నిస్సాన్ ఆరియా ఎలక్ట్రిక్ కారు ఆవిష్కరణ - ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

జపనీస్ కార్ బ్రాండ్ నిస్సాన్, తమ సరికొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ "నిస్సాన్ అరియా"ని ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కరించింది. పూర్తి ఎలక్ట్రిక్ పవర్‌తో నడిచే ఈ వాహనాలను మార్కెట్లో విడుదల చేసే సమయంలో వీటిని రెండు పవర్‌ట్రైన్ మరియు డ్రైవ్‌ట్రైన్ ఆప్షన్లతో ఆఫర్ చేయనున్నారు. ఈ కారు పూర్తి ఛార్జ్‌పై గరిష్టంగా 610 కిలోమీటర్ల డ్రైవింగ్ రేంజ్‌ను ఆఫర్ చేస్తుందని కంపెనీ పేర్కొంది.

నిస్సాన్ ఆరియా ఎలక్ట్రిక్ కారు ఆవిష్కరణ - ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

ప్రస్తుతం ఈ కంపెనీ అంతర్జాతీయ మార్కెట్లలో విక్రయిస్తున్న సక్సెస్‌ఫుల్ నిస్సాన్ లీఫ్ ఎలక్ట్రిక్ వెహికల్ ప్లాట్‌ఫామ్ ఆధారంగా నిస్సాన్ అరియా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని అభివృద్ధి చేస్తున్నారు. గత ఏడాది టోక్యో మోటార్ షోలో నిస్సాన్ తమ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కాన్సెప్ట్ వెర్షన్‌ను తొలిసారిగా ప్రదర్శించింది.

నిస్సాన్ ఆరియా ఎలక్ట్రిక్ కారు ఆవిష్కరణ - ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

కాన్సెప్ట్ దశలో ఈ వాహనంలో ప్రదర్శించిన అనేక డిజైన్ ఎలిమెంట్స్‌ను ప్రొడక్షన్ వెర్షన్ మోడల్‌లో కూడా అలానే క్యారీ చేశారు. అరియా డిజైన్‌ను నిస్సాన్ బ్రాండ్ యొక్క "సీమ్‌లెస్, ఎలిగాంట్ మరియు ఫ్రెష్" స్టైలింగ్‌తో అభివృద్ధి చేశారు. ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని రెనాల్ట్-నిస్సాన్-మిత్సుబిషి అలయన్స్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన కొత్త సిఎమ్ఎఫ్-ఈవి ఎలక్ట్రిక్ ఆర్కిటెక్చర్‌పై నిర్మించారు.

నిస్సాన్ ఆరియా ఎలక్ట్రిక్ కారు ఆవిష్కరణ - ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

పవర్‌ట్రెయిన్‌కు విషయానికి వస్తే, నిస్సాన్ వివిధ రకాల ఆప్షన్లతో అరియాను ఆఫర్ చేయనుంది. ఇందులోని బ్యాటరీ ప్యాక్ 63 కిలోవాట్లు లేదా 87 కిలోవాట్ల సామర్థ్యాలలో లభిస్తుంది. ఈ రెండు బ్యాటరీ ప్యాక్‌లను వెనుక-చక్రాల డ్రైవ్‌ట్రెయిన్ లేదా ఆల్-వీల్ డ్రైవ్‌ట్రెయిన్‌లో అమర్చబడి ఉంటుంది.

నిస్సాన్ ఆరియా ఎలక్ట్రిక్ కారు ఆవిష్కరణ - ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

ఎంట్రీ లెవల్ మోడల్‌లో 63 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ (ఆర్‌డబ్ల్యుడి) రియర్-వీల్-డ్రైవ్ మరియు (ఎడబ్ల్యుడి) ఆల్-వీల్-డ్రైవ్ సిస్టమ్‌తో అమర్చబడి ఉంటుంది. ఆర్‌డబ్ల్యుడి వెర్షన్ 215 బిహెచ్‌పి శక్తిని / 300 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఎడబ్ల్యుడి వెర్షన్ 335 బిహెచ్‌పి శక్తిని / 560 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. కంపెనీ పేర్కొన్న సమాచారం ప్రకారం, పూర్తి చార్జ్‌పై గరిష్ట డ్రైవింగ్ రేంజ్ 450 కిలోమీటర్లు (ఆర్‌డబ్ల్యుడి) మరియు 430 కిలోమీటర్లు (ఎడబ్ల్యుడి)గా ఉంటుంది.

నిస్సాన్ ఆరియా ఎలక్ట్రిక్ కారు ఆవిష్కరణ - ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

డ్రైవ్‌ట్రెయిన్‌ను బట్టి యాక్సిలరేషన్ స్పీడ్ మరియు టాప్-స్పీడ్‌లు మారుతూ ఉంటాయి. 63 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కలిగిన ఎడబ్ల్యుడి వేరియంట్ 7.5 సెకండ్లలో 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఇకపోతే ఆర్‌డబ్ల్యుడి వేరియంట్ 5.4 సెకండ్లలోనే 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఈ రెండు డ్రైవ్‌ట్రెయిన్‌ల యొక్క టాప్-స్పీడ్‌లు వరుసగా 160 కి.మీ / గం మరియు 200 కి.మీ / గం.

నిస్సాన్ ఆరియా ఎలక్ట్రిక్ కారు ఆవిష్కరణ - ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

టాప్ ఎండ్ వెరియంట్ 90 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ అమర్చిన ఆర్‌డబ్ల్యుడి, ఏడబ్ల్యుడి డ్రైవ్‌ట్రెయిన్‌ ఆప్షన్లలో లభిస్తుంది. ఇది వరుసగా 238 బిహెచ్‌పి శక్తి / 300 ఎన్ఎమ్ టార్క్‌ని మరియు 389 బిహెచ్‌పి శక్తిని / 600 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. పూర్తి చార్జ్‌పై ఈ బ్యాటరీ ప్యాక్ 610 కిలోమీటర్ల డ్రైవింగ్ రేంజ్ (ఆర్‌డబ్ల్యుడి వేరియంట్) మరియు 580 కిలోమీటర్ల డ్రైవింగ్ రేంజ్ (ఎడబ్ల్యుడి వేరియంట్)ని ఆఫర్ చేస్తుంది.

నిస్సాన్ ఆరియా ఎలక్ట్రిక్ కారు ఆవిష్కరణ - ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

టాప్-స్పెక్ 90 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ మోడళ్ల పెర్ఫార్మెన్స్ గణాంకాలను గమనిస్తే, ఆర్‌డబ్ల్యుడి వేరియంట్ 7.6 సెకండ్ల వ్యవధిలో 0-100 కిలోమీట్రల వేగాన్ని అందుకుంటుంది. అదే ఎడబ్ల్యుడి వేరియంట్ అయితే, కేవలం 5.1 సెకండ్లలోనే ఈ వేగాన్ని చేరుకుంటుంది. ఈ రెండు డ్రైవ్‌ట్రెయిన్‌లు కూడా వరుసగా 160 కి.మీ / గం మరియు 200 కి.మీ / గం గరిష్ట వేగాన్ని కలిగి ఉంటాయి, దీనిని యాంత్రికంగా ఫిక్స్ చేయబడి ఉంటుంది.

నిస్సాన్ ఆరియా ఎలక్ట్రిక్ కారు ఆవిష్కరణ - ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

నిస్సాన్ అరియా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కొలతలను గమనిస్తే, ఇది 4595 మిమీ పొడవు, 1850 మిమీ వెడల్పు మరియు 1660 మిమీ ఎత్తు, 2775 మిమీ వీల్‌బేస్ కలిగి ఉంది. వేరియంట్‌ను బట్టి బరువు 1900 కిలోల నుండి 2,200 కిలోల మధ్యలో ఉంటుంది.

నిస్సాన్ ఆరియా ఎలక్ట్రిక్ కారు ఆవిష్కరణ - ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ గురించి నిస్సాన్ యొక్క సిఓఓ అశ్వని గుప్తా మాట్లాడుతూ, "నిస్సాన్ అరియా నిజంగా అందమైన మరియు గొప్ప కారు. ఇది మిమ్మల్ని మరింత సులభంగా మరియు సౌకర్యవంతంగా తీసుకువెళ్ళడానికి వీలు కల్పిస్తుంది. అరియా ఆకట్టుకునేలా రూపొందించబడింది మరియు నిస్సాన్ కృషి చేసే వాటిని వ్యక్తీకరించడానికి, కస్టమర్ల జీవితాలను మెరుగుపరచడానికి తయారు చేయబడినద"ని అన్నారు.

నిస్సాన్ ఆరియా ఎలక్ట్రిక్ కారు ఆవిష్కరణ - ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

నిస్సాన్ అరియా కొత్త ‘షీల్డ్' డిజైన్‌ను మరియు 3డి ‘కుమికో' ప్యాటర్న్‌ను కలిగి ఉంటుంది. ఇందులో 20 ఎల్‌ఈడిలతో బ్యాక్‌లిట్ నిస్సాన్ లోగో కూడా ఉంటుంది. ఎస్‌యూవీ వెలుపలి భాగంలో ఉన్న ఇతర ఫీచర్లను గమనిస్తే, ఎల్‌ఈడి హెడ్‌ల్యాంప్స్, వ్రాప్ అరౌండ్ స్ప్లిట్ టెయిల్ ల్యాంప్స్ మరియు టర్న్ ఇండికేటర్స్, హై-మౌంటెడ్ రియర్ వింగ్ మరియు లైట్ బార్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఎంచుకునే అరియా వేరియంట్‌ను బట్టి 19 ఇంచ్ లేదా 20 ఇంచ్ అల్లాయ్ వీల్స్ లభిస్తాయి.

నిస్సాన్ ఆరియా ఎలక్ట్రిక్ కారు ఆవిష్కరణ - ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

లోపలి భాగాన్ని గమనిస్తే, టచ్ సెన్సిటివ్ బటన్లతో సింపుల్‌గా ఉండే క్యాబిన్ డిజైన్‌ను కలిగి ఉంటుంది. ఇందులో ఒక టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు ఒక డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌లు ఉంటాయి. ఇంకా ఇందులో ఫుల్ స్క్రీన్ హెడ్-అప్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది, ఇది సెగ్మెంట్లో కెల్లా పెద్దగా ఉంటుందని నిస్సాన్ పేర్కొంది.

నిస్సాన్ ఆరియా ఎలక్ట్రిక్ కారు ఆవిష్కరణ - ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

ఇందులోని ఇతర ఫీచర్ల విషయానికి వస్తే,‘జీరో గ్రావిటీ' స్లిమ్-ప్రొఫైల్ సీట్స్, నిస్సాన్ బ్రాండ్ యొక్క లేటెస్ట్ ప్రోపైలట్ సిస్టమ్‌తో సహా హై లెవల్ డ్రైవర్ అసిస్టెన్స్ ఫీచర్లు ఉన్నాయి. ఇందులో లేన్ కీపింగ్ అసిస్టెన్స్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ వంటి మెరుగైన భద్రతా ఫీచర్లు కూడా ఉన్నాయి.

నిస్సాన్ ఆరియా ఎలక్ట్రిక్ కారు ఆవిష్కరణ - ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ యొక్క వివిధ రకాల కంట్రోల్స్ కోసం ఏఐ అసిస్టెడ్ వాయిస్ కమాండ్స్ కూడా ఉంటాయి. బ్యాటరీ స్థితిని తనిఖీ చేయడానికి మరియు టెంపరేచర్ కంట్రోల్స్ ఆపరేట్ చేయడానికి వాహన యజమానులు నిస్సాన్ స్మార్ట్‌ఫోన్ యాప్‌ను ఉపయోగించవచ్చు. ఈ ఫీచర్లన్నీ 4జి కనెక్టివిటీతో కూడిన ఎంబెడెడ్ సిమ్ ద్వారా ఆపరేట్ చేయబడుతాయి.

నిస్సాన్ ఆరియా ఎలక్ట్రిక్ కారు ఆవిష్కరణ - ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

నిస్సాన్ ఆరియా ఎలక్ట్రిక్ వాహనంపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

ప్రపంచ వ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడానికి మరియు ఈ విభాగంలో తన సత్తా చాటుకోవటానికి నిస్సాన్ గట్టిగా కృషి చేస్తోంది. నిస్సాన్ ఆరియా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ అద్భుతమైన ఫీచర్లు, సింపుల్ ఆపరేటింగ్ కంట్రోల్స్, ఆకర్షణీయమైన ఫ్యూచరిస్టిక్ డిజైన్, మెరుగైన డ్రైవింగ్ రేంజ్ వంటి లక్షణాలతో నిండి ఉంది.

More from DriveSpark

Article Published On: Friday, July 17, 2020, 11:53 [IST]
English summary
Nissan unveiled the all-new Nissan Ariya electric SUV globally. The all-electric vehicles will be offered with two powertrain and drivetrain options when launched in the market. Read in Telugu.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+