పోర్షే పానమెరా 4 - 10 ఇయర్స్ ఎడిషన్ విడుదల: ఫీచర్లు, వివరాలు

జర్మన్ స్పోర్ట్స్ కార్ బ్రాండ్ 'పోర్షే' (Porsche) దేశీయ విపణిలో విక్రయిస్తున్న 'పానమెరా' (Panamera) మోడల్‌లో కంపెనీ ఓ స్పెషల్ ఎడిషన్‌ను విడుదల చేసింది. పోర్షే పానమెరా మోడల్‌ను మార్కెట్లో విడుదల చేసి 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కంపెనీ ఇందులో 10 ఇయర్స్ ఎడిషన్ పేరిట సరికొత్త స్టయిలింగ్‌తో తయారు చేసిన 'పోర్షే పానమెరా 4' (Panamera 4 10 Years Edition) మోడల్‌ను కంపెనీ విడుదల చేసింది.

పోర్షే పానమెరా 4 - 10 ఇయర్స్ ఎడిషన్ విడుదల: ఫీచర్లు, వివరాలు

సరిగ్గా పదేళ్ల క్రితం పోర్షే తమ పాపులర్ పానమెరా స్పోర్ట్స్ కారును మార్కెట్లో విడుదల చేసింది. ఈ సెలబ్రేటరీ ఎడిషన్‌లో రెగ్యులర్ వెర్షన్ పానమెరాతో పోల్చుకుంటే మరిన్ని అదనపు ఫీచర్లు, స్టయిలింగ్ యాడ్ ఆన్స్ లభ్యం కానున్నాయి.

పోర్షే పానమెరా 4 - 10 ఇయర్స్ ఎడిషన్ విడుదల: ఫీచర్లు, వివరాలు

పోర్షే పానమెరా 4 ఆల్-వీల్ డ్రైవ్ వెర్షన్‌‌పై తయారైన ఈ 10 ఇయర్స్ ఎడిషన్‌లో కొత్తగా 21-ఇంచ్ అల్లాయ్ వీల్స్ లభిస్తాయి. అంతేకాకుండా ఈ స్పెషల్ ఎడిషన్ కారులో రెండు ఫ్రంట్ డోర్లపై వైట్ గోల్డ్ కలర్‌లో 'పానమెరా 10' బ్యాడ్జింగ్ ఉంటుంది.

పోర్షే పానమెరా 4 - 10 ఇయర్స్ ఎడిషన్ విడుదల: ఫీచర్లు, వివరాలు

పదేళ్ల ప్రత్యేకతను గుర్తు చేస్తూ కారులోని ఇంటీరియర్లపై కూడా 'పానమెరా 10' బ్యాడ్జింగ్ కనిపిస్తుంది. డోర్ ట్రిమ్స్, డ్యాష్‌బోర్డ్ ట్రిమ్స్‌పై ఈ స్పెషల్ వైట్ గోల్డ్ కలర్ బ్యాడ్జింగ్ కనిపిస్తుంది. సీట్లపై మరియు ఇంటీయర్ అప్‌హోలెస్ట్రీలో కూడా వైట్ గోల్డ్ కలర్ దారంతో స్టిచింగ్ చేయబడి ఉంటుంది.

పోర్షే పానమెరా 4 - 10 ఇయర్స్ ఎడిషన్ విడుదల: ఫీచర్లు, వివరాలు

రెగ్యులర్ పోర్షే పానమెరా కారులో కస్టమర్ల కోసం అనేక కస్టమైజేషన్ ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి. సీట్ స్టయిలింగ్ నుంచి టెక్నాలజీ వరకూ అన్నీ కస్టమర్లు నచ్చినట్లుగా కస్టమైజ్ చేసుకోవచ్చు. కానీ పోర్షే పానమెరా 4 10 ఇయర్స్ ఎడిషన్ మాత్రం స్టాండర్డీ ఫీచర్లతో వస్తుంది. ఈ మోడల్‌లో కస్టమైజేషన్ ఆప్షన్స్ ఉండవు.

పోర్షే పానమెరా 4 - 10 ఇయర్స్ ఎడిషన్ విడుదల: ఫీచర్లు, వివరాలు

పోర్షే డైనమిక్ లైట్ సిస్టమ్ ప్లస్ కలిగిన మాట్రిక్స్ ఎల్ఈడి హెడ్‌ల్యాంప్స్, రియర్ వ్యూ కెమెరాతో కూడిన పార్క్ అసిస్ట్ ఫీచర్, పానరోమిక్ సన్‌రూఫ్, సాఫ్ట్ క్లోజ్ డోర్స్, బోస్ సరౌండ్ సిస్టమ్ వంటి కీలకమైన ఫీచర్లతో ఈ కారు లభిస్తుంది. ఇంకా ఇందులో పోర్షే అడాప్టివ్ సస్పెన్షన్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌తో కూడిన అడాప్టివ్ ఎయిర్ సస్పెన్షన్ కూడా లభిస్తుంది.

పోర్షే పానమెరా 4 - 10 ఇయర్స్ ఎడిషన్ విడుదల: ఫీచర్లు, వివరాలు

పోర్షే పానమెరా 4 10 ఇయర్స్ ఎడిషన్‌లో పవర్‌ఫుల్ 2.8 లీటర్, వి6 పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 226 హార్స్ పవర్‌ల శక్తిని మరియు 450 న్యూటన్ మీటర్ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 8-స్పీడ్ డ్యూయెల్ క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ (గేర్‌బాక్స్)తో లభిస్తుంది.

పోర్షే పానమెరా 4 - 10 ఇయర్స్ ఎడిషన్ విడుదల: ఫీచర్లు, వివరాలు

సేఫ్టీ విషయానికి వస్తే.. ఈ కారులో 10 ఎయిర్‌బ్యాగ్స్, డ్యూయెల్ స్టేజ్ ఎయిర్‌బ్యాగ్స్, టైర్ ప్రెజర్ మోనిటరింగ్ సిస్టమ్, ఈబిడితో కూడిన ఏబిఎస్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్, హిల్ హోల్డ్ అసిస్ట్ వంటి అధునాతన సాంకేతిక ఫీచర్లు ఉన్నాయి.

పోర్షే పానమెరా 4 - 10 ఇయర్స్ ఎడిషన్ విడుదల: ఫీచర్లు, వివరాలు

ఈ కారులోని డ్రైవర్ సీటును ఎనిమిది రకాలుగా సర్దుబాటు చేసుకునే వెసలుబాటు ఉంటుంది. ఫ్రంట్ ప్యాసింజర్ సీటును ఆరు రకాలుగా సర్దుబాటు చేసుకోవచ్చు. ఇకపోతే వెనుక వరుసలోని సీట్లను 50:50 నిష్పత్తిలో మడచుకునే వెసలుబాటు ఉంటుంది.

పోర్షే పానమెరా 4 - 10 ఇయర్స్ ఎడిషన్ విడుదల: ఫీచర్లు, వివరాలు

భారత మార్కెట్లో ఈ సరికొత్త పోర్షే పానమెరా 4 10 ఇయర్స్ ఎడిషన్ ధర రూ.1.60 కోట్లు (ఎక్స్-షోరూమ్, ఇండియా)గా ఉంది.

ఇక రెగ్యులర్ వెర్షన్ పోర్షే పానమెరా స్పోర్ట్స్ కారును కొనాలనుకునే వారి కోసం ఇందులో 7 వేరియంట్లు, 12 కలర్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. మార్కెట్లో వీటి ధరలు వేరియంట్‌ను బట్టి రూ.1.49 కోట్ల నుంచి రూ.2.57 కోట్ల మధ్యలో ఉన్నాయి (అన్ని ధరలు, ఎక్స్-షోరూమ్, ఇండియా).

పోర్షే పానమెరా 4 - 10 ఇయర్స్ ఎడిషన్ విడుదల: ఫీచర్లు, వివరాలు

పోర్షే పానమెరా 4 10 ఇయర్స్ ఎడిషన్‌పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

పోర్షే పానమెరాలో ఇతరుల కన్నా విశిష్టమైన స్టైలింగ్‌తో రూపొందిన లిమిటెడ్ ఎడిషన్ కోరుకునే వారి కోసం పానమెరా 4 10 ఇయర్ ఎడిషన్స్ బెస్ట్ ఆప్షన్‌గా నిలుస్తుంది. పైపెచ్చు ఈ లిమిటెడ్ ఎడిషన్ మోడల్‌ను కంపెనీ తమ ఎంట్రీ లెవల్, రెగ్యులర్ పానమెరా 4 ధరకే మార్కెట్లో ప్రవేశపెట్టింది.

More from DriveSpark

Article Published On: Tuesday, June 16, 2020, 10:29 [IST]
English summary
German sport car manufacturer, Porsche, has just launched a celebratory edition of its Panamera. Dubbed the Panamera 4 10 Years Edition, and priced at Rs 1.60 crore ex-showroom, the model has been launched in the country to celebrate the model's tenth year of production. Read in Telugu.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+