నిస్సాన్ మాగ్నైట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ ఇంటీరియర్స్ ఇలా ఉంటాయి!

జపనీస్ కార్ బ్రాండ్ నిస్సాన్ భారత మార్కెట్ కోసం అభివృద్ధి చేస్తున్న ఓ సరికొత్త కాంపాక్ట్ ఎస్‌యూవీ 'మాగ్నైట్'ను ఇటీవలే ఆవిష్కరించిన సంగతి తెలిసినదే. కాగా, కంపెనీ ఇప్పుడు తమ బి-ఎస్‌యూవీ కాన్సెప్ట్ 'నిస్సాన్ మాగ్నైట్' ఇంటీరియర్ ఫోటోలను వెల్లడి చేసింది.

నిస్సాన్ మాగ్నైట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ ఇంటీరియర్స్ ఇలా ఉంటాయి!

ఈ సరికొత్త సబ్-4 మీటర్ ఎస్‌యూవీ వచ్చే ఏడాది ప్రారంభంలో భారత మార్కెట్లో విడుదల కావచ్చని అంచనా. నిస్సాన్ ఇండియా విడుదల చేసిన మాగ్నైట్ కాన్సెప్ట్ క్యాబిన్ చిత్రాలను చూస్తే, ఇందులో ప్రొడక్షన్‌కు సిద్ధమయ్యే వేరియంట్‌లో ఏవేమీ ఇంటీరియర్స్ ఫీచర్స్ ఆశించవచ్చో తెలుసుకోవచ్చు. ఈ చిత్రాల్లో ప్రధానంగా డాష్‌బోర్డ్ మరియు క్యాబిన్ స్పేస్‌ను హైలైట్ చేశారు.

నిస్సాన్ మాగ్నైట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ ఇంటీరియర్స్ ఇలా ఉంటాయి!

నిస్సాన్ మాగ్నైట్ ఇంటీరియర్ చిత్రాలలో చూపినట్లుగా, ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీలో పెద్ద టచ్‌స్క్రీన్, పూర్తి-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, హెక్సాగనల్ ఏసి వెంట్స్ మరియు పుష్-బటన్ స్టార్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇంకా ఇందులో ఇంటీరియర్స్‌లో రెడ్ అండ్ సిల్వర్ యాక్సెంట్స్ ఉన్నాయి. డిజిటల్ రీడౌట్‌తో కూడిన టెంపరేచర్ కంట్రోల్స్‌ని కూడా ఇందులో గమనించవచ్చు.

నిస్సాన్ మాగ్నైట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ ఇంటీరియర్స్ ఇలా ఉంటాయి!

మాగ్నైట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ కాన్సెప్ట్‌లో త్రీ-స్పోక్ స్టీరింగ్ వీల్, విశాలమైన క్యాబిన్ 360-డిగ్రీ పార్కింగ్ కెమెరా వంటి కొన్ని సెగ్మెంట్-ఫస్ట్ ఫీచర్లతో కూడా ఉన్నాయి. నిస్సాన్ మాగ్నైట్ బోల్డ్ ఫ్రంట్ డిజైన్‌తో ఇప్పుడు మరింత అగ్రెసివ్ లుక్‌తో స్పోర్టీ డిజైన్ థీమ్‌ను కలిగి ఉంటుంది.

నిస్సాన్ మాగ్నైట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ ఇంటీరియర్స్ ఇలా ఉంటాయి!

దీని ఫ్రంట్ డిజైన్‌ను గమనిస్తే, ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీలో పెద్ద ఫ్రంట్ గ్రిల్, ఇరువైపులా సొగసైన ఎల్‌ఈడి హెడ్‌ల్యాంప్స్, ఎల్-ఆకారంలో ఉండే ఎల్‌ఈడి డిఆర్‌ఎల్‌లను కలిగి ఉంది. ఈ ఎల్ఈడి డిఆర్ఎల్ హెడ్‌ల్యాంప్ యూనిట్ నుండి ప్రారంభమై ఫ్రంట్ బంపర్‌లో కలుస్తుంది. ఇది చూడటానికి ఇటీవలే అప్‌గ్రేడ్ చేసిన డాట్సన్ రెడి-గో హ్యాచ్‌బ్యాక్ మాదిరిగా అనిపిస్తుంది.

నిస్సాన్ మాగ్నైట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ ఇంటీరియర్స్ ఇలా ఉంటాయి!

సైడ్ ప్రొఫైల్‌ను గమనిస్తే, ముందుకు వచ్చినట్లుగా ఉండే వీల్ ఆర్చెస్ మరియు వాటిపై బ్లాక్ ప్లాస్టిక్ ప్యాడింగ్, బ్లాక్ స్కిడ్ ప్లేట్ మరియు దానిపై సిల్వర్ గార్నిష్, సిల్వర్ డోర్ బ్యాండిల్స్, బాకవుట్ సైడ్ మిర్రర్స్, స్పోర్టీ డ్యూయెల్ టోన్ అల్లాయ్ వీల్స్ వంటి ఫీచర్లచో మరింత స్పోర్టీ అగ్రెసివ్ స్టైలింగ్‌ను కలిగి ఉంటుంది.

నిస్సాన్ మాగ్నైట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ ఇంటీరియర్స్ ఇలా ఉంటాయి!

వెనుక ప్రొఫైల్‌లో ఎల్‌ఈడి టెయిల్ లైట్స్ కూడా ఉంటాయి. అయితే, ఇది కేవలం కాన్సెప్ట్ మాత్రమే కావడంతో, ప్రొడక్షన్ వెర్షన్‌లో ఎన్ని ఫీచర్లు ఉంటాయో అనేది తెలియాల్సి ఉంది. ఈ ఏడాది చివరి నాటికి ఉత్పత్తికి సిద్ధంగా ఉన్న మాగ్నైట్ కాంపాక్ట్ ఎస్‌యూవీని నిస్సాన్ మార్కెట్లో విడుదల చేయవచ్చని అంచనా.

నిస్సాన్ మాగ్నైట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ ఇంటీరియర్స్ ఇలా ఉంటాయి!

ఈ కారులో ఆఫర్ చేయబోయే ఇంజన్ ఆప్షన్స్ విషయనికి వస్తే, ఇందుకు సంబంధించి ప్రస్తుతానికి ఎలాంటి వివరాలు తెలియకపోయినప్పటికీ, నిస్సాన్ మాగ్నైట్‌లో 1.0 లీటర్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించవచ్చని తెలుస్తోంది. ఈ ఇంజన్ గరిష్టంగా 71 బిహెచ్‌పి శక్తిని మరియు 96 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుందని అంచనా. నిస్సాన్ అనుబంధ సంస్థ రెనాల్ట్ తయారు చేస్తున్న ట్రైబర్ ఎమ్‌పివిలో కూడా ఇదే ఇంజన్‌ను ఉపయోగిస్తున్నారు.

నిస్సాన్ మాగ్నైట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ ఇంటీరియర్స్ ఇలా ఉంటాయి!

నిస్సాన్ ఇందులో 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌ను కూడా ఉపయోగించే ఆస్కారం ఉంది. ఈ టర్బో పెట్రోల్ ఇంజన్ 99 బిహెచ్‌పి శక్తిని మరియు 160 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇందులో సిక్స్-స్పీడ్ మాన్యువల్ మరియు సివిటి ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ ఆప్షన్లు ఉండే అవకాశం ఉంది.

నిస్సాన్ మాగ్నైట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ ఇంటీరియర్స్ ఇలా ఉంటాయి!

మాగ్నైట్ ఇంటీరియర్స్‌ను విడుదల చేసిన సందర్భంగా, నిస్సాన్ మోటార్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ రాకేశ్ శ్రీవాస్తవ మాట్లాడుతూ, "నిస్సాన్ మాగ్నైట్ కాన్సెప్ట్ నిస్సాన్ యొక్క ఎస్‌యూవీ చరిత్రలో ఓ కొత్త అధ్యాయంగా నిలుస్తుంది. బాహ్య రూపమే కాదు, లోపలివైపు కూడా ప్రీమియం అనుభవాన్ని అందించేలా అధునాతనమైన సాంకేతికతతో మరియు విశాలమైన క్యాబిన్ స్థలాన్ని ఆఫర్ చేసేలా మాగ్నైట్‌ను డిజైన్ చేశాము. ఫ్యూచరిస్టిక్ డిజైన్ ఫిలాసఫీతో ఇది ఈ సెగ్మెంట్లో గేమ్ ఛేంజర్‌గా మారుతుందని ఆశిస్తున్నామ"ని అన్నారు.

నిస్సాన్ మాగ్నైట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ ఇంటీరియర్స్ ఇలా ఉంటాయి!

కొత్త నిస్సాన్ మాగ్నైట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ ఇంటీరియర్స్ ఆవిష్కరణపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

నిస్సాన్ మాగ్నైట్ ఇంటీరియర్స్‌ను డిజిటల్ ఫార్మాట్‌లో రిలీజ్ చేశారు, ఇది చూడటానికి చాలా ఫ్యూచరిస్టిక్‌గా ఉంది. ప్రొడక్షన్ వెర్షన్‌కు ఇది కొంచెం దగ్గరగా ఉండే అవకాశం ఉంది. నిస్సాన్ మాగ్నైట్ భారత కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలో హ్యుందాయ్ వెన్యూ, టాటా నెక్సాన్, ఫోర్డ్ ఎకోస్పోర్ట్, మారుతి సుజుకి విటారా బ్రెజ్జా, రాబోయే కియా సోనెట్ మరియు రెనాల్ట్ కిగర్ వంటి మోడళ్లకు పోటీగా నిలిచే ఆస్కారం ఉంది.

Most Read Articles

English summary
Nissan is gearing up to launching its new compact-SUV called the Magnite in the Indian market. Nissan India has released a set of images of the Magnite concept cabin.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X