రేంజ్ రోవర్ హైబ్రిడ్ డీజిల్, స్పెషల్ ఎడిషన్లను ఆవిష్కరించిన ల్యాండ్ రోవర్

టాటా మోటార్స్ స్వాధీనం చేసుకున్న యునైటెడ్ కింగ్‌డమ్ లగ్జరీ కార్ బ్రాండ్ ల్యాండ్ రోవర్ తమ రేంజ్ రోవర్ మరియు రేంజ్ రోవర్ స్పోర్ట్ మోడళ్ల కోసం కొత్త ఇంజన్‌లను విడుదల చేసింది. కొత్త 3.0-లీటర్ స్ట్రెయిట్-సిక్స్ ఇంజినియం డీజిల్ ఇంజన్లతో పాటుగా మరియు వెస్ట్ మినిస్టర్, వెస్ట్ మినిస్టర్ బ్లాక్ ఎడిషన్ అనే రెండు ప్రత్యేకమైన ఎస్‌వి ఆటోబయోగ్రఫీ డైనమిక్ బ్లాక్ మోడళ్లను కంపెనీ విడుదల చేసింది.

రేంజ్ రోవర్ కొత్త మోడళ్ల ఆవిష్కరణ

ఈ కొత్త తరం స్ట్రెయిట్-సిక్స్ ఇంజినియం డీజిల్ ఇంజన్లు 48వి మైల్డ్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వెహికల్ టెక్నాలజీని కలిగి ఉంటుంది. ఇవి ఇంధన వినియోగాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. ఈ ఇంజన్‌ను ల్యాండ్ రోవర్ స్వతహాగా అభివృద్ధి చేసింది.

ల్యాండ్ రోవర్ కొత్త డీజిల్ ఇంజన్లు మునుపటి తరం కంటే ఎక్కువ రీఫైన్ చేయబడినవి మరియు నైట్రోజెన్-ఆక్సైడ్ ఉద్గారాలను నియంత్రించే రియల్ డ్రైవింగ్ ఎమిషన్ స్టెప్ 2 (ఆర్‌డిఈ 2) ను కలిగి ఉన్న ప్రపంచ ఉద్గార నిబంధనలకు అనుగుణంగా తయారు చేయబడ్డాయని కంపెనీ తెలిపింది. దీంతో కొత్తగా అభివృద్ధి చేసిన ఆర్‌డిఈ సర్టిఫైడ్ డీజిల్ ఇంజన్లను కలిగి ఉన్న ప్రపంచంలోని మొట్టమొదటి ఫుల్-సైజ్ ఎస్‌యూవీగా కొత్త రేంజ్ రోవర్‌ నిలువనుంది.

ఇందులోని సరికొత్త మైల్డ్-హైబ్రిడ్ 3.0-లీటర్ డి300 ఇంజినియం డీజిల్ ఇంజన్ డబ్ల్యూఎల్‌టిపి టెస్ట్ సైకిల్‌పై 33.0 ఎమ్‌పిజి (8.6 లీ / 100 కి.మీ) వరకు సాధిస్తుంది, దీని ఉద్గార రీడింగులు 225 గ్రా / కి.మీ సిఓ2 కంటే తక్కువగా ఉంటాయి.

రేంజ్ రోవర్ కొత్త మోడళ్ల ఆవిష్కరణ

డి350 ఇంజిన్ డబ్ల్యూఎల్‌టిపి సైకిల్‌పై 241 గ్రా / కి.మీ. వరకు సిఓ2 ఉద్గార రీడింగులతో 30.8 ఎమ్‌పిజి (9.2 లీ / 100 కి.మీ) వరకు సాధిస్తుంది, ఇది ముఖ్యంగా అత్యుత్తమ పనితీరును అందిస్తుంది.

ల్యాండ్ రోవర్ బ్రాండ్ యొక్క పి400ఈ మోడల్ ఇప్పటివరకు అత్యంత సమర్థవంతమైన రేంజ్ రోవర్. ఇది 296 బిహెచ్‌పి శక్తిని ఉత్పత్తి చేసే ఫోర్ సిలిండర్ ఇంజినియం పెట్రోల్ ఇంజన్‌తో పాటుగా 141 బిహెచ్‌పిని ఉత్పత్తి చేసే 105 కిలోవాట్ల ఎలక్ట్రిక్ మోటార్‌ని కూడా కలిగి ఉంటుంది.

13.1 కి.వా. లిథియం-అయాన్ బ్యాటరీతో నడిచే ఈ ఇంజన్, పూర్తిగా బ్యాటరీ పవర్‌పై 40 కిలోమీటర్ల రేంజ్‌ని అందిస్తుంది. పి400ఈ మోడల్ యొక్క సిఓ2 ఉద్గార రీడింగులు 75 గ్రా / కి.మీగా ఉంటుంది. డబ్ల్యూఎల్‌టిపి సైకిల్‌పై దీని ఫ్యూయెల్ ఎకానమీ రీడింగులు 3.3-లీ / 100 కి.మీగా ఉంటుంది.

పి400ఈ కోసం కంపెనీ ఓ స్టాండర్డ్ మోడ్ 3 ఛార్జింగ్ కేబుల్‌ను అందిస్తుంది, ఇది బ్యాటరీని కేవలం మూడు గంటలలోపు పూర్తిగా ఛార్జ్ చేయడానికి సహకరిస్తుంది. అదే మోడ్ 2 కేబుల్ ఉపయోగించినట్లయితే, బ్యాటరీని పూర్తిగా చార్జ్ చేయటానికి దాదాపు ఎనిమిది గంటల సమయం పట్టేది.

ఇక ల్యాండ్ రోవర్ ఆవిష్కరించిన వెస్ట్ మినిస్టర్, వెస్ట్ మినిస్టర్ బ్లాక్ ఎడిషన్ మరియు ప్రత్యేకమైన ఎస్‌వి ఆటోబయోగ్రఫీ డైనమిక్ బ్లాక్ ఎడిషన్ మోడళ్ల విషయానికి వస్తే, ఇందులో మొదటగా వెస్ట్ మినిస్టర్ ఎడిషన్ కంపెనీ వోగ్ మోడల్‌పై ఆధారపడి ఉంటుంది మరియు ఇది పెట్రోల్, డీజిల్ మరియు ప్లగ్-ఇన్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ మోటార్ ఆప్షన్లతో లభిస్తుంది.

రేంజ్ రోవర్ కొత్త మోడళ్ల ఆవిష్కరణ

ఇకపోతే, వెస్ట్ మినిస్టర్ బ్లాక్ ఎడిషన్, బ్లాక్ ఎక్స్‌టీరియర్ ప్యాక్‌తో వస్తుంది మరియు 21 ఇంచ్ నైన్-స్పోక్ అలాగే 22 ఇంచ్ గ్లాస్ బ్లాక్ నైన్ స్ప్లిట్-స్పోక్ డిజైన్‌తో సహా మూడు విభిన్న వీల్స్ ఆప్షన్లలో లభిస్తుంది.

ఈ వాహనాల్లో లేన్ డిపార్చర్ వార్నింగ్, ఎమెర్జెన్సీ బ్రేకింగ్ మరియు స్పీడ్ లిమిటర్‌తో కూడిన క్రూయిజ్ కంట్రోల్‌తో పాటుగా అధునాతన భద్రతా సాంకేతికతలు ఉన్నాయి. ఇవన్నీ ఈ లైనప్‌లో స్టాండర్డ్ ఫీచర్లుగా ఆఫర్ చేయబడుతాయి.

ఈ మోడళ్లలో ల్యాండ్ రోవర్ అనేక కంఫర్ట్ ఫీచర్లను కూడా అందిస్తుంది, ఇందులో నానో బ్రాండ్‌కి చెందిన పిఎమ్2.5 క్యాబిన్ ఎయిర్ అయోనైజేషన్ ఉంటుంది, ఇది క్యాబిన్ లోపల హానికరమైన కణాలను ఫిల్టర్ చేస్తుంది, తద్వారా కారులోని గాలి నాణ్యతను మెరుగుపరుస్తుంది.

ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌లో నిర్మించిన 'ప్యూరిఫై' బటన్‌ను ఉపయోగించి పిఎమ్2.5 వ్యవస్థ కంట్రోల్ చేయవచ్చు. ఈ వ్యవస్థ రీసర్క్యులేషన్ ఫంక్షన్స్‌ను ప్రారంభిస్తుంది మరియు హానికరమైన 2.5 మైక్రాన్ల కంటే తక్కువ కణాలను తొలగించడం ద్వారా క్యాబినింగ్ లోపల గాలిని శుభ్రపరుస్తుంది.

ల్యాండ్ రోవర్ కొత్త ఇంజన్, రేంజ్ రోవర్ స్పెషల్ ఎడిషన్లపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

ల్యాండ్ రోవర్ ఎల్లప్పుడూ ఎస్‌యూవీ టెక్నాలజీలో ముందంజలో ఉంటుంది. గరిష్ట ఇంధన సామర్థ్యాన్ని ఆఫర్ చేసే ఈ కొత్త ఇంజన్లు ఖచ్చితంగా అద్భుతమైన మరియు సున్నితమైన డ్రైవింగ్ అనుభూతిని అందిస్తాయనేది మా అభిప్రాయం. ప్రస్తుత పరిస్థితుల్లో ఎయిర్ ఫిల్టర్‌జో జోడించిన కొత్త క్యాబిన్ ఎయిర్ అయనీకరణ వ్యవస్థతో ఇప్పుడు వాహన యజమానులు మరింత ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంటుంది.

More from DriveSpark

Article Published On: Friday, July 17, 2020, 19:00 [IST]
English summary
United Kingdom based auto manufacturer, Land Rover has unveiled new engines for its Range Rover and Range Rover Sport models. Read in Telugu.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+