ఇది మేడ్ ఇన్ ఇండియా కారు అంటే నమ్ముతారా?
ఈ ఫొటోలో కనిపిస్తున్న కారును పూర్తిగా భారతదేశంలోనే తయారు చేశారంటే నమ్ముతారా? అవును ఇది ముమ్మాటికి నిజం, మంచి ఫ్యూచరిస్టిక్ డిజైన్‌తో స్పోర్ట్స్ కారులా కనిపిస్తున్న ఈ కారు పేరు "ప్రవైగ్ ఎక్స్‌టింక్షన్". దీనిని బెంగళూరుకు చెందిన ఎలక్ట్రిక్ వెహికల్ స్టార్టప్ కంపెనీ అయిన ప్రవైగ్ డైనమిక్స్ అభివృద్ధి చేసింది.

ప్రవైగ్ డైనమిక్స్ త్వరలోనే తమ తొలి ఎలక్ట్రిక్ కారు ప్రవైగ్ ఎక్స్‌టింక్షన్‌ను భారత మార్కెట్లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే కంపెనీ తమ ప్రవైగ్ ఎక్స్‌టింక్షన్ ఎలక్ట్రిక్ కారు ప్రోటోటైప్‌ను ఆవిష్కరించింది.

Electricvehicleweb.in నుండి వచ్చిన నివేదికల ప్రకారం కొత్త ప్రవైగ్ ఎక్స్‌టింక్షన్ ఎలక్ట్రిక్ కారును ఈ ఏడాది డిసెంబర్ 4న ప్రపంచానికి పరియచం చేయనున్నారు. ఆ తర్వాతి కాలంలో, అంటే వచ్చే ఏడాది నాటికి ఈ ఎలక్ట్రిక్ కారు ఎప్పుడైనా భారత మార్కెట్లో విడుదలయ్యే అవకాశం ఉంది.

ప్రవైగ్ డైనమిక్స్ గతంలో ఎక్స్‌టింక్షన్ ఎమ్‌కె1 యొక్క కాన్సెప్ట్ వెర్షన్‌ను ప్రదర్శించింది. ఈ ఎలక్ట్రిక్ కారు యొక్క కాన్సెప్ట్ వెర్షన్ రెండు డోర్లతో కూడిన స్పోర్టీ ఫాస్ట్‌బ్యాక్ స్టైలింగ్‌ను కలిగి ఉంటుంది. అయితే, ప్రొడక్షన్-స్పెక్ వెర్షన్ రెండు డోర్ల స్టైలింగ్‌ను ముందుకు తీసుకువెళుతుందా లేదా మరింత సాంప్రదాయమైన నాలుగు డోర్ల కాన్ఫిగరేషన్‌ను కలిగి ఉంటుందా అనేది తెలియాల్సి ఉంది.

కాన్సెప్ట్ మోడల్ నుండి చూసినట్లయితే, రాబోయే ప్రవైగ్ ఎక్స్‌టింక్షన్ ఎలక్ట్రిక్ కారు సన్నని ఎల్‌ఈడి స్ట్రిప్‌తో అనుసంధానించబడిన ఎల్‌ఈడి హెడ్‌ల్యాంప్‌లను కలిగి ఉంది. ఈ ఎలక్ట్రిక్ కారులో స్టైలిష్ ఎల్ఈడి టెయిల్ లైట్లతో పాటు స్టైలిష్ వీల్స్ కూడా ఉన్నాయి. ఈ ఎలక్ట్రిక్ కారు ఎక్స్‌టీరియర్ పెద్ద హంగు ఆర్భాటాలేమీ లేకుండా మినిమాలిక్ స్టైలింగ్‌ను కలిగి ఉంది.

కంపెనీ పేర్కొన్న సమాచారం ప్రకారం, ప్రవైగ్ ఎక్స్‌టింక్షన్ 96 కిలోవాట్ల లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌తో పనిచేస్తుంది. ఇందులోని ఎలక్ట్రిక్ మోటార్ గరిష్టంగా 201 బిహెచ్‌పిల శక్తిని ఉత్పత్తి మరియు 2400 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుందని తెలుస్తోంది. పెర్ఫార్మెన్స్ పరంగా చూసుకుంటే, ఈ ఎలక్ట్రిక్ కారు కేవలం 5.4 సెకన్లలోనే గంటకు గరిష్టంగా 0 - 100 కిలోమీటర్ల వేగాన్ని చేరుకోగలదు. దీని గరిష్ట వేగం గంటకు 196 కిలోమీటర్లు.

ప్రవీగ్ ఎక్స్‌టింక్షన్ పూర్తి ఛార్జీపై గరిష్టంగా 504 కిలోమీటర్ల రేంజ్‌ను కలిగి ఉంటుందని కంపెనీ పేర్కొంది. ఈ ఎలక్ట్రిక్ కారు ఫాస్ట్ ఛార్జింగ్ సామర్ధ్యాలతో కూడా లభ్యం కానుంది. ఫాస్ట్ చార్జర్ సాయంతో దీనిని కేవలం 30 నిమిషాల్లోనే 80 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు.

ప్రవైగ్ ఎక్స్‌టింక్షన్ 2021లో విడుదలైన తర్వాత తొలుతగా ఇది ఢిల్లీ మరియు బెంగళూరు నగరాల్లో లభిస్తుంది. ఆ తర్వాతి కాలంలో ముంబై, చెన్నై, పూణే సహా దేశంలోని పలు ఇతర నగరాల్లో తమ నెట్‌వర్క్‌ను విస్తరించనుంది. ప్రవైగ్ ఎక్స్‌టింక్షన్ కోసం ప్రస్తుతం ఎలాంటి భౌతిక షోరూమ్‌లు లేవు, దీనికి సంబంధించిన సమాచారాన్ని కోరుకునే వారు కంపెనీ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో తెలుసుకోవచ్చు.

ప్రవైగ్ ఎక్స్‌టింక్షన్ ఎలక్ట్రిక్ కారుపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.
ప్రవైగ్ ఎక్స్‌టింక్షన్ ఎలక్ట్రిక్ కారు చూడటానికి చాలా స్టైలిష్‌గా, మంచి ఫ్యూచరిస్టిక్ లుక్‌లో కనిపిస్తుంది. ఈ కారు విషయంలో కంపెనీ క్లెయిమ్ చేసిన ఫీచర్లు మరియు గణాంకాలు నిజమైతే, ఇది భారత మార్కెట్లో గేమ్-ఛేంజర్ మోడల్‌గా మారే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications