డ్రైవ్ ది డ్రైవర్ ఫండ్ ప్రోగ్రాంను ప్రారంభించిన ఓలా, ఎందుకో తెలుసా.. !
భారతదేశంలో కరోనా వైరస్ ఎక్కువగా విస్తరించడం వల్ల భారత ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించబడింది. దీనివల్ల అన్ని రకాల రవాణా సదుపాయాలు నిలిపివేయడం జరిగింది. ఇందులో క్యాబ్ మరియు టాక్సీ ఉన్నాయి. దీని ఫలితంగా క్యాబ్ మరియు టాక్సీ డ్రైవర్లు కొన్ని క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారు.

ఓలా ఫౌండేషన్ కింద ఓలా కంపెనీ తన డ్రైవర్లకు మద్దతు ఇవ్వడానికి సహాయం చేస్తోంది. ఇందులో భాగంగా ఓలా ఫౌండేషన్ డ్రైవ్ ది డ్రైవర్ ఫండ్ ప్రోగ్రాంను ప్రారంభించింది.

ఈ ప్రోగ్రాం కింద ఓలా గ్రూప్ మరియు దాని పెట్టుబడిదారులు ఓలా యొక్క ఆటో రిక్షా మరియు క్యాబ్ డ్రైవర్లకు సహాయం చేయనున్నారు. నివేదికల ప్రకారం ఓలా గ్రూప్ ఈ ఫండ్‌కు రూ. 20 కోట్లు సమకూర్చుతుంది. ఓలా సీఈఓ సహ వ్యవస్థాపకుడు భనీష్ అగర్వాల్ దీని గురించి ట్వీట్ చేశారు.

లాక్ డౌన్ ప్రకటించడం వల్ల మిలియన్ల మంది డ్రైవర్లు ఆదాయం లేకుండా కష్టాలను ఎదుర్కొంటారు. వారికి సహాయం చేయాలనే ఉద్దేశ్యంతో డ్రైవ్ డ్రైవర్ ఫండ్‌ను ప్రారంభించానని చెప్పారు. దీని కోసం దాదాపు రూ. 20 కోట్లు ఇస్తున్నట్లు ప్రకటించారు.

దీని గురించి ఓలా గ్రూప్ ప్రతినిధి ఆనంద్ సుబ్రమణియన్ మాట్లాడుతూ, ఈ కష్ట సమయంలో ఓలా గ్రూప్ మన వేలాది మంది డ్రైవర్లకు సహాయం చేయడానికి ఒక నిధిని ఏర్పాటు చేసింది. దీన్ని రూ. 20 కోట్ల నుంచి రూ. 50 కోట్లకు పెంచనున్నారు.

తక్షణ సహాయం అందించడానికి ఈ ఫండ్ ఉపయోగించబడుతుంది. కంపెనీ డ్రైవర్లు మరియు వారి కుటుంబాలకు ఉచిత వైద్య సంప్రదింపులు కూడా ఇస్తామని తెలిపింది.

భారతదేశంలో కొరోనావైరస్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. భారతదేశంలో ఈ ఘోరమైన వైరస్ కారణంగా ఇప్పటికే చాలామంది ప్రజలు మరణించారు. దీని భారిన పడుతున్న ప్రజల సంఖ్య లెక్కకు మించి ఉంది.


Click it and Unblock the Notifications








