మీ ఐఫోన్‌తో మీ BMW కారుని అన్‌లాక్ చేయొచ్చు; ఎలాగో తెలుసా..?

బిఎమ్‌డబ్ల్యూ ఓ సరికొత్త ఆటోమొబైల్ టెక్నాలజీని పరిచయం చేసింది. భవిష్యత్తులో ఇకపై బిఎమ్‌డబ్ల్యూ ఓనర్లు తమ కారు కీ ఎక్కడైనా మర్చిపోయినా, తమ వద్ద ఓ ఐఫోన్ ఉంటే చాలు ఎంచక్కా కారుని అన్‌లాక్ చేసి, డ్రైవ్ చేసుకొని వెళ్లిపోవచ్చు. ఐఫోన్‌ను పూర్తిగా డిజిటల్ కార్ కీగా ఉపయోగించుకునేలా తయారు చేసిన ఒక్క బిఎమ్‌డబ్ల్యూకే చెందుతుంది.

మీ ఐఫోన్‌తో మీ BMW కారుని అన్‌లాక్ చేయొచ్చు; ఎలాగో తెలుసా..?

ఇటీవల నిర్వహించిన ఆపిల్ వరల్డ్‌వైడ్ డెవలపర్ కాన్ఫరెన్స్‌లో బిఎమ్‌డబ్ల్యూ ఈ విషయాన్ని ప్రకటించింది. బిఎమ్‌డబ్ల్యూ కార్లలో ఇతర కంపెనీల కన్నా ముందు తొలిసారిగా ఐపాడ్‌ను అమర్చారు. ఆ తర్వాత కార్లలో తొలిసారిగా వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే కనెక్టింగ్ టెక్నాలజీని అందించిన కంపెనీ కూడా బిఎమ్‌డబ్ల్యూనే. కాగా.. ఇప్పుడు ఐఫోన్‌ను పూర్తిగా డిజిటల్ కార్ కీ మాదిరిగా ప్రవేశపెట్టిన మొట్టమొదటి కార్ బ్రాండ్ కూడా ఇదే కావటం విశేషం.

మీ ఐఫోన్‌తో మీ BMW కారుని అన్‌లాక్ చేయొచ్చు; ఎలాగో తెలుసా..?

ఆపిల్ కార్ కీని ఐఓఎస్ 14 లో కొత్త ఫీచర్‌గా ప్రవేశపెట్టనున్నారు మరియు ఈ ఫీచర్‌ను సపోర్ట్ చేసే మొట్టమొదటి వాహనం 2021 బిఎమ్‌డబ్ల్యూ 5 సిరీస్. ఈ కొత్త ఫీచర్ సాయంతో కస్టమర్లు తమ ఫోన్‌పై కేవలం ఒకే ఒక్క ట్యాప్‌తో కారుని అన్‌లాక్ చేయవచ్చు. కారులోకి ప్రవేశించిన తర్వాత, ఐఫోన్‌ను స్మార్ట్‌ఫోన్ ట్రేలో ఉంచి, ఆపై స్టార్ట్ బటన్‌ను నొక్కడం ద్వారా వాహనాన్ని స్విచ్ ఆన్ చేయవచ్చని కంపెనీ వివరించింది.

మీ ఐఫోన్‌తో మీ BMW కారుని అన్‌లాక్ చేయొచ్చు; ఎలాగో తెలుసా..?

బిఎమ్‌డబ్ల్యూ స్మార్ట్‌ఫోన్ యాప్ సాయంతో ఈ డిజిటల్ కీని ఐఫోన్‌లలో సెటప్ చేసుకోవచ్చు. అంతేకాకుండా, బిఎమ్‌డబ్ల్యూ కార్ ఓనర్ ఈ డిజిటల్ కీ యాక్సెస్‌ని 5 గురు స్నేహితులతో షేర్ చేసుకునే సౌలభ్యం కూడా ఉంటుంది. ఇంకా ఈ యాప్ సాయంతో టాప్ స్పీడ్, హార్స్‌పవర్, గరిష్ట రేడియో సౌండ్ వంటివి మరెన్నో కార్ సెట్టింగ్‌లను పరిమితం చేసుకోవచ్చు. ఈ యాక్సెస్ నిర్వహణను కారు లోపలి నుండి కానీ లేదా ఆపిల్ వాలెట్ ద్వారా కానీ చేయవచ్చు. బిఎమ్‌డబ్ల్యూ పరిచయం చేసిన ఈ డిజిటల్ కీ ఆపిల్ వాచ్‌ను సపోర్ట్ చేస్తుంది.

మీ ఐఫోన్‌తో మీ BMW కారుని అన్‌లాక్ చేయొచ్చు; ఎలాగో తెలుసా..?

ఐఫోన్ కోసం డిజిటల్ కీ 45 దేశాల్లో అందుబాటులోకి తెస్తామని బిఎమ్‌డబ్ల్యూ ప్రకటించింది. ఈ ఏడాది జులై 1వ తేదీ నుండి తయారయ్యే 1 సిరీస్, 2 సిరీస్, 3 సిరీస్, 4 సిరీస్, 5 సిరీస్, 6 సిరీస్, 8 సిరీస్, ఎక్స్ 5, ఎక్స్ 6, ఎక్స్ 7, ఎక్స్ 5 ఎమ్, ఎక్స్ 6 ఎమ్ మరియు జెడ్ 4 వంటి మోడళ్లలో ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తుందని కంపెనీ తెలిపింది.

మీ ఐఫోన్‌తో మీ BMW కారుని అన్‌లాక్ చేయొచ్చు; ఎలాగో తెలుసా..?

ఈ విషయంలో ప్రపంచ ప్రమాణాల స్థాపనతో ముందుకు సాగేందుకు గానూ ఆపిల్ మరియు బిఎమ్‌డబ్ల్యూ కంపెనీలు కార్ కనెక్టివిటీ కన్సార్టియం (సిసిసి)తో కలిసి పనిచేస్తున్నాయి. ఎన్‌ఎఫ్‌సి కోసం డిజిటల్ కీ స్పెసిఫికేషన్ 2.0 గడచిన మే 2020లో విడుదలైంది, మరోవైపు, అల్ట్రా-వైడ్‌బ్యాండ్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకునే నెక్స్ట్ జనరేషన్ డిజిటల్ కీ కూడా ఇప్పటికే అభివృద్ధి దశలో ఉంది.

మీ ఐఫోన్‌తో మీ BMW కారుని అన్‌లాక్ చేయొచ్చు; ఎలాగో తెలుసా..?

బిఎమ్‌డబ్ల్యూకి సంబంధించిన ఇతర వార్తల్లోకి వెళితే, కంపెనీ ఇటీవలే తమ సరికొత్త 2021 బిఎమ్‌డబ్ల్యూ ఎమ్5 సెలూన్ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను గ్లోబల్ మార్కెట్లో ఆవిష్కరించింది. ఈ బిఎమ్‌డబ్ల్యూ ఎమ్5 కారు స్టాండర్డ్ మరియు కాంపిటీషన్ అనే రెండు వేరియంట్లలో లభ్యం కానుంది. ఈ రెండు మోడళ్లు వాటి మునపటి వెర్షన్లతో పోల్చుకుంటే మరిన్న అదనపు హంగులతో తయారయ్యాయి.

మీ ఐఫోన్‌తో మీ BMW కారుని అన్‌లాక్ చేయొచ్చు; ఎలాగో తెలుసా..?

బిఎమ్‌డబ్ల్యూ డిజిటల్ కార్ కీ ఆవిష్కరణపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

బిఎమ్‌డబ్ల్యూ పరిచయం చేసిన ఈ డిజిటల్ కార్ కీ సిస్టమ్ ద్వారా, కస్టమర్లు ఇకపై తాళాలు ఎక్కడంటే అక్కడ మర్చిపోవటం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. జేబులో తాళం లేకపోయినా, ఐఫోన్ చేతిలో ఉంటే చాలు ఎంచక్క కారును స్టార్ట్ చేసుకొని వెళ్లిపోవచ్చు.

More from DriveSpark

Article Published On: Wednesday, June 24, 2020, 9:50 [IST]
English summary
BMW will become the first carmaker to enable its customers to use the iPhone as a fully digital car key. This was announced at the Apple Worldwide Developer Conference. Read in Telugu.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+