2025 నాటికి ఎలక్ట్రిక్ వాహనాల తయారీ హబ్‌గా భారత్: నితిన్ గడ్కరీ
కోవిడ్-19 పరిస్థితుల తర్వాత భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాల రోడ్‌మ్యాప్ గురించి నిర్వహించిన ఓ వెబినార్‌లో కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ మాట్లాడుతూ.. రానున్న సంవత్సరాల్లో భారతదేశం ఎలక్ట్రిక్ వాహనాల తయారీ హబ్‌గా మారుతుందని ధీమా వ్యక్తం చేశారు.

ఎలక్ట్రిక్ వాహనాల పరిశ్రమకు ప్రభుత్వం చేయగలిగిన అన్ని రకాల సహాయ, సహకారాలను అందిస్తామని, ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇప్పటికే పరిశ్రమలకు గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్ రేట్లను 12 శాతానికి సవరించిందని ఆయన గుర్తు చేశారు.

ఇ-రిక్షాలు కాకుండా, దేశంలో విక్రయించే మొత్తం ఎలక్ట్రిక్ వాహనాల్లో 90 శాతం ద్విచక్ర వాహనాలు ఉన్నాయి. వీటికి అదనంగా, రానున్న రోజుల్లో ఎలక్ట్రిక్ వాహనాల తయారీదారులు పెద్ద సంఖ్యలో ఎలక్ట్రిక్ టూవీలర్లు మరియు ఫోర్-వీలర్లను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

మార్కెట్లోకి రానున్న కొత్త ఎలక్ట్రిక్ వాహనాలతో దేశంలో ఎలక్ట్రిక్ వాహన పరిశ్రమ పరిధి పెరుగుతుందని, భారతదేశాన్ని ఎలక్ట్రిక్ వాహనాల తయారీ హాట్‌స్పాట్‌గా మార్చాలనే కేంద్ర ప్రభుత్వ ప్రణాళికను వేగవంతం చేస్తాయని రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ భావిస్తోంది.

ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాల పరిశ్రమ ఎదుర్కొంటున్న సవాళ్ళ గురించి ప్రభుత్వానికి అవగాహన ఉందని, అయితే ఎలక్ట్రిక్ వాహనాల డిమాండ్ పెరిగిన తర్వాతనే ఈ సవాళ్లను అధిగమించగలమని మంత్రి గడ్కరీ అన్నారు.

శిలాజ ఇంధనాలు అంతరించిపోతున్న నేపథ్యంలో, భవిష్యత్తులో
విద్యుత్ మరియు జీవ ఇంధనాలే ప్రత్యమ్నాయ మార్గాలని, సామూహికంగా వీటిని స్వీకరించినప్పుడే ఈ రంగంలో అద్భుతమైన అవకాశాలు ఉంటాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఢిల్లీ-ముంబై గ్రీన్ కారిడార్‌లో భాగంగా తయారవుతున్న తొలి విద్యుత్ రహదారి ఏమిటనే దానిపై ప్రభుత్వం ప్రస్తుతం కృషి చేస్తోంది.

పెట్రోలియం సహజ వనరులు నెమ్మదిగా కొరత ఏర్పడుతుందని భావిస్తున్నందున, ఇందుకు ప్రత్యామ్నాయంగా పూర్తి ఎలక్ట్రిక్‌కు మారాలని ప్రభుత్వం ఒత్తిడి చేస్తోందని గడ్కరీ అన్నారు. చైనాలో పెట్టుబడులపై ప్రపంచం అంతగా ఆసక్తి చూపకపోవడంతో, భారతదేశంలో పరిశ్రమలకు అవకాశం సరైనదని ఆయన చెప్పారు.

ఇండియా ఎలక్ట్రిక్ హబ్‌గా మారడంపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.
నిజానికి ఇది చాలా గొప్ప విషయం. పెట్రోల్, డీజిల్, గ్యాస్ వంటి ఇంధనాల వినియోగం నానాటికీ పెరిగిపోతోంది, ఫలితంగా వీటి నిల్వలు కూడా భారీగా క్షీణిస్తున్నాయి. ఇది ఇలానే కొనసాగితే కొంత కాలానికి మనకు పెట్రోల్, డీజిల్ లభించవు, ఒకవేళ లభించినా వాటిన కొనడానికి మనం భారీ మొత్తంలో నగదు చెల్లించాల్సి రావచ్చు. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే, మనం ఇప్పటి నుంచే ప్రత్యామ్నాయ ఇంధనాలతో నడిచే వాహనాలను ఎంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.


Click it and Unblock the Notifications








