డాట్సన్ కార్ల ఉత్పత్తిని నిలిపివేసిన నిస్సాన్

జపాన్ దిగ్గజ కార్ల తయారీ సంస్థ అయిన నిస్సాన్ కొన్ని సంవత్సరాల క్రితం తక్కువ ధర కలిగిన డాట్సన్ కార్లను విడుదల చేసింది. గో, గో ప్లస్, రెడిగో మరియు గో క్రాస్ మోడళ్లను రష్యన్, ఆఫ్రికన్ మరియు ఆగ్నేయాసియా మార్కెట్లలో డాట్సన్ పేరుతో విక్రయిస్తున్నారు.

డాట్సన్ కార్ల ఉత్పత్తిని నిలిపివేసిన నిస్సాన్

ఈ డాట్సన్ కార్లు అతి తక్కువ ధరను కలిగి ఉన్నప్పటికీ ఇండియన్ మార్కెట్లో ఊహించిన విధంగా అమ్ముడు కాలేదు. కాబట్టి ఆదాయం తగ్గుముఖం పట్టింది. ఈ కారణంగా డాట్సన్ కార్లను పూర్తిగా నిలిపివేయాల్సి పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం ఇండోనేసియాలో డాట్సన్ కార్లు మూసివేయబడుతున్నాయి.

డాట్సన్ కార్ల ఉత్పత్తిని నిలిపివేసిన నిస్సాన్

ఒక్క ఇండోనేసియాలో మాత్రమే కాకుండా అదనంగా దాని రెండు తయారీ కర్మాగారాలను మూసివేసింది. నిస్సాన్ కార్లను అక్కడి కరావాంగ్ ప్లాంట్లో మరియు బుర్వకార్తాలోని తయారీ కర్మాగారంలో తయారు చేస్తారు. నిస్సాన్ ఈ రెండు ఉత్పత్తి కర్మాగారాలను మూసివేసింది. ఈ కారణంగా వేలాది మంది ఉద్యోగాలు కోల్పోయారు.

డాట్సన్ కార్ల ఉత్పత్తిని నిలిపివేసిన నిస్సాన్

ఈ విధంగా మూసివేసినప్పటికీ నిస్సాన్ కార్లను దిగుమతి చేసుకోవడం మరియు అమ్మడం కొనసాగిస్తోంది. ఎక్స్-ట్రయల్ మరియు సెరెనా మోడళ్లను జపాన్‌లోని నిస్సాన్ ఉత్పత్తి కర్మాగారం నుండి దిగుమతి చేసుకుని ఇండోనేషియాలో విక్రయిస్తున్నారు. నవార్ పికప్ ట్రక్ థాయిలాండ్ నుండి దిగుమతి అవుతుంది. నిస్సాన్ తన భాగస్వామి సంస్థ మిత్సుబిషి యొక్క ఉత్పత్తి కర్మాగారంలో లివోనియా ఎంపివిని ఉత్పత్తి చేయాలని యోచిస్తోంది.

డాట్సన్ కార్ల ఉత్పత్తిని నిలిపివేసిన నిస్సాన్

నిస్సాన్ కిక్స్ ఎస్‌యువిని త్వరలో ఇండోనేషియాలో విడుదల చేయనున్నారు. ఈ మోడల్‌ను థాయిలాండ్‌కు దిగుమతి చేసుకుని విక్రయించే అవకాశాలు ఉన్నాయి. గత సంవత్సరం డాట్సన్ దాదాపు 7,000 యూనిట్లను విక్రయించినాట్లు ప్రకటించింది.

డాట్సన్ కార్ల ఉత్పత్తిని నిలిపివేసిన నిస్సాన్

కంపెనీ ఊహించిన దానికంటే తక్కువ అమ్మకాలు చేపట్టడం వల్ల డాట్సన్ కార్ల అమ్మకాలను నిస్సాన్ పూర్తిగా నిలిపివేసింది. భారత్‌తో సహా 2022 నాటికి డాట్సన్ కార్లు ప్రపంచవ్యాప్తంగా మూసివేయబడతాయి.

డాట్సన్ కార్ల ఉత్పత్తిని నిలిపివేసిన నిస్సాన్

భారతదేశంలో డాట్సన్ కార్ల అమ్మకాలు ఆశించిన స్థాయిలో లేవు. నిస్సాన్ ఈ విధమైన నిర్ణయం తీసుకోవడం వల్ల ప్రపంచవ్యాప్తంగా 12,500 మంది ఉద్యోగాలు కోల్పోతారు.

More from DriveSpark

Article Published On: Thursday, March 26, 2020, 14:24 [IST]
English summary
Nissan discontinues Datsun car brand in Indonesia. Read in Telugu.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+