కొత్త తరం మహీంద్రా ఎక్స్‌యూవీ500 స్పై చిత్రాలు - లేటెస్ట్ డీటేల్స్

ప్రముఖ దేశీయ యుటిలిటీ వాహన దిగ్గజం మహీంద్రా, ఓ కొత్త తరం ఎక్స్‌యూవీ500 మోడల్‌పై పనిచేస్తున్న సంగతి తెలిసినదే. ఈ కొత్త తరం 2021 మహీంద్రా ఎక్స్‌యూవీ500 వచ్చే ఏడాది ఆరంభంలో భారత మార్కెట్లో విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో, తాజాగా కొత్త తరం ఎక్స్‌యూవీ500కి లేటెస్ట్ స్పై చిత్రాలు మరియు డిజైన్ వివరాలు వెల్లడయ్యాయి.

కొత్త తరం మహీంద్రా ఎక్స్‌యూవీ500 స్పై చిత్రాలు - లేటెస్ట్ డీటేల్స్

కొత్త తరం 2021 మహీంద్రా ఎక్స్‌యూవీ500 అనేక కొత్త ఫీచర్లు, డిజైన్ మరియు ఇంజన్ అప్‌గ్రేడ్స్ కూడా ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం మహీంద్రా ఈ కొత్త తరం ఎక్స్‌యూవీ500 మోడల్‌ను కర్ణాటక రోడ్లపై టెస్టింగ్ చేస్తోంది. ఇందుకు సంబంధించిన చిత్రాలను గాడివాడి విడుదల చేసింది.

కొత్త తరం మహీంద్రా ఎక్స్‌యూవీ500 స్పై చిత్రాలు - లేటెస్ట్ డీటేల్స్

ఈ స్పై చిత్రాలలో, హెడ్‌ల్యాంప్‌లు మరియు టెయిల్ ల్యాంప్స్‌కి సంబంధించిన డీటేల్స్ వెల్లడయ్యాయి. ఈ టెస్టింగ్ వాహనాన్ని భారీగా క్యామోఫ్లేజ్ చేయటం వలన కారు లోపలి మరియు వెలుపలి డిజైన్ ఫీచర్లు పూర్తిగా వెల్లడి కాలేదు. అయినప్పటికీ, కొన్ని ఎక్స్‌టీరియర్ డిజైన్ వివరాలను ఈ చిత్రాలలో గమనించవచ్చు.

MOST READ:నీటిపై నడిచే బైక్.. వీడియో చూసారా ?

కొత్త తరం మహీంద్రా ఎక్స్‌యూవీ500 స్పై చిత్రాలు - లేటెస్ట్ డీటేల్స్

కొత్త ఎక్స్‌యూవీ500 సరికొత్త ఫ్రంట్ డిజైన్‌తో ఆల్-న్యూ ఫ్రంట్ ఫాసియాను కలిగి ఉంటుంది. ఇందులో మరింత స్పష్టమైన గ్రిల్ మరియు మహీంద్రా చిహ్నం కూడా ఉంటుంది. ఇందులో ఎస్‌యూవీకి సరికొత్త రూపాన్ని ఇచ్చే ఇంటిగ్రేటెడ్ డిఆర్‌ఎల్‌లతో సరికొత్త హెడ్‌ల్యాంప్ సెటప్‌ను కలిగి ఉంటుందని అంచనా.

కొత్త తరం మహీంద్రా ఎక్స్‌యూవీ500 స్పై చిత్రాలు - లేటెస్ట్ డీటేల్స్

వెనుక వైపు ఫొటోలను గమనిస్తే, ఈ ఎస్‌యూవీ ఇప్పుడు మరింత విశాలంగా ఉన్నట్లు అనిపిస్తుంది మరియు వెనుక వైపు బంపర్ మరియు టెయిల్ ల్యాంప్స్‌ను పూర్తిగా రీడిజైన్ చేశారు. ఇంకా కొత్త బోనెట్ డిజైన్, డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్, ఫ్లష్-టైప్ డోర్ హ్యాండిల్స్ మరియు షార్క్ ఫిన్ యాంటెన్నా వంటి ఫీచర్లు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

MOST READ:కార్ డ్రైవ్ చేసి అమ్మమ్మ ప్రాణాలను కాపాడిన 11 ఏళ్ల బాలుడు [వీడియో]

కొత్త తరం మహీంద్రా ఎక్స్‌యూవీ500 స్పై చిత్రాలు - లేటెస్ట్ డీటేల్స్

ఇకపోతే కొత్త 2021 మహీంద్రా ఎక్స్‌యూవీ500 ఇంటీరియర్స్‌ను కూడా పూర్తిగా రీడిజైన్ చేయనున్నారు. ఇందులో సరికొత్త డాష్‌బోర్డ్ లేఅవుట్, కొత్త ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లేతో పాటుగా బ్రాండ్ యొక్క సరికొత్త కనెక్టింగ్ టెక్నాలజీని సపోర్ట్ చేసే అప్‌డేటెడ్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మొదలైనవి ఉండే అవకాశం ఉంది.

కొత్త తరం మహీంద్రా ఎక్స్‌యూవీ500 స్పై చిత్రాలు - లేటెస్ట్ డీటేల్స్

ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న ఎక్స్‌యూవీ500లో ఫీచర్లకు ఎలాంటి కొదవ లేనప్పటికీ, ఈ విభాగంలో కొత్తగా పుట్టుకొస్తున్న మోడళ్లలో అనేక లేటెస్ట్ టెక్నాలజీ మరియు కంఫర్ట్ ఫీచర్లు లభిస్తున్న నేపథ్యంలో, మహీంద్రా కూడా తమ కొత్త తరం ఎక్స్‌యూవీ500ని కాంపిటీటర్లకు గట్టి సవాల్ విసిరేలా అభివృద్ధి చేయనుంది.

MOST READ:మూలికా పెట్రోల్ తయారీకి కేరళ గవర్నమెంట్ గ్రీన్ సిగ్నెల్

కొత్త తరం మహీంద్రా ఎక్స్‌యూవీ500 స్పై చిత్రాలు - లేటెస్ట్ డీటేల్స్

ఇంజన్ విషయానికి వస్తే, కొత్త 2021 ఎక్స్‌యూవీ500లో కొత్త 2.2-లీటర్ ఫోర్ సిలిండర్ టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజన్‌ను ఉండొచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఇంజన్ గరిష్టంగా 152 బిహెచ్‌పి శక్తిని మరియు 360 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది మరియు ఇది 6-స్పీడ్ మ్యాన్యువల్ లేదా 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభ్యం కానుంది.

కొత్త తరం మహీంద్రా ఎక్స్‌యూవీ500 స్పై చిత్రాలు - లేటెస్ట్ డీటేల్స్

అంతేకాకుండా, మహీంద్రా తమ కొత్త 2021 ఎక్స్‌యూవీ500 మోడల్‌ను కొత్త టర్బో-పెట్రోల్ ఇంజన్‌తో కూడా అందించవచ్చనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. బహుశా ఇది 2.0-లీటర్ టి-జిడి ఎమ్‌స్టాలియన్ కావచ్చు, ఇదే ఇంజన్‌ను కొత్త తరం 2020 మహీంద్రా థార్‌లో కూడా ఉపయోగించనున్నారు. ఈ టర్బో పెట్రోల్ ఇంజన్ 150 బిహెచ్‌పి వవర్‌ను మరియు 320 ఎన్ఎమ్‌ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభ్యం కానుంది.

MOST READ:లగ్జరీ కార్లను కాదని ఎద్దులబండిలో ప్రయాణించిన కొత్త జంట.. ఎందుకో తెలుసా ?

కొత్త తరం మహీంద్రా ఎక్స్‌యూవీ500 స్పై చిత్రాలు - లేటెస్ట్ డీటేల్స్

నెక్స్ట్ జనరేషన్ మహీంద్రా ఎక్స్‌యూవీ500పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

మహీంద్రా ఎక్స్‌యూవీ500 దేశంలో అత్యధికంగా అమ్ముడైన ఎస్‌యూవీలలో ఒకటి. ఇది బ్రాండ్ యొక్క మొట్టమొదటి మోనోకోక్ ఎస్‌యూవీ, ఈ మోడల్‌ను కంపెనీ ఇతర దేశాలలో కూడా విక్రయిస్తోంది. మహీంద్రా ఎక్స్‌యూవీ500కు కంపెనీ ఇప్పుడు కొత్త రూపంతో సరికొత్త హంగులను కూడా జోడించనుంది.

Source: GaadiWaadi

Most Read Articles

English summary
Mahindra Auto is working on the next-generation XUV500, which is expected to be launched sometime next year in the Indian market. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X