రెండేళ్ల గరిష్టానికి పెరిగిన పెట్రోల్ ధర; లీటర్ ధర రూ.90

దేశంలో పెట్రోల్, డీజిల్ ఇంధన ధరలు అమాంతం పెరిగిపోతున్నాయి. గడచిన ఆదివారం లీటరు పెట్రోల్‌పై 28 పైసలు మరియు లీటరు డీజిల్‌పై 29 పైసల చొప్పున ధరలు పెరిగాయి. అంతర్జాతీయ చమురు ధరలను ధృవీకరించిన తరువాత దేశంలో వరుసగా ధరలను పెంచడం ఇది ఐదవసారి.

రెండేళ్ల గరిష్టానికి పెరిగిన పెట్రోల్ ధర; లీటర్ ధర రూ.90

తాజా ధరల సవరింపుతో ముంబైలో పెట్రోల్ ధర లీటరుకు 90 రూపాయలను చేరుకోగా, డీజిల్ ధరలు లీటరుకు 80 రూపాయలకు చేరుకున్నాయి. సెప్టెంబర్ 2018 నుండి దేశంలో అత్యధిక ఇంధన ధర ఇది. ముంబైలో ఇప్పుడు ఇంధన ధరలు లీటరు పెట్రోల్‌కు రూ.89.78 నుండి రూ.90.05కి పెరగగా, డీజిల్ ధరలు లీటరుకు రూ.79.93 నుండి 80.23కి పెరిగాయి.

రెండేళ్ల గరిష్టానికి పెరిగిన పెట్రోల్ ధర; లీటర్ ధర రూ.90

దేశ రాజధాని ఢిల్లీలో కూడా వరుసగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. పెట్రోల్ ధర లీటరుకు సుమారు రూ.28 పైసలు పెరగగా, పెట్రోల్ ధరలు రూ.30 పైసలు చొప్పున పెరిగాయి. దీంతో ప్రస్తుతం ఢిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు రూ.83.13 నుంచి రూ.83.41కు పెరగగా, డీజిల్ ధరలు లీటరుకు రూ.73.32 నుంచి రూ.73.61కి పెరిగాయి.

MOST READ:మీకు తెలుసా.. లంబోర్ఘిని ఉరుస్ డ్రైవింగ్ చేస్తూ కనిపించిన తమిళ్ తలైవా రజినీకాంత్

రెండేళ్ల గరిష్టానికి పెరిగిన పెట్రోల్ ధర; లీటర్ ధర రూ.90

గడచిన నెల చివరి నుండి భారతదేశంలో పెట్రోల్ మరియు డీజిల్ ధరలు స్థిరంగా పెరుగుతూ వస్తున్నాయి. నవంబర్ 20 నుండి ఇంధన ధరలను పెంచడం ఇది వరుసగా 14వసారి. దేశంలోని ప్రధాన చమురు కంపెనీలు రెండు నెలల విరామం తరువాత నవంబర్ 20వ తేదీ నుండి రోజువారీగా ఇంధన ధరలను సవరిస్తూ వస్తున్నాయి.

రెండేళ్ల గరిష్టానికి పెరిగిన పెట్రోల్ ధర; లీటర్ ధర రూ.90

నవంబర్ 20కి ముందు, సెప్టెంబర్ 22 నుండి పెట్రోల్ ధరలు స్థిరంగా ఉండగా, చివరిసారిగా డీజిల్ ధరలను అక్టోబర్ 2వ తేదీన పెంచడం జరిగింది. ప్రధాన చమురు కంపెనీలైన భారత్ పెట్రోలియం కార్పొరేషన్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్‌లు అంతర్జాతీయ ధరలు మరియు విదేశీ మారకపు రేట్ల ఆధారంగా ప్రతిరోజూ ఇంధన ధరలను సవరిస్తూ ఉంటారు.

MOST READ:దుర్భర స్థితిలో పడిఉన్న ఖరీదైన లగ్జరీ కార్స్.. ఎక్కడో తెలుసా ?

రెండేళ్ల గరిష్టానికి పెరిగిన పెట్రోల్ ధర; లీటర్ ధర రూ.90

అయితే, దేశంలో కోరనా మహమ్మారి సమయంలో చమురు కంపెనీలు రోజువారీ పెట్రోల్ మరియు డీజిల్ ధరల సవరణలను నిలిపివేసాయి. పెట్రోల్ మరియు డీజిల్ ధరల సవరణపై వరుసగా 58 రోజుల మరియు 48 రోజుల విరామం ఏర్పడింది. అంతకు ముందు మార్చి 17 నుండి జూన్ 6 వరకు పెట్రోల్ మరియు డీజిల్ ధరలపై యథాతథ స్థితిని కొనసాగించడం, తరువాత జూన్ 30 నుండి ఆగస్టు 15 వరకు కొనసాగించడం జరిగింది.

రెండేళ్ల గరిష్టానికి పెరిగిన పెట్రోల్ ధర; లీటర్ ధర రూ.90

దేశంలో విపరీతంగా పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

భారతదేశ వ్యాప్తంగా పెట్రోల్ మరియు డీజిల్ ధరలను వరుసగా 5వసారి పెంచారు. ఈ ధరల పెంపు రెండేళ్ల గరిష్టానికి చేరుకున్నాయి. అయితే, వివిధ రాష్ట్రాల్లోని స్థానికి పన్నుల కారణంగా ఆయా రాష్ట్రాల్లో పెట్రోల్ మరియు డీజిల్ ధరలు మారుతూ ఉంటాయి - మీ నగరంలో ఇంధన ధరలను ఇక్కడ తెలుసుకోండి.

MOST READ:కొత్త విమానంలో ప్రయాణించిన భారత రాష్ట్రపతి ; ఇంతకీ ఈ విమానం ప్రత్యేకత ఏంటో తెలుసా

Most Read Articles

English summary
Fuel Prices Increased Again; Reaches Rs 90 Mark In Mumbai. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X