నిస్సాన్ మాగ్నైట్, రెనాల్ట్ కిగర్ కాంపాక్ట్ ఎస్‌యూవీలు రెండూ పక్కపక్కనే..

ఫ్రెంచ్ కార్ కంపెనీ రెనాల్ట్, జపనీస్ కార్ బ్రాండ్ నిస్సాన్‌లు రెండూ భారత మార్కెట్ కోసం రెండు సరికొత్త కాంపాక్ట్ ఎస్‌యూవీలను తయారు చేస్తున్న సంగతి తెలిసినదే. నిస్సాన్ నుంచి మాగ్నైట్, రెనాల్ట్ నుంచి కిగర్ మోడళ్లు మార్కెట్లోకి రానున్నాయి. తాజాగా ఈ రెండు మోడళ్లను భారత రోడ్లపై టెస్టింగ్ చేస్తుండగా, గాడివాడి బృందం తమ కెమెరాలో బంధించింది.

నిస్సాన్ మాగ్నైట్, రెనాల్ట్ కిగర్ కాంపాక్ట్ ఎస్‌యూవీలు రెండూ పక్కపక్కనే..

నిస్సాన్ ఇప్పటికే తమ మాగ్నైట్ కాంపాక్ట్ ఎస్‌యూవీని ఆవిష్కరించి, అందులోని ఫీచర్లను కూడా టీజర్ వీడియోలు, ఫొటోల రూపంలో వెల్లడి చేసింది. అయితే, రెనాల్ట్ ఇంకా తమ కిగర్ కాంపాక్ట్ ఎస్‌యూవీని మార్కెట్‌కు పరిచయం చేయలేదు. ఈ ఏడాది పండుగ సీజన్లో కిగర్ ఎప్పుడైనా విడుదల కావచ్చని అంచనా.

నిస్సాన్ మాగ్నైట్, రెనాల్ట్ కిగర్ కాంపాక్ట్ ఎస్‌యూవీలు రెండూ పక్కపక్కనే..

ఈ రెండు మోడళ్లను మార్కెట్లో విడుదల చేయటానికి ముందే ఇరు కంపెనీలు వీటిని భారత రోడ్లు, వాతావరణాలకు అనుగుణంగా విస్తృతంగా పరీక్షిస్తున్నాయి. గాడివాడి విడుదల చేసిన చిత్రాల ప్రకారం, రెనాల్ట్ కిగర్ మరియు నిస్సాన్ మాగ్నైట్‌లను రెండింటనీ పక్కప్కనే పార్క్ చేసి ఉండటాన్ని చూడొచ్చు.

MOST READ:హెలికాఫ్టర్లు చేసే ఈ పనులు విమానాలు ఎందుకు చేయలేవు.. మీకు తెలుసా ?

నిస్సాన్ మాగ్నైట్, రెనాల్ట్ కిగర్ కాంపాక్ట్ ఎస్‌యూవీలు రెండూ పక్కపక్కనే..

ఈ రెండు మోడళ్లను పూర్తిగా క్యామోఫ్లేజ్ చేసి టెస్ట్ చేస్తున్నారు. అయినప్పటికీ, ఇందులో కొన్ని డిజైన్ ఫీచర్లు వెల్లడయ్యాయి. రెనాల్ట్ కిగర్ టెస్టింగ్ వాహనంలో స్లిప్ చేసిన సి ఆకారంలో ఉండే ఎల్ఈడి టెయిల్ లాంప్స్‌ను గుర్తించవచ్చు. ఇందులో రివర్స్ లైట్ మరియు ఎల్ఈడి టర్న్ ఇండికేటర్లను కూడా అమర్చారు.

నిస్సాన్ మాగ్నైట్, రెనాల్ట్ కిగర్ కాంపాక్ట్ ఎస్‌యూవీలు రెండూ పక్కపక్కనే..

బూట్ డోర్‌కు దిగువన మరియు బంపర్‌కు ఎగువన రెడ్ రిఫ్లెక్టర్లు మరియు బ్లాక్ క్లాడింగ్‌ను కూడా ఇందులో గమనించలచ్చు. ఇందులో రూఫ్ రెయిల్స్ కూడా కనిపిస్తున్నాయి. ఇవి చూడటానికి గ్రే కలర్‌లో ఫినిష్ చేసినట్లుగా అనిపిస్తున్నాయి.

MOST READ:ఒకే ఇంట్లో మూడు రోల్స్ రాయిస్ కార్లు ఉపయోగిస్తున్నారు, ఆ ఫ్యామిలీ ఎదో తెలుసా ?

నిస్సాన్ మాగ్నైట్, రెనాల్ట్ కిగర్ కాంపాక్ట్ ఎస్‌యూవీలు రెండూ పక్కపక్కనే..

నిస్సాన్ మాగ్నైట్ పక్కన నిలిపి ఉంచిన కిగర్ ఎస్‌యూవీని చూస్తుంటే, ఇది జపనీస్ ఎస్‌యూవీ కంటే ఎత్తుగా ఉన్నట్లు అనిపిస్తుంది. వెనుక వైపు విండ్‌షీల్డ్ కూడా కాస్తంత లోతుగా అమర్చినట్లు తెలుస్తోంది. ఈ రెండు మోడళ్లను తమిళనాడులోని ఒరగాడమ్‌లోని రెనాల్ట్-నిస్సాన్ అలయన్స్ ప్లాంట్‌లో తయారు చేయనున్నారు.

నిస్సాన్ మాగ్నైట్, రెనాల్ట్ కిగర్ కాంపాక్ట్ ఎస్‌యూవీలు రెండూ పక్కపక్కనే..

రెనాల్ట్ ట్రైబర్ ఎమ్‌పివిని తయారు చేస్తున్న సిఎమ్ఎఫ్-ఏ ప్లస్ ప్లాట్‌ఫాంపై ఆధారపడి రెనాల్ట్ కిగర్ కాంపాక్ట్ ఎస్‌యూవీని కూడా తయారు చేయనున్నారు. ఇది పొడవైన రైడింగ్ ఎస్‌యూవీగా ఉంటుంది, ఫలితంగా కిగర్ ఎస్‌యూవీలో ఐదుగురు ప్రయాణీకులు సౌకర్యవంతంగా కూర్చునేందుకు మంచి క్యాబిన్ స్పేస్ ఉంటుంది.

MOST READ:ఆంధ్రప్రదేశ్ సిఎం జగన్ మోహన్ రెడ్డికి ప్రశంసల వెల్లువ.. ఎందుకో తెలుసా ?

నిస్సాన్ మాగ్నైట్, రెనాల్ట్ కిగర్ కాంపాక్ట్ ఎస్‌యూవీలు రెండూ పక్కపక్కనే..

పెద్ద వీల్ ఆర్చెస్, బోల్డ్ క్రీజ్ లైన్స్ మరియు ఫ్లోటింగ్-రూఫ్ డిజైన్‌తో రెనాల్ట్ కిగర్ ఎస్‌యూవీ మంచి రగ్గడ్ డిజైన్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. మరోవైపు, నిస్సాన్ మాగ్నైట్ కూడా ఇదే తరహా డిజైన్‌తో బయటి వైపు నుంచి అగ్రెసివ్‌గా కనిపిస్తుంది.

నిస్సాన్ మాగ్నైట్, రెనాల్ట్ కిగర్ కాంపాక్ట్ ఎస్‌యూవీలు రెండూ పక్కపక్కనే..

రెనాల్ట్ కిగర్ ఇంటీరియర్స్‌లో కూడా అనేక ఫీచర్లు, మెరుగైన కనెక్టివిటీ అండ్ కంఫర్ట్ ఫీచర్లు ఉంటాయని అంచనా. ఇందులో ప్రధానంగా మౌంటెడ్ కంట్రోల్స్‌తో కూడిన మల్టీఫంక్షన్ స్టీరింగ్ వీల్ మరియు ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉండే అవకాశం ఉంది.

MOST READ:ఇప్పుడే చూడండి.. ఎంజి గ్లోస్టర్ యొక్క కొత్త టీజర్ వీడియో

నిస్సాన్ మాగ్నైట్, రెనాల్ట్ కిగర్ కాంపాక్ట్ ఎస్‌యూవీలు రెండూ పక్కపక్కనే..

అంతేకాకుండా, ఇందులో పూర్తి-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లేతో పాటుగా బ్రాండ్ యొక్క కనెక్టింగ్ టెక్నాలజీకి సపోర్ట్ ఇచ్చే ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు ఫ్యాక్టరీ ఫిట్టెడ్ సన్‌రూఫ్‌ మొదలైన ఫీచర్లు కూడా ఉండొచ్చని తెలుస్తోంది.

నిస్సాన్ మాగ్నైట్, రెనాల్ట్ కిగర్ కాంపాక్ట్ ఎస్‌యూవీలు రెండూ పక్కపక్కనే..

రెనాల్ట్ కిగర్‌ను కంపెనీ రెండు రకాల ఇంజన్ ఆప్షన్లతో అందించే అవకాశం ఉంది. ఇందులో మొదటిది 1.0-లీటర్, త్రీ సిలిండర్ న్యాచురల్లీ ఆస్పైర్డ్ పెట్రోల్ ఇంజన్, రెండవది 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్. ట్రైబర్ ఎమ్‌పివిలో ఉపయోగిస్తున్న 1.0 లీటర్ ఇంజన్‌నే కొత్త కిగర్‌లోనూ ఉపయోగించే అవకాశం ఉంది.

నిస్సాన్ మాగ్నైట్, రెనాల్ట్ కిగర్ కాంపాక్ట్ ఎస్‌యూవీలు రెండూ పక్కపక్కనే..

ఈ 1.0 లీటర్ ఇంజన్ గరిష్టంగా 71 బిహెచ్‌పి శక్తిని మరియు 96 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో పాటుగా ఆప్షనల్ ఏఎమ్‌టి (ఆటోమేటెడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్)తో కూడా లభిస్తుంది.

నిస్సాన్ మాగ్నైట్, రెనాల్ట్ కిగర్ కాంపాక్ట్ ఎస్‌యూవీలు రెండూ పక్కపక్కనే..

రెనాల్ట్ ఇండియా ‘హెచ్‌ఆర్ 10' అనే కోడ్‌నేమ్‌తో ఓ కొత్త 1.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌ను కూడా అభివృద్ధి చేస్తోంది. ఇది ముందుగా కిగర్ ద్వారానే విడుదల కానుంది. ఈ ఇంజన్ సుమారు 95 బిహెచ్‌పి శక్తిని ఉత్పత్తి చేస్తుందని అంచనా. ఇది 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ లేదా సివిటి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభించే అవకాశం ఉంది.

నిస్సాన్ మాగ్నైట్, రెనాల్ట్ కిగర్ కాంపాక్ట్ ఎస్‌యూవీలు రెండూ పక్కపక్కనే..

రెనాల్ట్ కిగర్ కాంపాక్ట్ ఎస్‌యూవీపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

భారత మార్కెట్లో అత్యంత పోటీతో కూడుకున్న కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలో రెనాల్ట్ కిగర్ విడుదల కానుంది. ఇది ఈ సెగ్మెంట్లో హ్యుందాయ్ వెన్యూ, మారుతి సుజుకి విటారా బ్రెజ్జా, టాటా నెక్సాన్ మరియు రాబోయే కియా సోనెట్ వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది.

Source: GaadiWaadi

Most Read Articles

English summary
Renault is working on introducing a new model in the Indian market called the Kiger. It will be placed in the compact-SUV segment in the Indian market. The Kiger is expected to be launched sometime during the festive season. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X