టొయోటా అర్బన్ క్రూయిజర్ పని పట్టనున్న నిస్సాన్ మాగ్నైట్..

నిస్సాన్ ఇండియా త్వరలోనే భారత మార్కెట్ కోసం ఓ సరికొత్త కాంపాక్ట్ ఎస్‌యూవీ "మాగ్నైట్"ను విడుదల చేయాలని చూస్తోంది. భారతదేశంలో అత్యంత పోటీతో కూడుకున్న కాంపాక్ట్-ఎస్‌యూవీ విభాగంలో నిస్సాన్ ఈ కొత్త మోడల్‌ను విడుదల చేయడం ద్వారా దేశంలో తమ బ్రాండ్ అమ్మకాలను విస్తృతంగా పెంచుకోవాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.

టొయోటా అర్బన్ క్రూయిజర్ పని పట్టనున్న నిస్సాన్ మాగ్నైట్..

తాజాగా, టీమ్‌బిహెచ్‌పి నుండి వచ్చిన సమాచారం ప్రకారం, నిస్సాన్ ఈ ఏడాది చివరి నాటికి తమ మాగ్నైట్ ఎస్‌యూవీని విడుదల చేయవచ్చని తెలుస్తోంది. ఇదివరకు ఉన్న నివేదికల ప్రకారం, నిస్సాన్ మాగ్నైట్ రాక 2021 ప్రారంభంలో ఉండొచ్చని తెలిసింది. అయితే, భారతదేశంలో తమ అమ్మకాలను పెంచుకునేందుకు నిస్సాన్ ఇండియా తమ కాంపాక్ట్-ఎస్‌యూవీని వీలైనంత త్వరగా దేశీయ మార్కెట్‌లో విడుదల చేయాలని చూస్తోంది.

టొయోటా అర్బన్ క్రూయిజర్ పని పట్టనున్న నిస్సాన్ మాగ్నైట్..

ప్రస్తుతం, నిస్సాన్ ఇండియాకు దేశీయ విపణిలో కేవలం ఒకే ఒక మోడల్ (నిస్సాన్ కిక్స్) మాత్రమే ఉంది. నిస్సాన్ ఇటీవలే ఇందులో శక్తివంతమైన టర్బో-పెట్రోల్ ఇంజన్ వేరియంట్‌ను విడుదల చేసింది. ఈ ఏడాది ప్రారంభంలో బిఎస్6 ఉద్గార నిబంధనలను కఠినతరం చేయటంతో కంపెనీ తమ ప్రోడక్ట్ లైనప్‌లోని అన్ని ఇతర మోడళ్లను తొలగించి వేసిన సంగతి తెలిసినదే.

MOST READ:సాధారణ కార్లు లగ్జరీ కార్లుగా మారాయి..ఎలాగో తెలుసా ?

టొయోటా అర్బన్ క్రూయిజర్ పని పట్టనున్న నిస్సాన్ మాగ్నైట్..

నిస్సాన్ మాగ్నైట్ టైగర్ నుండి ప్రేరణ పొందిన ధైర్యమైన మరియు గంభీరమైన వైఖరిని కలిగి ఉంటుంది. నిస్సాన్ విడుదల చేసిన మాగ్నైట్ కాన్సెప్ట్ ప్రకారం, దీని ఫ్రంట్ డిజైన్‌లో పెద్ద ఫ్రంట్ గ్రిల్, ఇరువైపులా సొగసైన ఎల్‌ఈడి హెడ్‌ల్యాంప్స్, ఎల్-ఆకారంలో ఉండే ఎల్‌ఈడి డిఆర్‌ఎల్‌లు ఉన్నాయి. ఈ ఎల్ఈడి డిఆర్ఎల్ హెడ్‌ల్యాంప్ యూనిట్ నుండి ప్రారంభమై ఫ్రంట్ బంపర్‌లో కలుస్తుంది.

టొయోటా అర్బన్ క్రూయిజర్ పని పట్టనున్న నిస్సాన్ మాగ్నైట్..

సైడ్ ప్రొఫైల్‌ను గమనిస్తే, ముందుకు వచ్చినట్లుగా ఉండే వీల్ ఆర్చెస్ మరియు వాటిపై బ్లాక్ ప్లాస్టిక్ ప్యాడింగ్, బ్లాక్ స్కిడ్ ప్లేట్ మరియు దానిపై సిల్వర్ గార్నిష్, సిల్వర్ డోర్ బ్యాండిల్స్, బాకవుట్ సైడ్ మిర్రర్స్, స్పోర్టీ డ్యూయెల్ టోన్ అల్లాయ్ వీల్స్ వంటి ఫీచర్లచో మరింత స్పోర్టీ అగ్రెసివ్ స్టైలింగ్‌ను కలిగి ఉంటుంది. వెనుక ప్రొఫైల్‌లో ఎల్‌ఈడి టెయిల్ లైట్స్ కూడా ఉంటాయి.

MOST READ:ఎంజి గ్లోస్టర్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. వచ్చేసింది.. చూసారా !

టొయోటా అర్బన్ క్రూయిజర్ పని పట్టనున్న నిస్సాన్ మాగ్నైట్..

నిస్సాన్ ఇండియా విడుదల చేసిన మాగ్నైట్ కాన్సెప్ట్ క్యాబిన్ చిత్రాలను చూస్తే, ఇందులో ప్రొడక్షన్‌కు సిద్ధమయ్యే వేరియంట్‌లో ఏవేమీ ఇంటీరియర్స్ ఫీచర్స్ ఆశించవచ్చో తెలుసుకోవచ్చు. ఈ చిత్రాల్లో ప్రధానంగా డాష్‌బోర్డ్ మరియు క్యాబిన్ స్పేస్‌ను హైలైట్ చేశారు.

టొయోటా అర్బన్ క్రూయిజర్ పని పట్టనున్న నిస్సాన్ మాగ్నైట్..

నిస్సాన్ మాగ్నైట్ ఇంటీరియర్ చిత్రాలలో చూపినట్లుగా, ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీలో పెద్ద టచ్‌స్క్రీన్, పూర్తి-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, హెక్సాగనల్ ఏసి వెంట్స్ మరియు పుష్-బటన్ స్టార్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇంకా ఇందులో ఇంటీరియర్స్‌లో రెడ్ అండ్ సిల్వర్ యాక్సెంట్స్ ఉన్నాయి. డిజిటల్ రీడౌట్‌తో కూడిన టెంపరేచర్ కంట్రోల్స్‌ని కూడా ఇందులో గమనించవచ్చు.

MOST READ:భారత్‌లో కార్యకలాపాలను నిలిపివేసిన లగ్జరీ బైక్ కంపెనీ హార్లే డేవిడ్సన్, ఎందుకో తెలుసా ?

టొయోటా అర్బన్ క్రూయిజర్ పని పట్టనున్న నిస్సాన్ మాగ్నైట్..

ఈ కారులో ఆఫర్ చేయబోయే ఇంజన్ ఆప్షన్స్ విషయనికి వస్తే, ఇందుకు సంబంధించి ప్రస్తుతానికి ఎలాంటి వివరాలు తెలియకపోయినప్పటికీ, నిస్సాన్ మాగ్నైట్‌లో 1.0 లీటర్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించవచ్చని తెలుస్తోంది. ఈ ఇంజన్ గరిష్టంగా 71 బిహెచ్‌పి శక్తిని మరియు 96 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుందని అంచనా. నిస్సాన్ అనుబంధ సంస్థ రెనాల్ట్ తయారు చేస్తున్న ట్రైబర్ ఎమ్‌పివిలో కూడా ఇదే ఇంజన్‌ను ఉపయోగిస్తున్నారు.

టొయోటా అర్బన్ క్రూయిజర్ పని పట్టనున్న నిస్సాన్ మాగ్నైట్..

నిస్సాన్ ఇందులో 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌ను కూడా ఉపయోగించే ఆస్కారం ఉంది. ఈ ఇంజన్‌ను హెచ్ఆర్10 కోడ్‌నేమ్‌తో డెవలప్ చేస్తున్నారు. ఈ టర్బో పెట్రోల్ ఇంజన్ 99 బిహెచ్‌పి శక్తిని మరియు 160 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇందులో సిక్స్-స్పీడ్ మాన్యువల్ మరియు సివిటి ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ ఆప్షన్లు ఉండే అవకాశం ఉంది.

MOST READ:2020 ఆగస్టులో అత్యధికంగా అమ్ముడైన టాప్ 10 బైకులు, ఇవే

టొయోటా అర్బన్ క్రూయిజర్ పని పట్టనున్న నిస్సాన్ మాగ్నైట్..

నిస్సాన్ మాగ్నైట్ కాంపాక్ట్ ఎస్‌యూవీపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

ప్రస్తుతం, భారతదేశంలో కాంపాక్ట్-ఎస్‌యూవీ విభాగం మొత్తం ఆటోమొబైల్ అమ్మకాలలో అత్యధిక వాటాను కలిగి ఉంది. ప్రస్తుత పండుగ సీజన్‌లో ఈ విభాగం మరింత ఊపందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, నిస్సాన్ మాగ్నైట్‌ను వీలైనంత త్వరగా మార్కెట్లో విడుదల చేయటం ద్వారా, డిమాండ్‌ను క్యాష్ చేసుకోవాలని కంపెనీ భావిస్తోంది.

Most Read Articles

English summary
Nissan is looking to launch the upcoming Magnite compact-SUV soon in the Indian market. The company aims to boost sales for the brand in the country by launching a new model in the highly competitive compact-SUV segment in India. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X