బీఎస్6 ఎఫెక్ట్: భారీగా పెరుగనున్న పెట్రోల్, డీజల్ ధరలు

ఏప్రిల్ 01, 2020 నుండి నూతనంగా అమల్లోకి రానున్న బీఎస్6 ఉద్గార ప్రమాణాల నేపథ్యంలో పెట్రోల్ మరియు డీజల్ ధరలు భారీగా పెరగనున్నాయి. పెట్రోల్ మరియు డీజల్ ధరలపై బీఎస్6 ప్రభావం ఎందుకు ఉంది? ఇంధన ధరలు ఎంత మేరకు పెరుగుతున్నాయో చూద్దాం రండి..

బీఎస్6 ఎఫెక్ట్: భారీగా పెరుగనున్న పెట్రోల్, డీజల్ ధరలు

ప్రస్తుతం ఇండియాలో లభించే బీఎస్4 పెట్రోల్ అంతర్జాతీయ యూరో-4 ప్రమాణాలకు సమానం. అయితే, కాలుష్యానికి ప్రధాన కారణాల్లో ఒకటైన వాహన కాలుష్యాన్ని తగ్గించేందుకు అన్ని వాహనాలు బీఎస్6 ఉద్గార ప్రమాణాలకు అనుగుణంగా అప్‌గ్రేడ్ చేయాలని సూచించింది.

బీఎస్6 ఎఫెక్ట్: భారీగా పెరుగనున్న పెట్రోల్, డీజల్ ధరలు

ఈ నేపథ్యంలో బీఎస్6 వాహనాలకు పెట్రోల్ మరియు డీజల్‌ను కూడా బీఎస్6 ప్రమాణాలతోనే ఇవ్వాలని భావిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో యూరో6 ప్రమాణాలతో లభించే అల్ట్రా-క్లీన్ ఫ్యూయల్‌ను ఏప్రిల్ 01 నుండి ఇండియన్ మార్కెట్లో అందుబాటులో ఉంచనున్నారు.

బీఎస్6 ఎఫెక్ట్: భారీగా పెరుగనున్న పెట్రోల్, డీజల్ ధరలు

ఇండియా ఆయిల్ కార్పోరేషన్ ఛైర్మన్ సంజీవ్ సింగ్ మాట్లాడుతూ, "ఇండియన్ ఆయిల్ రీఫైనరీస్‌లో బీఎస్6 ఫ్యూయల్ ఉత్పత్తిని ప్రారంభించాము, మరో నెల రోజుల్లో దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఐఓసీ ఫ్యూయల్ స్టేషన్లలో బీఎస్6 ఫ్యూయల్ అందుబాటులోకి వస్తుంది. ఏప్రిల్ 01 గడువులోపు పెట్రోల్ మరియు డీజల్ 100శాతం బీఎస్6 ప్రమాణాలతో లభిస్తుంది" అని వివరించారు.

బీఎస్6 ఎఫెక్ట్: భారీగా పెరుగనున్న పెట్రోల్, డీజల్ ధరలు

అత్యుత్తమ నాణ్యతా ప్రమాణాలతో కూడిన ఫ్యూయల్ అందించేందుకు ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ సుమారుగా 17 వేల కోట్ల రూపాయలతో తమ అన్ని రీఫైనరీలను అప్‌గ్రేడ్ చేసింది. ఇతర ఆయిల్ కంపెనీలు కూడా దాదాపు 30 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాయి.

బీఎస్6 ఎఫెక్ట్: భారీగా పెరుగనున్న పెట్రోల్, డీజల్ ధరలు

ఈ నూతన ప్రమాణాలు పూర్తి స్థాయిలో అమల్లోకి వస్తే, పెట్రోల్ మరియు డీజల్ మీద సుమారుగా 50 పైసల నుండి రూపాయి వరకూ ధరలు పెరిగే అవకాశం ఉందని తెలిపారు. ధర పెరిగినప్పటికీ పర్యావరణానికి హాని కలిగించే ఉద్గారాలను తగ్గించడం కోసం తీసుకున్న ఈ నిర్ణయం హర్హించదగినదే.

బీఎస్6 ఎఫెక్ట్: భారీగా పెరుగనున్న పెట్రోల్, డీజల్ ధరలు

వివిధ రాష్ట్రాల రాజధానులు మరియు మెట్రో నగరాల్లో వాహన కాలుష్యాన్ని తగ్గించడం కోసం బీఎస్6 ప్రమాణాలను అమలు చేయడంతో పాటు, పెట్రోల్ మరియు డీజల్‌తో నడిచే వాహనాలను తగ్గించి ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తి మరియు కొనుగోళ్లని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.

బీఎస్6 ఎఫెక్ట్: భారీగా పెరుగనున్న పెట్రోల్, డీజల్ ధరలు

ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్లను ప్రోత్సహించేందుకు ఫేమ్1 మరియు ఫేమ్2 కింద కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పలు రాయితీలు అందిస్తోంది. ఇటీవల పలు కార్లు మరియు టూ వీలర్ల తయారీ సంస్థలు కూడా ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తిని ప్రారంభించాయి.

More from DriveSpark

Article Published On: Sunday, February 2, 2020, 9:00 [IST]
English summary
Petrol, diesel prices to go up by Rs 0.50-1 a litre from April. Read in Telugu.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+