రామ్ టిఆర్ఎక్స్ పికప్ ట్రక్ : ప్రారంభించిన కొద్ది గంటల్లో రికార్డు అమ్మకాలు

పికప్ ట్రక్కులకు అమెరికాలో అధిక డిమాండ్ ఉంది. యుఎస్‌లోని చాలా కంపెనీలు పికప్ ట్రక్కులను ఉత్పత్తి చేస్తాయి. ఫోర్డ్ మరియు రామ్ [RAM] శక్తివంతమైన పికప్ ట్రక్కుల తయారీదారులలో ఉన్నారు.

రామ్ టిఆర్ఎక్స్ పికప్ ట్రక్ : ప్రారంభించిన కొద్ది గంటల్లో రికార్డు అమ్మకాలు

రామ్ కొద్ది రోజుల క్రితం తన అత్యంత శక్తివంతమైన టిఆర్ఎక్స్ పికప్ ట్రక్కును యుఎస్ లో లాంచ్ చేసింది. ట్రక్ ప్రారంభించిన గంటల్లోనే 702 యూనిట్లను విక్రయించింది. టిఆర్‌ఎక్స్ ట్రక్ కేవలం మూడు గంటల్లో 702 యూనిట్లను విక్రయించిందని కంపెనీ ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది.

రామ్ టిఆర్ఎక్స్ పికప్ ట్రక్ : ప్రారంభించిన కొద్ది గంటల్లో రికార్డు అమ్మకాలు

రామ్ టిఆర్ఎక్స్ పికప్ ట్రక్ రెండు మోడళ్లలో విడుదలైంది. టిఆర్‌ఎక్స్ పికప్ ట్రక్ ధరలు ఎక్స్-షోరూమ్‌ని బట్టి $ 90,000 నుండి $100,000 వరకు ఉంటాయి. అధిక ధర ఉన్నప్పటికీ వినియోగదారులు ఈ కొత్త ట్రక్కులను కొనడానికి ఇంకా ఎక్కువ ఆసక్తి కనపరుస్తున్నారు.

MOST READ:రికార్డు స్థాయిలో పడిపోయిన ముడి చమురు దిగుమతులు : ఎందుకో తెలుసా ?

రామ్ టిఆర్ఎక్స్ పికప్ ట్రక్ : ప్రారంభించిన కొద్ది గంటల్లో రికార్డు అమ్మకాలు

ఇది ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పికప్ ట్రక్ అని రామ్ కంపెనీ పేర్కొంది. ఈ ట్రక్కులో డాడ్జ్ ఛాలెంజర్ 6.2-లీటర్ వి 8 ఇంజన్ ఉంది. ఈ ఇంజన్ 692 బిహెచ్‌పి శక్తిని ఉత్పత్తి చేస్తుంది.

రామ్ టిఆర్ఎక్స్ పికప్ ట్రక్ : ప్రారంభించిన కొద్ది గంటల్లో రికార్డు అమ్మకాలు

టిఆర్‌ఎక్స్ పికప్ ట్రక్కును పరిమిత సంఖ్యలో తయారు చేసి విక్రయిస్తారు. టిఆర్‌ఎక్స్ పికప్ ట్రక్ ఏ రహదారిలోనైనా సజావుగా నడుస్తుందని రామ్ కంపెనీ పేర్కొంది. ర్యామ్ ట్రక్కులోని శక్తివంతమైన ఇంజిన్ అన్ని రకాల వాతావరణాలకు అనుకూలంగా ఉంటుంది.

MOST READ:కారులో భార్య ఉంగరం పోయింది.. భర్త దాన్ని ఎలా కనిపెట్టించాడో తెలుసా ?

రామ్ టిఆర్ఎక్స్ పికప్ ట్రక్ : ప్రారంభించిన కొద్ది గంటల్లో రికార్డు అమ్మకాలు

బలంగా ఉండటమే కాదు ఈ ట్రక్ వేగంగా కదులుతుంది. ట్రక్ గరిష్టంగా గంటకు 160 కి.మీ వేగంతో కదులుతుంది. ట్రక్కులో 35-అంగుళాల టైర్స్ అమర్చబడి, ట్రక్కు అన్ని రకాల రోడ్లపై ప్రయాణించడానికి వీలుగా ఉంటుంది.

రామ్ టిఆర్ఎక్స్ పికప్ ట్రక్ : ప్రారంభించిన కొద్ది గంటల్లో రికార్డు అమ్మకాలు

టిఆర్‌ఎక్స్ పికప్ ట్రక్ 11.8 అంగుళాల గ్రౌండ్ క్లియరెన్స్‌తో మంచి బ్యాలెన్స్ కలిగి ఉంది. ట్రక్ మంచి పనితీరు మరియు పికప్‌లను కూడా అందిస్తుంది. టిఆర్‌ఎక్స్ పికప్ ట్రక్ కేవలం 4.5 సెకన్లలో గంటకు 100 కిమీ వేగవంతం చేస్తుంది.

MOST READ:మొదటి రోజు భారీ బుకింగ్స్ నమోదు చేసిన కియా సోనెట్ ; ఎంతో తెలుసా ?

Most Read Articles

English summary
Ram TRX pickup trucks sold 702 units in just 3 hours details. Read in Telugu.
Story first published: Saturday, August 22, 2020, 17:32 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X