త్వరలో రానున్న ప్యూరిస్ట్స్ పోర్షే 914 కార్
పోర్షే 914 అనేది 1969 నుండి 1976 వరకు వోక్స్వ్యాగన్ మరియు పోర్షే సహకారంతో తయారు చేయబడిన మిడ్ ఇంజిన్ స్పోర్ట్స్ కారు. వోక్స్వ్యాగన్ గ్రూప్ డిజైన్ హెడ్ మైఖేల్ మౌర్ చేసిన ప్రకటనల ప్రకారం పోర్స్చే 914 త్వరలో ఇండియన్ మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది.

పోర్షే 914 అనేది రెండు సీట్ల మిడ్-ఇంజిన్ స్పోర్ట్స్ కారు. ఇది వోక్స్వ్యాగన్ మరియు పోర్షే మధ్య సహకారం ఫలితంగా వచ్చింది. దీని ఉత్పత్తి కూడా అధికంగా ఉంటుందని చెప్పవచ్చు.

పోర్షే 914 ఖరీదైనదిగా ఉన్నప్పటికి ఎంట్రీ లెవెల్ కొనుగోలు దారులను లక్ష్యంగా చేసుకుంది. ఇది వినియోగదారులకు చాల అనుకూలంగా ఉండటమే కాకుండా ఆకర్షణీయంగా కూడా ఉంటుంది.

సాధారంగా 911 శ్రేణి పోర్షే చాలా ఖరీదైనదిగా ఉండటం వల్ల మునుపటి మోడల్ 914 మోడల్ కారుని ప్రవేశపెట్టదలిచింది. పోర్షే కి సంబందించిన మైఖేల్ మౌర్ అందించిన సమాచారం ప్రకారం, ఇది వినియోగదారునికి చాల అనుకూలంగా ఉండే విధంగా మాత్రమే కాకుండా చాల సరళంగా కూడా ఉంటుందని చెప్పారు.

రాబోయే పోర్షే కారు ఎలక్ట్రిక్ వెహికల్ కాదని యితడు స్పష్టం చేసాడు. పోర్స్చే కారుకి సంబంధించి ఇక్కడ మనం రెండు స్టేట్మెంట్లను గమనించవచ్చు. రాబోయే కారు మెకానికల్లీ చాల పర్ఫెక్ట్ గా ఉంటుందని అతని మొదటి ప్రకటన స్పష్టం చేసింది. ఇక రెండవ స్టేట్మెంట్ అయితే ఇది పెట్రోల్ ద్వారా నడుస్తుందని మనకు స్పష్టంగా తెలుస్తుంది.

ఏదేమైనా ఈ కార్లు అతి త్వరలో మార్కెట్లోకి అడుగుపెట్టనున్నాయి. ఇది ఫ్లాట్-ఫోర్-సిలిండర్ ఇంజన్లను కలిగి ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఇది ఇప్పుడు రాబోయే ఈ వాహనానికి మరింత శక్తిని ఇస్తాయి.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!
మైఖేల్ మౌర్ నేడు ప్రపంచంలోని ఉత్తమ ఆటోమోటివ్ డిజైనర్లలో ఒకరు. మెర్సిడెస్ బెంజ్ ఎస్‌ఎల్‌కె రూపకల్పన ఇతడు ఒకరు. ప్యూరిస్ట్ గురించి యితడు మాటాడటం ఆనందంగా ఉంది. సాధారంగా ఈ పోర్స్చే కారు పెట్రోల్ తో నడిచే వాహనం. ఇది ఎలక్ట్రిక్ వాహనం కాదని ఇతడు చేసిన ప్రకటన వల్ల నిర్దారించబడింది.


Click it and Unblock the Notifications








