నిక్సాన్ కిక్స్ మీద లక్షన్నర విలువైన యానివర్సరీ ఆఫర్లు & డిస్కౌంట్లు

నిస్సాన్ కిక్స్ ఎస్‌యూవీ ఇండియన్ మార్కెట్లోకి విడుదలై సరిగ్గా ఏడాది అవుతోంది. ఈ సందర్బాన్ని పుస్కరించుకుని నిస్సాన్ ఇండియా తమ కిక్స్ కాంపాక్ట్ ఎస్‌యూవీ మీద అద్భుతమైన ఆఫర్లు మరియు డిస్కౌంట్లు ప్రకటించింది.

నిక్సాన్ కిక్స్ మీద లక్షన్నర విలువైన యానివర్సరీ ఆఫర్లు & డిస్కౌంట్లు

నిస్సాన్ కిక్స్ యానివర్సరీ ఆఫర్లలో భాగంగా కొత్తగా నిస్సాన్ కిక్స్ ఎస్‌యూవీ కొనుగోలు చేసే కస్టమర్ల కోసం సుమారు లక్షన్నర (1.5 లక్షలు) విలువ చేసే డిస్కౌంట్లు మరియు ఇతర ప్రయోజనాలను ప్రకటించింది.

నిక్సాన్ కిక్స్ మీద లక్షన్నర విలువైన యానివర్సరీ ఆఫర్లు & డిస్కౌంట్లు

నిస్సాన్ కిక్స్ యానివర్సరీ ఆఫర్‌లో భాగంగా రూ. 40,000 వరూ క్యాష్ బ్యాక్, రూ. 40,000 వరకూ ఎక్స్‌చ్ఛేంజ్ బోనస్, రూ. 10,000 వరకూ కార్పోరేట్ బోనస్, రూ. 20,500 విలువైన మూడేళ్ల అదనపు వారంటీ మరియు రూ. 40,000 విలువైన 36 నెలలకు గాను 6.99 వడ్డీ శాతం వంటి లభిస్తాయి.

నిక్సాన్ కిక్స్ మీద లక్షన్నర విలువైన యానివర్సరీ ఆఫర్లు & డిస్కౌంట్లు

నిస్సాన్ ఇండియా ఈ ఆఫర్లకు సంభందించిన షరతులు కూడా వెల్లడించింది. స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే ఈ ఆఫర్లు వర్తిస్తాయి. క్యాష్ డిస్కౌంట్లు పిల్లర్స్ ఆఫ్ ఇండియా ప్రోగ్రాం కింద మాత్రమే లభిస్తాయి మరియు ఎక్స్‌చ్ఛేంజ్ బోనస్ ఆఫర్లు ఎంచుకోదగిన డీలర్లు వద్ద మాత్రమే లభిస్తాయి.

నిక్సాన్ కిక్స్ మీద లక్షన్నర విలువైన యానివర్సరీ ఆఫర్లు & డిస్కౌంట్లు

పిల్లర్స్ ఆఫ్ ఇండియా (ప్రభుత్వ అధికారులు మరియు ఉద్యోగులు) లేదా కార్పోరేట్ ఆఫర్లు మాత్రమే వర్తిస్తాయి. వేరియంట్ల వారీగా ఆఫర్లలో వ్యత్యాసం ఉంటుంది. ఫైనాన్స్ ఆఫర్లు నిస్సాన్ రెనో ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇండియా ద్వారా మాత్రమే లభిస్తాయి.

నిక్సాన్ కిక్స్ మీద లక్షన్నర విలువైన యానివర్సరీ ఆఫర్లు & డిస్కౌంట్లు

అదనంగా, నిస్సాన్ ఇండియా "ఎనీటైమ్ ఎనీవేర్" టెస్ట్ డ్రైవ్ క్యాంపెయిన్ ప్రారంభించింది. నిస్సాన్ కిక్స్ ఎస్‌‌యూవీ కోనుగోలు చేయాలనుకునే కస్టమర్ల కోసం సమయం మరియు ప్రదేశం ఎంచుకోవడం ద్వారా ఉచిత టెస్ట్ డ్రైవ్ అవకాశం కూడా లభిస్తుంది.

నిక్సాన్ కిక్స్ మీద లక్షన్నర విలువైన యానివర్సరీ ఆఫర్లు & డిస్కౌంట్లు

నిస్సాన్ కిక్స్ ఎంచుకోవాలనుకునే కస్టమర్లు testdrive.nissan.in వెబ్‌సైట్లో టైమింగ్, ప్రదేశం మరియు స్లాట్ బుక్ చేసుకొని నిస్సాన్ కిక్స్ ఎస్‌యూవీని టెస్ట్ డ్రైవ్‌కు తీసుకెళ్లచ్చు. ముంబాయ్ మరియు ఢిల్లీ-కేంద్ర రాజధాని పరిధిలోని నిస్సాన్ షోరూముల్లో ఈ టెస్ట్ డ్రైవ్ అవకాశం అందుబాటులో ఉంది.

నిక్సాన్ కిక్స్ మీద లక్షన్నర విలువైన యానివర్సరీ ఆఫర్లు & డిస్కౌంట్లు

ఎనీటైమ్ ఎనీవేర్ టెస్ట్ డ్రైవ్ క్యాంపెయిన్ ద్వారా కస్టమర్లు ఉదయం 9 నుండి సాయంత్రం 7 వరకూ వారం మొత్తం ఎప్పుడైనా టెస్ట్ డ్రైవ్ చేసుకునే వెసులుబాటు కల్పించారు.

నిక్సాన్ కిక్స్ మీద లక్షన్నర విలువైన యానివర్సరీ ఆఫర్లు & డిస్కౌంట్లు

నిస్సాన్ ఇండియా ఇటీవల కిక్స్ ఎక్స్ఇ డీజల్ వేరియంట్‌ను మార్కెట్లోకి రిలీజ్ చేసింది. ఈ వెర్షన్ XE, XL, XV మరియు XV Premium అనే మరో నాలుగు విభిన్న వేరియంట్లలో లభిస్తోంది. వీటి ధరల శ్రేణి రూ. 9.89 లక్షల నుండి రూ. 13.69 లక్షల మధ్య ఉంది.

నిక్సాన్ కిక్స్ మీద లక్షన్నర విలువైన యానివర్సరీ ఆఫర్లు & డిస్కౌంట్లు

నిస్సాన్ కిక్స్ ఎస్‌యూవీ పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌లో కూడా లభిస్తోంది. XL మరియు XV పెట్రోల్ వేరియంట్ల ధరలు వరుసగా రూ. 9.55 లక్షలు మరియు రూ. 10.95 లక్షలుగా ఉన్నాయి. అన్ని ధరలు ఎక్స్-షోరూమ్ (ఇండియా)గా ఇవ్వబడ్డాయి.

నిక్సాన్ కిక్స్ మీద లక్షన్నర విలువైన యానివర్సరీ ఆఫర్లు & డిస్కౌంట్లు

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

నిస్సాన్ ఇండియా తమ కిక్స్ ఎస్‌యూవీని మార్కెట్లోకి విడుదల చేసి ఏడాది పూర్తయిన సందర్భంగా కొత్త కస్టమర్ల కోసం అద్భుతమైన ఆఫర్లు తీసుకొచ్చింది. సేల్స్ పెంచుకునేందుకు విలువకు తగ్గ ఆఫర్లను ప్రకటిస్తూ నిస్సాన్ గొప్ప నిర్ణయం తీసుకుంది. మీకు సమీపంలోని నిస్సాన్ షోరూముని సందర్శించి, కిక్స్ ఎస్‌యూవీని టెస్ట్ డ్రైవ్ చేసి నచ్చితే బుక్ చేసుకోవాలని మా సలహా.

Most Read Articles

English summary
Nissan Kicks Celebrates First Anniversary In India: Company Offers Discounts, Benefits, And More. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X