హ్యుందాయ్ టూసాన్ యాడ్‌లో రణదీప్; అమ్మకాలు పెంచుకునేందుకు కొత్త ప్లాన్!

హ్యుందాయ్ మోటార్ ఇండియా, దేశీయ మార్కెట్లో విక్రయిస్తున్న ప్రీమియం ఎస్‌యూవీ టూసాన్ కోసం కంపెనీ ఓ కొత్త టెలివిజన్ కమర్షియల్‌ను విడుదల చేసింది. ఈ టివిసిలో ప్రముఖ బాలీవుడ్ నటుడు రణదీప్ హూడా నటించారు. రణదీప్‌కు యువతలో ఉన్న బ్రాండ్ ఇమేజ్ క్యాష్ చేసుకునేందుకు హ్యుందాయ్ తమ టూసాన్ ప్రకటన కోసం అతడిని ఎంచుకుంది.

హ్యుందాయ్ టూసాన్ యాడ్‌లో రణదీప్; అమ్మకాలు పెంచుకునేందుకు కొత్త ప్లాన్!

హ్యుందాయ్-రణదీప్‌ల కలయికతో టూసాన్ అమ్మకాలను అమాంతం పెంచుకోవాలని కంపెనీ ప్లాన్ చేస్తోంది. కంపెనీ విడుదల చేసిన ఈ ప్రకటనలో కొత్త 2020 హ్యుందాయ్ టూసాన్ కారులోని లగ్జరీ అండ్ కంఫర్ట్ ఫీచర్లను హైలైట్ చేశారు. హ్యుందాయ్ తొలిసారిగా ఈ ఏడాది ఆరంభంలో జరిగిన 2020 ఆటో ఎక్స్‌పోలో తమ కొత్త టూసాన్‌ను పరిచయం చేసింది.

హ్యుందాయ్ టూసాన్ యాడ్‌లో రణదీప్; అమ్మకాలు పెంచుకునేందుకు కొత్త ప్లాన్!

ఆ తర్వాత ఈ ఏడాది జులై 2020 నెలలో కంపెనీ ఈ కొత్త మోడల్‌ను మార్కెట్లో విడుదల చేసింది. గడచిన నవంబర్ నెలలో హ్యుందాయ్ మొత్తం 76 టూసాన్ ఎస్‌యూవీలను విక్రయించింది. అంతకు ముందు అక్టోబర్ నెలలో 87 యూనిట్లను విక్రయించింది. అక్టోబర్‌తో పోల్చుకుంటే నవంబర్ నెల అమ్మకాలు తగ్గుముఖం పట్టడంతో కంపెనీ రణదీప్‌తో కొత్త ప్రచారాన్ని ప్రారంభించింది.

MOST READ:గ్రీన్ హైవే కారిడార్ ప్రాజెక్ట్‌కి కేంద్రం గ్రీన్ సిగ్నెల్.. దీనికయ్యే ఖర్చు ఎంతో తెలిస్తే షాక్ అవుతారు

హ్యుందాయ్ టూసాన్ యాడ్‌లో రణదీప్; అమ్మకాలు పెంచుకునేందుకు కొత్త ప్లాన్!

మార్కెట్లో 2020 హ్యుందాయ్ టూసాన్ ప్రారంభ ధర రూ.22.3 లక్షలు (ఎక్స్‌షోరూమ్, ఇండియా)గా ఉంది. ఇది పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇందులో జిఎల్ (ఓ), జిఎల్ఎస్ మరియు జిఎల్ఎస్ 4 డబ్ల్యూడి అనే మూడు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ మూడు వేరియంట్లలో టాప్-ఎండ్ వేరియంట్ (జిఎల్ఎస్ 4 డబ్ల్యూడి) కేవలం డీజిల్ ఇంజన్ ఆప్షన్‌తో మాత్రమే లభిస్తుంది. మిగిలిన రెండు వేరియంట్లు పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో లభిస్తాయి.

హ్యుందాయ్ టూసాన్ యాడ్‌లో రణదీప్; అమ్మకాలు పెంచుకునేందుకు కొత్త ప్లాన్!

మునుపటి తరం మోడల్‌తో పోల్చుకుంటే, కొత్త టూసాన్ ఎస్‌యూవీలో రీడిడైన్ చేసిన హెడ్‌లైట్స్, టెయిల్-లైట్స్, రివైజ్ చేసిన ఫ్రంట్ అండ్ రియర్ బంపర్స్, స్టైలిష్ 18-ఇంచ్ అల్లాయ్ వీల్స్, కొత్త క్యాస్కేడింగ్ గ్రిల్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అయితే, దీని ఓవరాల్ డిజైన్ సిల్హౌట్‌ను మాత్రం అలానే కొనసాగించారు. ఈ మార్పులతో ఇది మునుపటి కన్నా మరింత అగ్రెసివ్‌గా కనిపిస్తుంది.

MOST READ:రెండు గంటల్లోనే రూ.29.5 లక్షల జరిమానాలు, పోలీసుల రికార్డ్

హ్యుందాయ్ టూసాన్ యాడ్‌లో రణదీప్; అమ్మకాలు పెంచుకునేందుకు కొత్త ప్లాన్!

కొత్త 2020 హ్యుందాయ్ టూసాన్ ఇంటీరియర్స్‌లో కూడా భారీ మార్పులు ఉన్నాయి. ఇందులో రీడిజైన్ చేసిన డ్యాష్‌బోర్డ్ లేఅవుట్ మరియు ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటోలతో పాటుగా బ్రాండ్ యొక్క ‘బ్లూలింక్' కనెక్ట్-కార్ టెక్నాలజీని కూడా సపోర్ట్ చేసే కొత్త 8 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంటుంది.

హ్యుందాయ్ టూసాన్ యాడ్‌లో రణదీప్; అమ్మకాలు పెంచుకునేందుకు కొత్త ప్లాన్!

ఇంకా ఇందులో డ్యూయెల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, పానరోమిక్ సన్‌రూఫ్, పవర్-అడ్జస్టబుల్ డ్రైవర్ మరియు ఫ్రంట్ ప్యాసింజర్ సీట్స్, అదనపు లగేజ్ స్పెస్ కోసం 60:40 స్ప్లిట్ రియర్ సీట్, రిమోట్ ఇంజన్ స్టార్ట్ / స్టాప్, వైర్‌లెస్ ఛార్జింగ్ మొదలైన స్మార్ట్ ఫీచర్లు కూడా ఉన్నాయి.

MOST READ:దీని ముందు టెస్లా కూడా దిగదుడుపేనండోయ్.. ఎందుకో చూడండి

ఇక ఇందులోని సేఫ్టీ ఫీచర్ల విషయానికి వస్తే, కొత్త టూసాన్‌లో 360 డిగ్రీ కెమెరా, రివర్స్ పార్కింగ్ అసిస్టెన్స్, ఫార్వర్డ్ కొలైజన్ ఎవిడెన్స్ సిస్టమ్, లేన్ కీపింగ్ అసిస్టెంట్ మరియు అడాప్టివ్ క్రూయిస్ కంట్రోల్‌తో పాటుగా బహుళ ఎయిర్ బ్యాగ్‌లు, ఈబిడితో కూడిన ఏబిఎస్ వంటి స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్లు కూడా ఉన్నాయి.

హ్యుందాయ్ టూసాన్ యాడ్‌లో రణదీప్; అమ్మకాలు పెంచుకునేందుకు కొత్త ప్లాన్!

హ్యుందాయ్ టూసాన్ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌లోని పెట్రోల్ ఇంజన్ 152 బిహెచ్‌పి పవర్‌ను మరియు 192 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జతచేయబడి ఉంటుంది. ఇకపోతే, ఇందులోని 2.0 లీటర్ డీజిల్ ఇంజన్ 180 బిహెచ్‌పి పవర్‌ను మరియు 400 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది.

MOST READ:నిర్మానుష్య రోడ్డుపై వెళ్తున్నారా.. అయితే టేక్ కేర్.. ఎందుకో వీడియో చూడండి

Most Read Articles

English summary
Randeep Hooda Featurs In New Hyundai Tucson TVC, Details. Rad in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X