కార్ కంపెనీలకు పండుగ సీజన్ ఫలించిందా లేదా?

గడచిన నంవబర్ (2020) నెలలో దేశంలోని ప్రముఖ కార్ల తయారీదారులు మిశ్రమ ఫలితాలను కనబరచారు. ఈ పండుగ సీజన్ కొన్ని కార్ కంపెనీలు ప్రోత్సాహకర ఫలితాలను తెచ్చిపెట్టగా, మరికొన్ని కంపెనీలకు నిరుత్సాహకర ఫలితాలను తెచ్చిపెట్టింది. మొత్తం దేశీయంగా చూసుకుంటే అన్ని కార్ కంపెనీల అమ్మకాలు మాత్రం గతేడాది ఇదే సమయంతో పోల్చుకుంటే ప్రోత్సాహకరంగానే ఉన్నాయి.

కార్ కంపెనీలకు పండుగ సీజన్ ఫలించిందా లేదా?

గత నెలలో మొత్తం కార్ల అమ్మకాలు 9 శాతం పెరిగి 2,86,353 యూనిట్లుగా నమోదయ్యాయి. అంతకుముందు సంవత్సరం ఇదే నెలలో (నవంబర్ 2019లో) మొత్తం దేశీయ కార్ల అమ్మకాలు 2,62,958 యూనిట్లుగా ఉన్నాయి. కాగా.. అక్టోబర్ 2020 నెలలో మొత్తం కార్ల అమ్మకాలు 3,33,659 యూనిట్లుగా ఉన్నాయి, దీనితో పోలిస్తే నవంబర్ 2020 నెల అమ్మకాలు 14 శాతం క్షీణతను నమోదు చేశాయి. గత నెలలో బ్రాండ్ వారీగా అమ్మకాలు వివరాలు ఇలా ఉన్నాయి:

కార్ కంపెనీలకు పండుగ సీజన్ ఫలించిందా లేదా?

భారతదేశపు అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా, గడచిన నవంబర్ 2020 నెలలో 1,35,700 యూనిట్లను విక్రయించగా, గత ఏడాది ఇదే సమయంలో 1,39,133 యూనిట్లను విక్రియించి మొత్తంగా 2 శాతం క్షీణతను నమోదు చేసింది. ఈ సమయంలో కంపెనీ మార్కెట్ వాటా 52.9 శాతం నుండి 47.4 శాతానికి పడిపోయింది. కాగా, అక్టోబర్ 2020 నెలలో కంపెనీ మొత్తం అమ్మకాలు 1,63,656 యూనిట్లుగా రిజిస్టర్ అయ్యాయి.

MOST READ:ఒకే కారుని 77 సంవత్సరాలు ఉపయోగించాడు.. ఇంతకీ అతడెవరో తెలుసా ?

కార్ కంపెనీలకు పండుగ సీజన్ ఫలించిందా లేదా?

అయితే, ఇదే సమయంలో హ్యుందాయ్ మోటార్ ఇండియా మాత్రం మంచి అమ్మకాలను నమోదు చేసింది. గడచిన నవంబర్ 2020 నెలలో హ్యుందాయ్ మొత్తం 48,800 యూనిట్లను విక్రయించింది, అంతకుముందు సంవత్సరం ఇదే నెలతో (నవంబర్ 2019) పోలిస్తే ఇది 9 శాతం పెరిగింది. కాగా, అక్టోబర్ 2020లో కంపెనీ విక్రయించిన 56,605 యూనిట్లతో పోలిస్తే నవంబర్ 2020 అమ్మకాలు 14 శాతం తగ్గాయి. ఈ సమయంలో కంపెనీ మార్కెట్ వాటాలో ఎలాంటి మార్పు లేదు, ఇది 17 శాతంగానే ఉంది.

కార్ కంపెనీలకు పండుగ సీజన్ ఫలించిందా లేదా?

దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ అమ్మకాలు స్థిరంగా పెరుగుతూనే ఉన్నాయి, నవంబర్ 2020లో కంపెనీ 21,600 యూనిట్ల వాహనాలను విక్రయించింది, అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే ఇది 108 శాతం పెరిగింది. అయితే, అక్టోబర్ 2020లో టాటా మోటార్స్ విక్రయించిన 23,600 యూనిట్లతో పోలిస్తే నవంబర్ 2020 అమ్మకాలు 8 శాతం తగ్గాయి. అయితే ఈ సమయంలో కంపెనీ మార్కెట్ వాటా మాత్రం 4 శాతం నుండి 7.5 శాతానికి పెరిగింది.

MOST READ:రూ. 1.26 కోట్ల రూపాలకు అమ్ముడైన 118 సంవత్సరాల పాత వెహికల్ నెంబర్.. ఎందుకో తెలుసా

కార్ కంపెనీలకు పండుగ సీజన్ ఫలించిందా లేదా?

ఈ జాబితాలో నాల్గవ స్థానంలో ఉన్నది కియా మోటార్స్. గడచిన నవంబర్ 2020లో కియా మొత్తం 21,022 యూనిట్లను విక్రయించి, అంతకు ముందు సంవత్సరం ఇదే సమయంతో పోలిస్తే 50 శాతం అమ్మకాల వృద్ధిని నమోదు చేసింది. కాగా, గడచిన అక్టోబర్ 2020 నెలలో కంపెనీ అమ్మకాలు 21021 యూనిట్లుగా నమోదయ్యాయి.

కార్ కంపెనీలకు పండుగ సీజన్ ఫలించిందా లేదా?

ఇందులో ఐదన స్థానంలో మహీంద్రా నిలిచింది. గడచిన నవంబర్ 2020లో మహీంద్రా మొత్తం 18,212 యూనిట్లను విక్రయించి, అంతకు ముందు సంవత్సరం ఇదే సమయంతో పోలిస్తే 28 శాతం అమ్మకాల వృద్ధిని నమోదు చేసింది. కాగా, గడచిన అక్టోబర్ 2020 నెలలో కంపెనీ అమ్మకాలు 18,317 యూనిట్లుగా నమోదై 1 శాతం తగ్గుదలను నమోదు చేసింది.

MOST READ:మీకు తెలుసా.. అత్యంత ఖరీదైన తెలుగు హీరోల కార్లు, వాటి వివరాలు

కార్ కంపెనీలకు పండుగ సీజన్ ఫలించిందా లేదా?

ఫ్రెంచ్ కార్ బ్రాండ్ రెనో గడచిన నవంబర్ 2020 నెల అమ్మకాల్లో 6 శాతం తగ్గుదలను నమోదు చేసింది. గడచిన నెలలో కంపెనీ 10,181 యూనిట్లను విక్రయించగా అంతకు ముందు సంవత్సరం ఇదే సమయంలో 10,882 యూనిట్లను విక్రయించింది. ఈ సమయంలో కంపెనీ మార్కెట్ వాటా 4.1 శాతం నుండి 3.6 శాతానికి పడిపోయింది.

కార్ కంపెనీలకు పండుగ సీజన్ ఫలించిందా లేదా?

జపనీస్ కార్ బ్రాండ్ హోండా గడచిన నంవబర్ 2020 నెలలో ప్రోత్సాహకర అమ్మకాలను నమోదు చేసింది. నవంబర్ 2019 అమ్మకాలతో పోలిస్తే నవంబర్ 2020లో హోండా కార్స్ ఇండియా అమ్మకాలు 55 శాతం పెరిగాయి. గత నెలలో కంపెనీ మొత్తం 9,990 వాహనాలను విక్రయించగా, అంతకు ముందు సంవత్సరం ఇదే సమయంలో 6,459 వాహనాలను విక్రయించింది. అక్టోబర్ 2020లో హోండా అమ్మకాలు 10,836 యూనిట్లుగా నమోదయ్యాయి.

MOST READ:అమెరికా కొత్త ప్రెసిడెంట్ జో బైడెన్, అతడు నడిపే కార్లు

కార్ కంపెనీలకు పండుగ సీజన్ ఫలించిందా లేదా?

ఈ జాబితాలో 8వ మరియు 9వ స్థానాల్లో వరుసగా టొయోటా, ఎమ్‌జి మోటార్ కంపెనీలు నిలిచాయి. నవంబర్ 2020 అమ్మకాల పరంగా ఈ రెండు కంపెనీలు వరుసగా 2 శాతం, 29 శాతం పెరుగుదలను నమోదు చేశాయి. టొయోటా గడచిన నవంబర్ నెలలో 8500 వాహనాలను విక్రయించగా, ఎమ్‌జి మోటార్ 4163 వాహనాలను విక్రయించింది.

కార్ కంపెనీలకు పండుగ సీజన్ ఫలించిందా లేదా?

ఇకపోతే, ఈ టాప్ 10 జాబితాలో చివరగా అమెరికన్ కార్ బ్రాండ్ ఫోర్డ్ నిలిచింది. గడచిన నవంబర్ 2020లో ఫోర్డ్ ఇండియా మొత్తం 3,991 వాహనాలను విక్రయించింది. అంతకు ముందు సంవత్సరం ఇదే సమయంతో పోలిస్తే కంపెనీ మొత్తం అమ్మకాలు 44 శాతం మేర తగ్గాయి. నవంబర్ 2019లో కంపెనీ అమ్మకాలు 5,392 యూనిట్లుగా ఉన్నాయి.

కార్ కంపెనీలకు పండుగ సీజన్ ఫలించిందా లేదా?

నవంబర్ 2020 కార్ సేల్స్ రిపోర్ట్‌పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

గడచిన నవంబర్ 2020 నెలలో పండుగ సీజన్ సెంటిమెంట్ ఉన్నప్పటికీ, కొన్ని కార్ బ్రాండ్లకు ఆ సెంటిమెంట్ కలిసిరాలేదనే చెప్పాలి. మొత్తంగా చూసుకుంటే, గడచిన నెలలో దేశంలోని కార్ల తయారీదారులు మిశ్రమ ఫలితాలను నమోదు చేశారు.

Most Read Articles

English summary
November 2020 car sales report, Maruti Suzuki, Hyundai, Tata Motors, Kia Motors and Mahindra takes the lead. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X