నిస్సాన్ కిక్స్ ఎస్‌యూవీపై భారీ డిస్కౌంట్; సెప్టెంబర్ ఫెస్టివ్ ఆఫర్స్!

జపనీస్ కార్ బ్రాండ్ నిస్సాన్, భారత మార్కెట్లో విక్రయిస్తున్న కిక్స్ ఎస్‌యూవీపై ఆకర్షణీయమైన ప్రయోజనాలను ప్రకటించింది. సెప్టెంబర్ 2020లో నిస్సాన్ కిక్స్ ఎస్‌యూవీని కొనుగోలు చేసే కస్టమర్లకు కంపెనీ గరిష్టంగా రూ.75,000 వరకు విలువైన ప్రయోజనాలను అందిస్తోంది. ఈ ఆఫర్ పరిమిత సమయం వరకు (సెప్టెంబర్ 30, 2020 వరకు) మాత్రమే చెల్లుబాటులో ఉంటుంది.

నిస్సాన్ కిక్స్ ఎస్‌యూవీపై భారీ డిస్కౌంట్; సెప్టెంబర్ ఫెస్టివ్ ఆఫర్స్!

కొత్త నిస్సాన్ కిక్స్ ఎస్‌యూవీ కోసం కస్టమర్లు తమ ఏదైనా పాత కారును షోరూమ్‌లో మార్పిడి (ఎక్సేంజ్) చేసుకున్నట్లుయితే, వారికి రూ.45,000 విలువైన ప్రయోజనాలను కంపెనీ అందిస్తోంది. ఇతర ప్రయోజనాల క్రింద రూ.10,000 లాయల్టీ బోనస్ మరియు రూ.10,000 కార్పొరేట్ ఆఫర్‌ను కూడా కంపెనీ అందిస్తోంది.

నిస్సాన్ కిక్స్ ఎస్‌యూవీపై భారీ డిస్కౌంట్; సెప్టెంబర్ ఫెస్టివ్ ఆఫర్స్!

ఈ ఆఫర్లకు అదనంగా, సెప్టెంబర్ 15, 2020 లోపుగా కొత్త నిస్సాన్ కిక్స్ బుక్ చేసుకునే కస్టమర్లకు అదనంగా రూ.15,000 బెనిఫిట్స్‌ను అందిస్తోంది. నిస్సాన్ నుండి భారత మార్కెట్లో లభిస్తున్న ఏకైక మోడల్ కిక్స్ ఎస్‌యూవీ మాత్రమే. ఇది కాకుండా కంపెనీ ఓ ఇంపోర్టెడ్ స్పోర్ట్స్ కార్ (జిటి-ఆర్)ను కంపెనీ విక్రయిస్తోంది. భవిష్యత్తులో భారత్ కోసం మాగ్నైట్ అనే ఓ కాంపాక్ట్ ఎస్‌యూవీని నిస్సాన్ సిద్ధం చేస్తోంది.

MOST READ:పెరుగుతున్న ఆటో ప్రయాణికులు, తగ్గుముఖం పట్టిన క్యాబ్‌ సర్వీసులు ; ఎందుకో తెలుసా ?

నిస్సాన్ కిక్స్ ఎస్‌యూవీపై భారీ డిస్కౌంట్; సెప్టెంబర్ ఫెస్టివ్ ఆఫర్స్!

దేశీయ విపణిలో కొత్త 2020 నిస్సాన్ కిక్స్ ఎక్స్ఎల్, ఎక్స్‌వి, ఎక్స్‌వి ప్రీమియం మరియు ఎక్స్‌వి ప్రీమియం (ఆప్షనల్) అనే నాలుగు వేరియంట్లలో లభిస్తోంది. ఎంట్రీ లెవల్ ఎక్స్‌ఎల్ మరియు మిడ్-స్పెక్ ఎక్స్‌వి వేరియంట్లలో 1.5 పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌తో లభిస్తాయి.

నిస్సాన్ కిక్స్ ఎస్‌యూవీపై భారీ డిస్కౌంట్; సెప్టెంబర్ ఫెస్టివ్ ఆఫర్స్!

ఎక్స్‌వి మరియు ఎక్స్‌వి ప్రీమియం వేరియంట్లలో మాన్యువల్ మరియు ఆటోమేటిక్ ఆప్షన్లతో కూడిన టర్బో-పెట్రోల్ ఇంజన్‌ను కంపెనీ ఆఫర్ చేస్తోంది. అయితే టాప్-స్పెక్ ఎక్స్‌వి ప్రీమియం (ఆప్షనల్) వేరియంట్ మాత్రం కేవలం మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తోనే లభిస్తుంది. మార్కెట్లో నిస్సాన్ కిక్స్ ధరలు రూ.9.49 లక్షల నుండి రూ.14.15 లక్షల మధ్యలో ఉన్నాయి (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ).

MOST READ:రూ. 5 లక్షల లోపు ధర కలిగిన మారుతి సుజుకి టాప్ 5 కార్లు ఇవే.. చూసారా

నిస్సాన్ కిక్స్ ఎస్‌యూవీపై భారీ డిస్కౌంట్; సెప్టెంబర్ ఫెస్టివ్ ఆఫర్స్!

కొత్త 2020 నిస్సాన్ కిక్స్ రెండు పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లతో లభిస్తుంది. అవి: 1.5-లీటర్ న్యాచురల్లీ అస్పైర్డ్ పెట్రోల్ ఇంజన్ మరియు 1.3-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్. ఇందులో 1.5-లీటర్ ఇంజన్ 105 బిహెచ్‌పి పవర్‌ని మరియు 142 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

నిస్సాన్ కిక్స్ ఎస్‌యూవీపై భారీ డిస్కౌంట్; సెప్టెంబర్ ఫెస్టివ్ ఆఫర్స్!

టాప్-ఎండ్ వేరియంట్లలో 1.3-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 154 బిహెచ్‌పి పవర్‌ను మరియు 254 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 6-స్పీడ్ మాన్యువల్ లేదా సివిటి ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

MOST READ:భారీగా పెరిగిన సెకండ్ హ్యాండ్ కార్ అమ్మకాలు.. కారణం ఏంటో తెలుసా

నిస్సాన్ కిక్స్ ఎస్‌యూవీపై భారీ డిస్కౌంట్; సెప్టెంబర్ ఫెస్టివ్ ఆఫర్స్!

టర్బో-పెట్రోల్ ఇంజన్ మరియు ట్రాన్సిమిషన్ ఆప్షన్లు ఇప్పుడు నిస్సాన్ అనుబంధ సంస్థ రెనాల్ట్ అందిస్తున్న డస్టర్ ఎస్‌యూవీలో కూడా అందుబాటులో ఉన్నాయి. బిఎస్6 అప్‌డేట్ తరువాత, నిస్సాన్ కిక్స్‌లో కంపెనీ డీజిల్ ఇంజన్‌ను పూర్తిగా నిలిపివేసి కేవలం పెట్రోల్ ఇంజన్లతో మాత్రమే అందిస్తోంది. ఇందులోని టర్బో వేరియంట్ వెహికల్ స్టెబిలిటీ మేనేజ్‌మెంట్ (విఎస్ఎమ్), ట్రాక్షన్ కంట్రోల్ వంటి కొన్ని ప్రత్యేక ఫీచర్లతో లభిస్తుంది.

నిస్సాన్ కిక్స్ ఎస్‌యూవీపై భారీ డిస్కౌంట్; సెప్టెంబర్ ఫెస్టివ్ ఆఫర్స్!

కొత్త నిస్సాన్ కిక్స్ ఎస్‌యూవీలో క్యాస్కేడింగ్ గ్రిల్, ఎల్‌ఈడి ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, రెండు చివర్లలో సిల్వర్ కలర్ స్కిడ్ ప్లేట్స్, రూఫ్ రెయిల్స్ మరియు 17 ఇంచ్ అల్లాయ్ వీల్స్ మొదలైన ఫీచర్లు ఉన్నాయి. కాగా, బిఎస్6 నిస్సాన్ కిక్స్ ఓవరాల్ డిజైన్ మరియు సిల్హౌట్ దాని మునుపటి బిఎస్4 మోడల్ మాదిరిగానే ఉంటుంది.

MOST READ:మమ్ముట్టి కార్ కలెక్షన్ : ఈ కార్లకు ఒక ప్రత్యేకత ఉంది, అదేంటో తెలుసా ?

నిస్సాన్ కిక్స్ ఎస్‌యూవీపై భారీ డిస్కౌంట్; సెప్టెంబర్ ఫెస్టివ్ ఆఫర్స్!

నిస్సాన్ కిక్స్ ఇంటీరియర్స్‌ను గమనిస్తే, ఇందులో కార్బన్ ఫైబర్ ఫినిషింగ్, ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, వాయిస్ రికగ్నిషన్ మరియు బ్రాండ్ యొక్క ‘నిస్సాన్ కనెక్ట్' కనెక్టింగ్ టెక్నాలజీకి సపోర్ట్ ఇచ్చే 8 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌, డ్యూయెల్ టోన్ ఇంటీరియర్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

నిస్సాన్ కిక్స్ ఎస్‌యూవీపై భారీ డిస్కౌంట్; సెప్టెంబర్ ఫెస్టివ్ ఆఫర్స్!

అంతేకాకుండా, నిస్సాన్ కిక్స్ ఎస్‌యూవీలో రియర్ ఎయిర్ కండిషనింగ్ వెంట్స్, బ్రైట్ అండ్ కూల్ గ్లౌవ్ బాక్స్, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబల్ సైడ్ మిర్రర్స్, డ్యూయెల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్స్, ఈబిడితో కూడిన ఏబిఎస్, రియర్ వ్యూ కెమెరా వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

నిస్సాన్ కిక్స్ ఎస్‌యూవీపై భారీ డిస్కౌంట్; సెప్టెంబర్ ఫెస్టివ్ ఆఫర్స్!

కంపెనీ పేర్కొన్న సమాచారం ప్రకారం, నిస్సాన్ కిక్స్ 1.3 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ వేరియంట్ లీటరుకు 14.1 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. అలాగే, రెగ్యులర్ 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్ లీటరుకు 16.3 కిలోమీటర్లు మైలేజీనిస్తుంది. నిస్సాన్ కిక్స్ మొత్తం ఆరు రంగులలో లభిస్తుంది.

నిస్సాన్ కిక్స్ ఎస్‌యూవీపై భారీ డిస్కౌంట్; సెప్టెంబర్ ఫెస్టివ్ ఆఫర్స్!

నిస్సాన్ కిక్స్ ఎస్‌యూవీ డిస్కౌంట్‌పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

నిస్సాన్ ఇండియాకు ప్రస్తుతం భారత మార్కెట్లో ఉన్న ఏకైక మోడల్ నిస్సాన్ కిక్స్. ఇదివరకు కంపెనీ విక్రయించిన అన్ని మోడళ్లను కంపెనీ నిలిపివేసింది. బిఎస్6 పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లలో మాత్రమే లభిస్తున్న కిక్స్‌పై కంపెనీ ఇప్పుడు భారీ తగ్గింపులను అందిస్తోంది. నిస్సాన్ కిక్స్ ఈ విభాగంలో హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, రెనాల్ట్ డస్టర్ వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది.

Most Read Articles

English summary
Nissan has announced attractive benefits for the Kicks SUV during September 2020. The SUV is being offered with maximum benefits of up to Rs 75,000 in the Indian market. The offered is valid only for a limited time until September 30, 2020. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X