని మరిన్ని అధిక ఫీచర్లతో, మంచి అప్-మార్కెట్ ఫీల్‌ని ఇచ్చేలా తయారు చేసే అవకాశం ఉంది. మార్కెట్లో ఈ కొత్త తరం సెలెరియో ఈ విభాగంలోని టాటా టియాగో, హ్యుందాయ్ శాంత్రో వంటి మోడళ్లకు పోటీగా నిలువనుంది.