Just In
- 2 hrs ago
స్విఫ్ట్, బాలెనో, ఐ20 వంటి మోడళ్లకు వణుకు పుట్టిస్తున్న టాటా ఆల్ట్రోజ్
- 2 hrs ago
దక్షిణ భారత్‌లో కొత్త డీలర్షిప్ ఓపెన్ చేసిన బెనెల్లీ; వివరాలు
- 4 hrs ago
భారత్‌లో మరే ఇతర కార్ కంపెనీ సాధించని ఘతను సాధించిన కియా మోటార్స్!
- 5 hrs ago
రిపబ్లిక్ డే పరేడ్‌లో టాటా నెక్సాన్ ఈవీ; ఏం మెసేజ్ ఇచ్చిందంటే..
Don't Miss
- Finance
నిర్మల సీతారామన్ బడ్జెట్ పైన స్టార్టప్స్ అంచనాలు
- News
ఏకగ్రీవాలపై వివరణ కోరాం, ఆటంకం కలిగిస్తే కోర్టుకే, మంత్రి వ్యాఖ్యలు బాధించాయి: నిమ్మగడ్డ రమేష్ కుమార్
- Sports
3 బంతుల్లో 15 పరుగులు.. ధోనీ తరహాలో చివరి బంతికి సిక్స్ బాదిన సోలంకి! సెమీస్‌కు బరోడా!
- Movies
మళ్లీ రాజకీయాల్లోకి చిరంజీవి.. పవన్ కల్యాణ్‌కు అండగా మెగాస్టార్.. జనసేన నేత సంచలన ప్రకటన!
- Lifestyle
Study : గాలి కాలుష్యం వల్ల అబార్షన్లు పెరిగే ప్రమాదముందట...! బీకేర్ ఫుల్ లేడీస్...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
టోల్ ప్లాజాల వద్ద ఇకపై క్యాష్ ట్రాన్సాక్షన్లు ఉండవ్.. 100 శాతం నగదు రహితం!
మీ వాహనాలకు ఫాస్ట్ ఉందా? లేకుంటే వెంటనే ఎన్‌రోల్ చేసుకునే ఏర్పాటు చేసుకోండి. కొత్త సంవత్సరం ప్రారంభం నుండి భారతదేశ వ్యాప్తంగా ఉన్న అన్ని జాతీయ రహదారుల టోల్ ప్లాజాల వద్ద నదగు లావాదేవీలు (క్యాష్ ట్రాన్సాక్షన్లను) నిలిపివేయాలని మరియు అన్ని వాహనాలకు ఫాస్ట్ ట్యాగ్ తప్పనిసరిగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.

జనవరి 1, 2021వ తేదీ నుండి జాతీయ రహదారులపై జరిగే టోల్ చెల్లింపులను నగదురహితం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇకపై టోల్ గేట్ల వద్ద పూర్తిగా 100 శాతం వసూళ్లను ఫాస్ట్‌ట్యాగ్ ద్వారా మాత్రమే నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది.

ప్రస్తుతం జాతీయ రహదారులపై ఉన్న టోల్ ప్లాజాలలో 75 శాతం లేన్లు ఫాస్ట్‌ట్యాగ్ ఉన్న వాహనాల కోసం రిజర్వు చేయగా, 25 శాతం లేన్లకు ఫాస్టాగ్‌తో పాటుగా క్యాష్ లైన్లు ఉన్నాయి. అయితే, వచ్చే ఏడాది ప్రారంభం నుండి ఈ రూల్స్ మారిపోనున్నాయి. ఇకపై టోల్ ప్లాజాల వద్ద మోటారిస్టుల నుండి ఎలాంటి తీసుకునే అవకాశం లేదు కాబట్టి వాహనదారులు ముందే జాగ్రత్తపడటం మంచిది.
MOST READ:నమ్మండి ఇది నిజంగా హీరో స్ప్లెండర్ బైక్, కావాలంటే వీడియో చూడండి

ఈటి ఆటో నివేదిక ప్రకారం, జాతీయ రహదారుల అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) హైవే వినియోగదారుల కోసం త్వరలోనే ఓ అవగాహన కార్యక్రమాన్ని కూడా ప్రారంభించబోతోంది. ఫాస్ట్‌ట్యాగ్ జారీని వేగవంతం చేయడానికి (ఎన్‌హెచ్‌ఏఐ) ప్రతి టోల్ ప్లాజా వద్ద పాయింట్-ఆఫ్-సేల్ సెంటర్‌ను కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉంది.

ఆ నివేదిక ప్రకారం, ఇటీవలే రోడ్డు రవాణా మరియు రహదారుల కార్యదర్శి గిరిధర్ అర్మనే ఉత్తరప్రదేశ్‌లోని టోల్ ప్లాజాను సందర్శించి, అక్కడి పరిస్థితులను సమీక్షించారు. టోల్ ప్లాజాల యొక్క డిజిటల్ చెల్లింపుల ప్రక్రియ త్వరలోనే పూర్తిస్థాయిలో అమలు అవుతుందని ఆయన చెప్పారు.
MOST READ:వావ్.. ఇది నిజమేనా? మైండ్‌తో కంట్రోల్ అయ్యో హోండా మోటార్‌సైకిల్!

ఈ విషయంలో ఇదివరకు పేర్కొన్న నోటీసులలో, జనవరి 1, 2021వ తేదీ నుండి కేంద్ర ప్రభుత్వం నాలుగు చక్రాల వాహనాలకు ఫాస్ట్‌ట్యాగ్ తప్పనిసరి చేసింది. దీనితో, డిసెంబర్ 1, 2017 లోపు విక్రయించిన నాలుగు చక్రాల వాహనాలకు కూడా ఫాస్ట్‌ట్యాగ్ తప్పనిసరి చేయబడింది. అలాగే, వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుండి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్‌ని రెన్యువల్ చేయటానికి కూడా ఫాస్ట్‌ట్యాగ్ తప్పనిసరిగా ఉండాలి.

మోటారు వాహనాల చట్టం 1989 ప్రకారం, నాలుగు వాహనాల రిజిస్ట్రేషన్ సమయంలో అన్ని వాహన తయారీదారులు మరియు డీలర్లకు ఫాస్ట్‌ట్యాగ్ జారీ చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. దేశంలో ఫాస్టాగ్ కలెక్షన్లు కూడా రోజురోజుకు పెరుగుతున్నాయి. అక్టోబర్ 2020 నెలలో ఏకంగా రూ.702.86 కోట్ల డిజిటల్ టోల్ కలెక్షన్లు నమోదు కాగా, సెప్టెంబర్ 2020 నెలలో రూ.658.94 కోట్లుగా నమోదైంది.
MOST READ:త్వరలో రోడ్డెక్కనున్న అలీబాబా డ్రైవ్‌లెస్ రోబోటాక్సిస్, ఇవే.. మీరు చూసారా

కాగా, ఫాస్ట్‌ట్యాగ్‌ను 100 శాతం తప్పనిసరి చేయడానికి గడువు కాలం కూడా సమీపిస్తున్న నేపథ్యంలో నవంబర్ మరియు డిసెంబర్ 2020 నెలలో ఈ కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం ఉంది. టోల్ గేట్ల వద్ద పెరుగుతున్న ట్రాఫిక్‌ను నియంత్రించడానికి కేంద్రం 2017లో ఫాస్టాగ్ విధానాన్ని ప్రారంభించింది. ఇకపై ఇది తప్పనిసరి కానుంది.

ఫాస్ట్‌ట్యాగ్ అనేది వాహనాల విండ్‌షీల్డ్‌పై అమర్చిన ఓ డిజిటల్ స్టిక్కర్. ఇది రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ టెక్నాలజీ ద్వారా పనిచేస్తుంది. ఈ స్టిక్కర్ కలిగిన వాహనం టోల్ ప్లాజా గుండా వెళుతున్నప్పుడు, అక్కడ ఉండే సెన్సార్లు ఈ ట్యాగ్‌ని రీడ్ చేసి, ఫాస్ట్‌ట్యాగ్‌తో అనుసంధానించబడిన బ్యాంక్ లేదా ప్రీపెయిడ్ ఖాతా నుండి డబ్బును ఆటోమేటిక్‌గా డిడక్ట్ చేస్తాయి.
MOST READ:మేడ్ ఇన్ ఇండియా ఎలక్ట్రిక్ కారు 'ప్రవైగ్ ఎక్స్‌టింక్షన్' ఆవిష్కరణ

ఫాస్ట్‌ట్యాగ్ విధానం ద్వారా టోల్ ప్లాజాల వద్ద వాహనాలను గంటల కొద్దీ ఆపి చెల్లింపులు చేయాల్సిన అవసరం లేదు. దీని వలన టోల్ ప్లాజాల వద్ద ట్రాఫిక్ రద్దీ తగ్గి, సమయం ఆదా అవుతుంది. వాహనాలకు ఫాస్ట్‌ట్యాగ్‌లను జారీ చేసే పనిని దేశంలోని 23 బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు అప్పగించారు. పాయింట్ ఆఫ్ సేల్ ద్వారా ఫాస్ట్‌ట్యాగ్ పంపిణీ చేయబడుతుంగి. రవాణా కార్యాలయం, టోల్ ప్లాజా లేదా ఆన్‌లైన్ ద్వారా కూడా ఫాస్టాగ్‌ను కొనుగోలు చేయవచ్చు.