టోల్ ఆపరేటర్లకు జరిగిన నష్టాన్ని భరించనున్న నేషనల్ హైవే అథారిటీ
కరోనా వైరస్ ప్రభావం వల్ల భారతదేశంలో మొత్తం లాక్ డౌన్ అమలు చేయబడింది. ఈ లాక్ డౌన్ వల్ల దేశంలోని అన్ని లావాదేవీలకు చాలా ఆటంకాలు ఏర్పడ్డాయి. ఈ కారణంగానే దాదాపు అన్ని సంస్థలు నష్టాలలో ఉన్నాయి. కానీ కరోనా మహమ్మారి నుంచి విముక్తి పొందటానికి లాక్ డౌన్ మరింత పొడిగించారు. భారతదేశంలో ఈ లాక్ డౌన్ మే 03 వరకు పొడిగిస్తూ నరేంద్ర మోడీ అధికారిక ప్రకటన చేసారు.

నేషనల్ హైవే అథారిటీ కూడా కరోనా లాక్ డౌన్ ప్రభావానికి లోనైంది. లాక్ డౌన్ వల్ల ఇబ్బందులు పడుతున్న నేషనల్ హైవే అథారిటీ యొక్క టోల్ ఆపరేటర్లందరికీ ఉపశమనం కల్పించడానికి నేషనల్ హైవే అథారిటీ ఆలోచిస్తోంది.

లాక్ డౌన్ సమయంలో అత్యవసర సేవల కోసం ట్రాఫిక్ ని మరింత సులభతరం చేయడానికి జాతీయ రహదారులపై టోల్ సేకరణ తాత్కాలికంగా నిలిపివేయబడింది.

నివేదికల ప్రకారం లాక్ డౌన్ సమయంలో జరిగిన నష్టానికి టోల్ ఆపరేటర్లకు పరిహారం చెల్లించాలని నేషనల్ హైవే అథారిటీ అఫ్ ఇండియా ఆలోచిస్తోంది.
జాతీయ రహదారులపై టోల్ ఆపరేటర్లకు కలిగే నష్టాలను భరించే ప్రణాళికను కేంద్ర ప్రభుత్వం త్వరలో అమలు చేస్తుందని కేంద్ర రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఇటీవల ప్రకటించారు.

ప్రధానమంత్రి దేశంలో లాక్డౌన్ ప్రకటించిన తరువాత, నితిన్ గడ్కరీ అత్యవసర సేవా వాహనాల రవాణాను సులభతరం చేయడానికి మరియు టోల్ ప్లాజాలలో సమయాన్ని ఆదా చేయడానికి టోల్ సేకరణను తాత్కాలికంగా మూసివేసారు.

నేషనల్ హైవే అథారిటీ (ఎన్‌హెచ్‌ఏఐ) టోల్‌లలో వేచి ఉండే సమయాన్ని తగ్గించడానికి 2019 డిసెంబర్‌లో 500 కి పైగా టోల్ ప్లాజాల్లో ఫాస్ట్‌ట్యాగ్‌లను జారీ చేసింది.

ఫాస్ట్‌ట్యాగ్ లేకుండా ప్రవేశించే వాహనాలకు టోల్ రెండు రెట్లు వసూలు చేయబడుతుంది. మల్టిపుల్ పాయింట్ ఆఫ్ సేల్స్ (పిఓఎస్) ద్వారా దాదాపు రెండు కోట్ల ఫాస్ట్‌ట్యాగ్‌లు విడుదలయ్యాయి. గత నెలలో నలభై మిలియన్లకు పైగా ఫాస్ట్‌ట్యాగ్ ఒప్పందాలు జరిగాయి.


Click it and Unblock the Notifications








