విడుదలకు ముందే లీకైన నిస్సాన్ మాగ్నైట్ ఫోటోలు; ఎలా ఉందో చూడండి!

జపనీస్ కార్ బ్రాండ్ నిస్సాన్, భారత మార్కెట్ కోసం 'మాగ్నైట్' పేరుతో ఓ సరికొత్త కాంపాక్ట్ ఎస్‌యూవీని తయారు చేస్తున్న సంగతి తెలిసినదే. నిస్సాన్ ఇండియా తమ మాగ్నైట్ కాంపాక్ట్ ఎస్‌యూవీని భారతదేశం వేదికగా చేసుకొని అక్టోబర్ 21, 2020వ తేదీన ప్రపంచానికి పరియచం చేయనుంది.

విడుదలకు ముందే లీకైన నిస్సాన్ మాగ్నైట్ ఫోటోలు; ఎలా ఉందో చూడండి!

ఈ నేపథ్యంలో, తాజాగా నిస్సాన్ మాగ్నైట్‌కు సంబంధించి ఎలాంటి క్యామోఫ్లేజ్ లేని ప్రొడక్షన్ వెర్షన్ చిత్రాలు ఇంటర్నెట్‌లో లీక్ అయ్యాయి. షిఫ్టింగ్ గేర్స్ విడుదల చేసిన చిత్రాల ప్రకారం, కంటైనర్ల నుండి అన్‌లోడ్ చేస్తున్న నిస్సాన్ మాగ్నైట్ వాహనాలను ఇందులో మనం గమనించవచ్చు.

విడుదలకు ముందే లీకైన నిస్సాన్ మాగ్నైట్ ఫోటోలు; ఎలా ఉందో చూడండి!

దీన్నిబట్టి చూస్తుంటే, నిస్సాన్ ఇండియా తమ మాగ్నైట్ వాహనాలను ఫ్యాక్టరీ నుండి దేశంలోని వివిధ అధికారిక నిస్సాన్ డీలర్‌షిప్ కేంద్రాలకు వీటిని సరఫరా చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆక్టోబర్ 21న ఆవిష్కరణ అయిన తర్వాత, అతికొద్ది రోజుల్లోనే నిస్సాన్ మాగ్నైట్ అమ్మకాలు, డెలివరీలు కూడా ప్రారంభం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

MOST READ:వావ్.. హైవేపై అద్భుతం.. డ్రైవర్ లేకుండా నడుస్తున్న కార్ [వీడియో]

విడుదలకు ముందే లీకైన నిస్సాన్ మాగ్నైట్ ఫోటోలు; ఎలా ఉందో చూడండి!

ఈ చిత్రాలలో చూసినట్లుగా, ప్రొడక్షన్ వెర్షన్ నిస్సాన్ మాగ్నైట్ రెడ్ అండ్ బ్లాక్ డ్యూయెల్-టోన్ కలర్ స్కీమ్‌లో పెయింట్ చేయబడి ఉంది. ఈ కాంపాక్ట్-ఎస్‌యూవీలో స్టైలిష్ ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, ఫ్రంట్ బంపర్‌లపై ఎల్-ఆకారపు ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌లు, పెద్ద హెక్సాగనల్ ఫ్రంట్ గ్రిల్, రూఫ్ మౌంటెడ్ స్పాయిలర్, ఎల్‌ఈడీ టెయిల్ లైట్లు, ఇంటిగ్రేటెడ్ టర్న్ సిగ్నల్స్ వంటి అనేక ఫీచర్లను గమనించవచ్చు.

విడుదలకు ముందే లీకైన నిస్సాన్ మాగ్నైట్ ఫోటోలు; ఎలా ఉందో చూడండి!

ఇంటీరియర్స్‌లో అందుబాటులో ఉన్న ఫీచర్ల గురించి ప్రస్తుతానికి ఎలాంటి వివరాలు తెలియకపోయినప్పటికీ, నిస్సాన్ మాగ్నైట్ క్యాబిన్‌లో ఫుల్లీ లోడెడ్ ఫీచర్లు మాత్రం లభిస్తాయని తెలుస్తోంది. ఇందులో పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఛార్జింగ్, స్టీరింగ్-మౌంటెడ్ కంట్రోల్స్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, 360-డిగ్రీ కెమెరా వంటి ఫీచర్లు ఉండొచ్చని అంచనా.

MOST READ:జరభద్రం గురూ.. కారులో ఇలా చేసారంటే ప్రాణాలే పోవచ్చు.. కావాలంటే ఇది చూడండి

విడుదలకు ముందే లీకైన నిస్సాన్ మాగ్నైట్ ఫోటోలు; ఎలా ఉందో చూడండి!

నిస్సాన్ మాగ్నైట్ కాంపాక్ట్ ఎస్‌యూని నిస్సాన్-రెనాల్ట్ అలయన్స్‌లో భాగమైన అదే సిఎమ్ఎఫ్ఏ+ ప్లాట్‌ఫామ్‌పై తయారు చేస్తున్నారు. ఇదే ప్లాట్‌ఫామ్‌పై రెనాల్ట్ ట్రైబర్ ఎమ్‌పివిని కూడా తయారు చేస్తున్నారు. రెనాల్ట్ ఎమ్‌పివి ఇప్పటికే భారత మార్కెట్లో అత్యంత సరసమైన ధరకే అందుబాటులో ఉన్న 7-సీటర్ మోడల్‌గా మంచి విజయాన్ని సాధించింది.

విడుదలకు ముందే లీకైన నిస్సాన్ మాగ్నైట్ ఫోటోలు; ఎలా ఉందో చూడండి!

ఈ కాంపాక్ట్ కారులో ఆఫర్ చేయబోయే ఇంజన్ ఆప్షన్స్ విషయనికి వస్తే, నిస్సాన్ మాగ్నైట్‌లో 1.0 లీటర్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించవచ్చని తెలుస్తోంది. ఈ ఇంజన్ గరిష్టంగా 71 బిహెచ్‌పి శక్తిని మరియు 96 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుందని అంచనా. నిస్సాన్ అనుబంధ సంస్థ రెనాల్ట్ తయారు చేస్తున్న ట్రైబర్ ఎమ్‌పివిలో కూడా ఇదే ఇంజన్‌ను ఉపయోగిస్తున్నారు.

MOST READ:భార్యని 90 కిమీ రిక్షా మీద తీసుకెళ్లిన భర్త.. ఎందుకో తెలుసా ?

విడుదలకు ముందే లీకైన నిస్సాన్ మాగ్నైట్ ఫోటోలు; ఎలా ఉందో చూడండి!

నిస్సాన్ ఇందులో 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌ను కూడా ఉపయోగించే ఆస్కారం ఉంది. ఈ ఇంజన్‌ను హెచ్ఆర్10 కోడ్‌నేమ్‌తో డెవలప్ చేస్తున్నారు. ఈ టర్బో పెట్రోల్ ఇంజన్ 99 బిహెచ్‌పి శక్తిని మరియు 160 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇందులో సిక్స్-స్పీడ్ మాన్యువల్ మరియు సివిటి ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ ఆప్షన్లు ఉండే అవకాశం ఉంది.

విడుదలకు ముందే లీకైన నిస్సాన్ మాగ్నైట్ ఫోటోలు; ఎలా ఉందో చూడండి!

నిస్సాన్ మాగ్నైట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ భారత మార్కెట్లో విడుదలైన తర్వాత, ప్రస్తుతం కంపెనీ విక్రయిస్తున్న నిస్సాన్ కిక్స్ మిడ్-సైజ్ ఎస్‌యూవీ మరియు నిస్సాన్ జిటి-ఆర్ స్పోర్ట్స్ కార్ మోడళ్లతో పాటుగా విక్రయించబడుతుంది.

MOST READ:మీకు తెలుసా.. టీవీఎస్ XL100 కంఫర్ట్ బిఎస్ 6 రివ్యూ.. వచ్చేసింది

విడుదలకు ముందే లీకైన నిస్సాన్ మాగ్నైట్ ఫోటోలు; ఎలా ఉందో చూడండి!

నిస్సాన్ మాగ్నైట్ స్పై చిత్రాలపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

అతి తక్కువ ప్రోడక్ట్ పోర్ట్‌ఫోలియోతో భారత మార్కెట్లో సతమతవుతున్న నిస్సాన్ ఇండియా బ్రాండ్‌కు 'మాగ్నైట్' పూర్వవైభవాన్ని తెచ్చిపెట్టే అవకాశం ఉంది. నిస్సాన్ మాగ్నైట్ భారత మార్కెట్లో విడుదలైన తర్వాత, ఇది అత్యంత పోటీతో కూడుకున్న కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలోని కియా సోనెట్, హ్యుందాయ్ వెన్యూ, టాటా నెక్సాన్, మారుతి సుజుకి విటారా బ్రెజ్జా, టొయోటా అర్బన్ క్రూయిజర్, ఫోర్డ్ ఎకోస్పోర్ట్ మరియు రెనాల్ట్ నుండి రానున్న కిగర్ వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది.

Source:Shifting-gears

Most Read Articles

English summary
Nissan is all set to globally unveil its all-new compact-SUV, the Magnite on the 21st of October 2020. Once unveiled, the all-new Nissan Magnite will go on sale in the Indian market sometime during the month of November 2020. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X