ఎకోడ్రైవ్‌తో మీ ఇంటి వద్దకే కార్, సేల్ నుంచి డెలివరీ వరకూ అన్నీ ఆన్‌లైన్ లోనే!

నానాటికీ పెరుగుతున్న కరోనా కేసులు మరియు కొనసాగుతున్న లాక్‌డౌన్ ఎఫెక్ట్‌తో ప్రజలు బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో, కార్ షోరూమ్‌లు మరియు డీలర్‌షిప్ కేంద్రాలు కస్టమర్లకు మరింత సురక్షితమైన కొనుగోలు అనుభవాన్ని కల్పించేందుకు కృషి చేస్తున్నాయి. కొన్ని కంపెనీలైతే ఏకంగా ఆన్‌లైన్‌లోనే కొనుగోలు నుంచి డెలివరీ వరకూ సేవలందిస్తున్నాయి.

ఎకోడ్రైవ్‌తో మీ ఇంటి వద్దకే కార్, సేల్ నుంచి డెలివరీ వరకూ అన్నీ ఆన్‌లైన్ లోనే!

ప్రస్తుత కోవిడ్-19 పరిస్థితుల్లో సురక్షితంగా కార్లను కొనుగోలు చేయాలనుకునే కస్టమర్ల కోసం ఎకోడ్రైవ్ (AckoDrive) అనే వర్చ్యువల్ కార్ డీలర్ ఓ పూర్తిస్థాయి ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఖచ్చితమైన డెలివరీ డేట్స్, ఇంటి వద్దకే డెలివరీ, సరసమైన ధరలు, సులభమైన ఫైనాన్సింగ్ ఆప్షన్లతో తమ వినియోగదారుల కోసం ఆన్‌లైన్ కార్ సేల్ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించింది.

ఎకోడ్రైవ్‌తో మీ ఇంటి వద్దకే కార్, సేల్ నుంచి డెలివరీ వరకూ అన్నీ ఆన్‌లైన్ లోనే!

ఈ సందర్భంగా ఎకోడ్రైవ్ బిజినెస్ హెడ్ సాగర్ దాస్ మాట్లాడుతూ.. కోవిడ్-19 తర్వాత వినియోగదారుల ఆలోచనా సరళి పూర్తిగా మారిపోయిందని, ప్రజలు సురక్షితమైన ప్రయాణాన్ని కోరుకుంటున్నారని, అందు కోసం కార్లను ప్రత్యామ్నాయంగా ఎంచుకుంటున్నారని అన్నారు. అంతేకాకుండా కస్టమర్లు సురక్షితంగా, ఎలాంటి ఇబ్బంది లేకుండా కార్లను కొనుగోలు చేయాలని భావిస్తున్నారని దాస్ చెప్పారు.

MOST READ: భారత్‌లో డీజిల్ కార్లను నిలిపివేసిన జాగ్వార్, వివరాలు

ఎకోడ్రైవ్‌తో మీ ఇంటి వద్దకే కార్, సేల్ నుంచి డెలివరీ వరకూ అన్నీ ఆన్‌లైన్ లోనే!

కారు కొనుగోలు నుంచి ఆ కారు కస్టమర్‌కు చేరే వరకూ కూడా పూర్తిస్థాయి భద్రతా అంశాలకు ప్రాధాన్యత ఇవ్వటమే తమ కంపెనీ ప్రధాన లక్ష్యమని ఇందులో భాగంగానే ఎకోడ్రైవ్ తమ తమ వినియోగదారులకు మంచి ధరలను, వేగవంతమైన ఫైనాన్సింగ్ సేవలను మరియు కార్లకు సంబంధించిన ఖచ్చితమైన డెలివరీ డేట్లను ఆఫర్ చేయటమే కాకుండా కస్టమర్ల ఇంటి వద్దకే కారును సురక్షితంగా డెలివరీ చేస్తామని దాస్ వివరించారు.

కంపెనీ విడుదల చేసిన కొత్త వెర్షన్ ప్రకారం, కస్టమర్లు ఇకపై డీలర్‌షిప్‌లను సందర్శించాల్సిన అవసరం లేకుండానే కారు కొనుగోలు నుంచి డెలివరీ వరకూ పూర్తిగా ఆన్‌లైన్‌లోనే చేయవచ్చు. అంతేకాకుండా ఈ కంపెనీ తమ కస్టమర్లకు ఫైనాన్సింగ్ మరియు ఇన్సూరెన్స్ ఆప్షన్లను కూడా అందుబాటులో ఉంచింది. మార్కెట్లోని ఇతర డీలర్లతో పోల్చుకుంటే బెస్ట్ డీల్స్‌ని ఆఫర్ చేస్తోంది.

ఎకోడ్రైవ్‌తో మీ ఇంటి వద్దకే కార్, సేల్ నుంచి డెలివరీ వరకూ అన్నీ ఆన్‌లైన్ లోనే!

ఎకోడ్రైవ్ దాదాపు 30 ఫైనాన్షియల్ కంపెనీలో అనుబంధం ఏర్పరుచుకొని విస్తృత శ్రేణి ఫైనాన్సింగ్ సదుపాయాలను అందిస్తోంది. కొన్ని ఫైనాన్స్ కంపెనీలైతే కేవలం 10 నిమిషాల్లోనే రుణాలను మంజూరు చేస్తున్నాయని ఎకోడ్రైవ్ పేర్కొంది. ప్రస్తుతం ఈ కంపెనీ ఢిల్లీ, ముంబై, బెంగుళూరు మరియు పూనే నగరాల్లో అందుబాటులో ఉంది.

ఇక ఈ విషయం అటుంచి వేరే వార్తల్లోకి వెళితే..

జపనీస్ బ్రాండ్ టొయోటా భారత మార్కెట్లో విక్రయిస్తున్న పాపులర్ ఎమ్‌పివి (మల్టీ పర్సప్ వెహికల్) ఇన్నోవా క్రిస్టాలో కొత్తగా బిఎస్6 వెర్షన్లను విడుదల చేసింది. మునుపటి వెర్షన్‌తో పోల్చుకుంటే ఈ కొత్త బిఎస్6 టొయోటా ఇన్నోవా క్రిస్టా ధరలు వేరియంట్‌ను బట్టి రూ.25,000 నుండి రూ.60,000 మధ్యలో పెరిగాయి.

MOST READ: కొత్త మహీంద్రా థార్ బుకింగ్స్ షురూ

ఎకోడ్రైవ్‌తో మీ ఇంటి వద్దకే కార్, సేల్ నుంచి డెలివరీ వరకూ అన్నీ ఆన్‌లైన్ లోనే!

మార్కెట్లో ప్రస్తుతం బిఎస్6 టొయోటా ఇన్నోవా క్రిస్టా ఎమ్‌పివి ప్రారంభ ధర వేరియంట్ ధర రూ.15.66 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంటే టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ.23.63 లక్షలుగా (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది. ఇది పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో లభిస్తుంది. పెట్రోల్ ఇంజన్ విషయానికి వస్తే ఇందులో 2.7 లీటర్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 164 బిహెచ్‌పిల శక్తిని, 245 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది.

ఎకోడ్రైవ్‌తో మీ ఇంటి వద్దకే కార్, సేల్ నుంచి డెలివరీ వరకూ అన్నీ ఆన్‌లైన్ లోనే!

ఇకపోతే డీజిల్ ఇంజన్ వేరియంట్లలో ఉపయోగించిన 2.4 లీటర్ ఇంజన్ గరిష్టంగా 148 బిహెచ్‌పిల శక్తిని మరియు 360 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇక గేర్ బాక్స్ (ట్రాన్సిమిషన్) విషయానికి వస్తే ఇది 5-స్పీడ్ మ్యాన్యువల్ లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ ఆప్షన్లతో అందుబాటులో ఉంది.

MOST READ: ఆల్ట్రోజ్‌తో అదరగొట్టిన టాటా, లాక్‌డౌన్‌లోనూ కొనసాగిన జోరు

ఎకోడ్రైవ్‌తో మీ ఇంటి వద్దకే కార్, సేల్ నుంచి డెలివరీ వరకూ అన్నీ ఆన్‌లైన్ లోనే!

ఎకోడ్రైవ్ ఆన్‌లైన్ సేల్స్‌పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

కోవిడ్-19 వైరస్ విజృంభన నేపథ్యంలో, కస్టమర్లకు కొనుగోలు చేయగలిన శక్తి ఉన్నప్పటికీ వైరస్ వ్యాప్తి కారణంగా బయటకు రావటానికి ఇష్టపడటం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో కారు కొనుగోలు నుంచి డెలివరీ వరకూ ఉండే ప్రక్రియను అత్యంత సులభతరం చేస్తూ, పూర్తిగా ఆన్‌లైన్ ద్వారా సేవలందిస్తున్న ఎకోడ్రైవ్ నిజంగా ప్రస్తుత పరిస్థితుల్లో బెటర్ ఆప్షన్ అనిపిస్తోంది.

Most Read Articles

English summary
AckoDrive, a virtual car dealer, has transformed into a completely online car purchase platform. The company is now providing guaranteed delivery dates, doorstep delivery, cost-effective deals, and easy financing options. Read in Telugu.
Story first published: Sunday, June 7, 2020, 12:01 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X