Just In
- 3 min ago
డీలర్ల వద్దకు ఇసుజు డి-మ్యాక్స్ హై-ల్యాండర్ డబుల్ క్యాబిన్ పికప్ ట్రక్!
- 1 hr ago
ధర భారీగా పెరిగిన ఏ మాత్రం తగ్గని క్రేజ్.. ఇప్పటికే 50,000లకి పైగా బుకింగ్స్!
- 1 hr ago
టూవీలర్స్ కోసం గ్రీన్ వెహికల్ రేటింగ్; పర్యావరణానికి మీ టూవీలర్ ఎంత సేఫ్?
- 2 hrs ago
చెక్కతో చేసిన టయోటా ఫార్చ్యూనర్ లెజెండర్.. సూపర్, గురూ..!
Don't Miss
- Movies
కరోనా విలయతాండవం: షూట్ కి రాలేనన్న సీనియర్ నటుడు..అర్ధాంతరంగా ఆగిన షూట్?
- Finance
కరోనా-లాక్‌డౌన్‌పై మరోసారి తేల్చి చెప్పిన నిర్మలా సీతారామన్
- Sports
'తొలి టెస్టు అనంతరం జట్టులో చోటు దక్కక పోవడం బాధించింది.. నా టెక్నిక్ గురించి కలత చెందా'
- News
కరోనా ఎఫెక్ట్ ... బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ భారత్ పర్యటన వాయిదా
- Lifestyle
ఇలా చేస్తే బలహీనమైన జుట్టు సహజంగా బలపడుతుంది..కొత్త జుట్టు వస్తుంది..
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
మహీంద్రా అటామ్ క్వాడ్రిసైకిల్: ఇది కారా లేక నాలుగు చక్రాల ఆటోనా?
మహీంద్రా గ్రూపుకి చెందిన ఎలక్ట్రిక్ వాహన తయారీ విభాగం, మహీంద్రా ఎలక్ట్రిక్ త్వరలోనే భారత మార్కెట్లో ఓ సరికొత్త క్వాడ్రిసైకిల్‌ను విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. మహీంద్రా అటామ్ పేరుతో రానున్న ఈ క్వాడ్రిసైకిల్ కోసం కంపెనీ చివరి దశ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.

మహీంద్రా ఎలక్ట్రిక్ తొలిసారిగా తమ అటామ్ క్వాడ్రిసైకిల్ కాన్సెప్ట్‌ను 2020 ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శనకు ఉంచింది. ప్రస్తుతం ఇందులో ఉత్పత్తికి సిద్ధంగా ఉన్న ఓ మోడల్‌ను కంపెనీ భారత రోడ్లపై విస్తృతంగా పరీక్షిస్తోంది. మోటార్‌బీమ్ నుండి లీకైన చిత్రాలలో ఈ ఎలక్ట్రిక్ క్వాడ్రిసైకిల్‌కి సంబంధించిన అనేక వివరాలు వెల్లడయ్యాయి.

ఈ స్పై చిత్రాల గమనిస్తే, ఈ మహీంద్రా అటామ్ క్వాడ్రిసైకిల్ ఉత్పత్తికి సిద్ధంగా ఉన్న మోడల్‌గా తెలుస్తుంది. ఈ టెస్టింగ్ వాహనం క్యాబిన్ లోపల స్పేర్ వీల్‌ను విడిగా అమర్చబడి ఉంటుంది. ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించిన మోడల్‌లో కనిపించిన అల్లాయ్ వీల్స్‌తో పోలిస్తే ఇందులో స్టీల్ వీల్స్ ఉన్నాయి.
MOST READ:మోడిఫైడ్ రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ బైక్.. ఇప్పుడు మరింత సూపర్ స్టైల్ గురూ!

ఇంకా ఈ చిత్రాలు ఉత్పత్తి సిద్ధంగా ఉన్న మోడల్ యొక్క లోపలి భాగాలను కూడా వెల్లడిస్తాయి. వీటిని బట్టి చూస్తే, ఇది బేసిక్ ఇంటీరియర్ లేఅవుట్‌ను కలిగి ఉన్నట్లుగా తెలుస్తోంది. బహుశా ఇది బేస్-స్పెక్ వేరియంట్ కావచ్చు. ఇందులో ఎయిర్ కండిషన్ వెంట్స్, ఫ్లాట్-బాటమ్ టైప్ స్టీరింగ్ వీల్, 12-వోల్ట్ సాకెట్‌తో పాటు డాష్‌బోర్డ్‌లో ఉంచిన రొటేటరీ గేర్ డయల్ మరియు గుండ్రటి ఆకారంలో ఉన్న ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ వంటి సాధారణ ఫీచర్లు ఉన్నాయి.

అయితే, ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించిన ప్రోటోటైప్ మోడల్‌లో పెద్ద టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే సిస్టమ్ ఉంది. కానీ ఈ టెస్టింగ్ వాహనంలో అలాంటి సెటప్ కనిపించలేదు. కాన్సెప్ట్‌లో కనిపించిన ఈ స్క్రీన్ వెనుక ప్రయాణీకుల వినోదాన్ని లక్ష్యంగా చేసుకొని డిజైన్ చేసినట్లుగా అనిపిస్తుంది. బహుశా ఇది ఎలక్ట్రిక్ క్వాడ్రిసైకిల్‌లో యాడ్-ఆన్ ఫీచర్‌గా వచ్చే అవకాశం ఉంది.
MOST READ:ట్రాక్టర్ ధరలను పెంచనున్న మహీంద్రా.. ఎప్పటినుంచో తెలుసా !

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న డిమాండ్‌ను మహీంద్రా అటామ్ కొంతమేర తీర్చే అవకాశం ఉంది. ఇది ప్రస్తుతం రోడ్లపై పరుగులు తీస్తున్న త్రీ-వీలర్లకు ప్రత్యామ్నాయంగా, అన్ని కాలాలకు అనువైనదిగా రానుంది. సాంప్రదాయ ఆటోరిక్షాలతో పోలిస్తే ఇది మెరుగైన భద్రత, వాతావరణ రక్షణ మరియు అతి తక్కువ రన్నింగ్ కాస్ట్ వంటి విశిష్టతలను కలిగి ఉంటుంది.

మహీంద్రా తమ అటామ్ క్వాడ్రిసైకిల్‌ను బెంగళూరులోని కంపెనీ ప్లాంట్‌లో అసెంబ్లింగ్ చేయనున్నారు. ఈ ప్లాంట్‌లో బ్రాండ్ లైనప్‌లోని అన్ని తక్కువ వోల్టేజ్ మోడళ్లు తయారు చేయబడతాయి. అటామ్‌ను అధికారికంగా ఆవిష్కరించే సమయంలో దాని యొక్క ఖచ్చితమైన స్పెసిఫికేషన్లు తెలిసే అవకాశం అవకాశం ఉంది.
MOST READ:భారత్‌లో కొత్త ఆడి ఏ4 బుకింగ్స్ ప్రారంభం; అఫీషియల్ లాంచ్ ఎప్పుడంటే..

ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, మహీంద్రా అటామ్ గరిష్ట వేగాన్ని యాంత్రికంగా గంటకు 70 కిలోమీటర్లకు పరిమితం చేసే అవకాశం ఉంది. ఇందులో 15 కిలోవాట్ల కంటే తక్కువ విద్యుత్‌ను ఉత్పత్తి చేసే పవర్ యూనిట్ ఉంటుందని అంచనా.

మహీంద్రా మార్కెట్లో లాంచ్ అయిన తర్వాత ఇది ఈ విభాగంలో బజాజ్ నుండి రాబోయే క్యూట్ ఎలక్ట్రిక్ క్వాడ్రిసైకిల్‌కు పోటీగా నిలిచే ఆస్కారం ఉంది. వాస్తవానికి ఈ సంవత్సరం మూడవ త్రైమాసికంలో మహీంద్రా అటామ్ అమ్మకానికి వస్తుందని భావించారు. కానీ దేశంలో కొనసాగుతున్న కోవిడ్-19 మహమ్మారి కారణంగా దీని విడుదల ఆలస్యమైంది.
MOST READ:మీకు తెలుసా.. దేశప్రజలకు అందుబాటులోకి రానున్న కొత్త ఇంటెర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇదే

మహీంద్రా అటామ్ ఎలక్ట్రిక్ క్వాడ్రిసైకిల్ దేశంలో పెరుగుతున్న రైడ్-హెయిలింగ్ సేవల అవసరాలను తీర్చే అవకాశం ఉంది. ఇది మెరుగైన భద్రత మరియు వాతావరణ రక్షణను కలిగి ఉండి, దేశంలో లభించే ఇతర సంప్రదాయ త్రీ-వీలర్లకు ప్రత్యామ్నాయంగా ఉంటుంది. వచ్చే ఏడాదిలో ఎప్పుడైనా ఇది విడుదల కావచ్చని తెలుస్తోంది.
Source:MotorBeam/Facebook