కొత్త నగరాల్లో ర్యాపిడో ఆటో సేవలు; టారిఫ్ వివరాలు

భారతదేశపు అతిపెద్ద బైక్ టాక్సీ ప్లాట్‌ఫామ్ రాపిడో తమ త్రీ-వీలర్ ఆటో సేవలను దేశంలోని మరిన్ని కొత్త నగరాలకు విస్తరించినట్లు ప్రకటించింది. ఈ రైడ్-హెయిలింగ్ ప్లాట్‌ఫామ్ ర్యాపిడో ఆటో సేవలను కొత్తగా 11 నగరాల్లో ప్రారంభించింది.

కొత్త నగరాల్లో ర్యాపిడో ఆటో సేవలు; టారిఫ్ వివరాలు

కస్టమర్లు తమ రోజూవారీ ప్రయాణం కోసం వారి ఇంటి వద్ద నుండే ఆటోను బుక్ చేసుకోవటానికి ఈ సర్వీస్ చక్కగా ఉపయోగపడుతుంది. ప్రస్తుత కోవిడ్-19 పరిస్థితుల్లో ఇది వినియోగదారులకు ఎంతో సురక్షితమైన ప్రక్రియ అని కంపెనీ చెబుతోంది.

కొత్త నగరాల్లో ర్యాపిడో ఆటో సేవలు; టారిఫ్ వివరాలు

కొత్తగా ర్యాపిడ్ ఆటో సేవలను ఢిల్లీ-ఎన్‌సీఆర్, రాజస్థాన్, గుజరాత్, యూపీ, పంజాబ్ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రారంభించారు. కొత్త నగరాలను చేర్చడంతో, ఇప్పుడు ఈ ఆటో హెయిలింగ్ సేవలు దేశవ్యాప్తంగా మొత్తం 25 నగరాలకు విస్తరించింది.

MOST READ:68 ఏళ్ల వయసులో అందరిని ఆశ్చర్యపరిచిన వృద్ధ మహిళ.. ఇంతకీ ఏం చేసిందో తెలుసా?

కొత్త నగరాల్లో ర్యాపిడో ఆటో సేవలు; టారిఫ్ వివరాలు

ర్యాపిడో తొలిసారిగా తమ రాపిడో ఆటో సేవలను అక్టోబర్ 2020లో దేశంలోని 10 రాష్ట్రాలలోని 14 ముఖ్య నగరాల్లో ప్రారంభించింది. కస్టమర్ల నుండి ఈ సేవలకు మంచి స్పందన లభించడంతో కంపెనీ ఇప్పుడు ఈ సేవలను దేశంలోని మరిన్ని నగరాలకు విస్తరిస్తోంది.

కొత్త నగరాల్లో ర్యాపిడో ఆటో సేవలు; టారిఫ్ వివరాలు

రాబోయే ఆరు నెలల్లో 50 లక్షలకు పైగా ఆటో డ్రైవర్లను ఈ సేవల కోసం ఆన్‌బోర్డ్ చేయాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుంకుంది. ర్యాపిడో ఆటో సేవలను అందించడం కోసం ఆసక్తిగల ఆటో డ్రైవర్లు రాపిడో కెప్టెన్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడం ద్వారా లేదా రాపిడో హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేయడం ద్వారా తమను తాము స్వయంగా ఆన్‌బోర్డ్ చేసుకోవచ్చు.

MOST READ:తాత కోసం బాలుడు చేసిన అద్భుత సృష్టి.. నిజంగా ఇది సూపర్ వెహికల్.. అదేంటో చూసారా ?

కొత్త నగరాల్లో ర్యాపిడో ఆటో సేవలు; టారిఫ్ వివరాలు

ప్రతి రాపిడో ఆటో రాపిడో యొక్క జిపిఎస్ టెక్నాలజీతో అనుసంధానమై ఉంటుంది మరియు వారి చుట్టూ ఉన్న వినియోగదారుల నుండి ఆటో డ్రైవర్లకు నిరంతర డిమాండ్‌కు యాక్సెస్ లభిస్తుంది. రాపిడో ఆటో ద్వారా, వినియోగదారులు తమ ప్రయాణాన్ని రియల్ టైమ్‌లో, వారి ప్రియమైనవారితో ట్రాక్ చేయగలరు మరియు పంచుకోగలరు.

కొత్త నగరాల్లో ర్యాపిడో ఆటో సేవలు; టారిఫ్ వివరాలు

ప్రస్తుత కోవిడ్-19 పరిస్థితుల్లో కస్టమర్ మరియు కెప్టెన్లను రక్షించడానికి మరియు వారికి భద్రతకు భరోసాను ఇచ్చేందుకు ర్యాపిడో కంపెనీ అనేక కార్యక్రమాలను నిర్వహిస్తోంది.

ఇందులో భాగంగా, ఆటో-రిక్షా సేవల కోసం పనిచేస్తున్న కెప్టెన్లు తమ ఆటోలలోని సీట్లు మరియు కస్టమర్ తాకే అన్ని ప్రాంతాలను ఎప్పటికప్పుడు శుభ్రపరస్తూ, శానిటైజ్ చేస్తారు. కెప్టెన్లు మరియు ప్రయాణీకుల భద్రత కోసం మొత్తం రైడ్‌లో వారు ఇరువురూ తప్పనిసరిగా మాస్కులు ధరించాల్సి ఉంటుంది.

MOST READ:లగ్జరీ బిఎమ్‌డబ్ల్యూ కె 1600 జిటి బైక్‌పై కనిపించిన సద్గురు జగ్గీ వాసుదేవ్

కొత్త నగరాల్లో ర్యాపిడో ఆటో సేవలు; టారిఫ్ వివరాలు

రాపిడో ఆటో విస్తరణపై, రాపిడో సహ వ్యవస్థాపకుడు అరవింద్ శంకా మాట్లాడుతూ, అధిక రద్దీతో కూడిన ప్రజా రవాణా మరియు ఖరీదైన క్యాబ్‌లతో పోల్చితే ఓపెన్ మరియు సురక్షితమైన ప్రయాణ ఎంపికను వేగంగా డిమాండ్ చేయడం మరియు స్వీకరించడంపై తమ కంపెనీ దృష్టి పెట్టిందని అన్నారు.

కొత్త నగరాల్లో ర్యాపిడో ఆటో సేవలు; టారిఫ్ వివరాలు

ప్రస్తుత కోవిడ్-19 మహమ్మారి పరిస్థితుల్లో ర్యాపిడో ఆటో ఓ మంచి సురక్షితమైన ప్రజా రవాణా మార్గం. అందుకే, రాపిడో ఆటో ద్వారా మా బైక్ టాక్సీ సేవతో పాటు, కస్టమర్లకు వారి రోజువారీ ప్రయాణానికి మరో సురక్షితమైన మరియు సరసమైన ఎంపికను అందించాలనే ఉద్దేశ్యంతో మేము దీని కనెక్టివిటీని ఇప్పుడు మరిన్ని కొత్త నగరాలకు విస్తరిస్తున్నామని ఆయన తెలిపారు.

MOST READ:సైకిల్ రిపేర్ షాప్ ఓనర్ తయారుచేసిన ఎలక్ట్రిక్ బైక్.. ఎలా ఉందో చూసారా ?

కొత్త నగరాల్లో ర్యాపిడో ఆటో సేవలు; టారిఫ్ వివరాలు

ఢిల్లీలో రాపిడో ఆటోను ప్రారంభించిన సందర్భంగా నోయిడా (గౌతమ్ బుద్ నగర్) పార్లమెంటు సభ్యుడు మహేష్ శర్మ మాట్లాడుతూ, దేశంలో ఆటోలు ఎక్కువగా రవాణా మార్గంగా విశ్వసించబడుతున్నాయి. ప్రస్తుత మహమ్మారి పరిస్థితుల్లో రాపిడో ఆటోను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది మరియు ఈ సేవలు ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండేలా, సరసమైన ధరలకే లభించవలని నేను ఆశిస్తున్నాను ఆని ఆయన చెప్పారు.

కొత్త నగరాల్లో ర్యాపిడో ఆటో సేవలు; టారిఫ్ వివరాలు

ప్రస్తుతం దేశంలో లభిస్తున్న రైడ్-షేరింగ్ సేవల్లో చౌకైన రూపాలలో ఒకటి ఈ ఆటో-రిక్షా రైడింగ్ హెయిలింగ్ సేవ. రాపిడో ఇప్పుడు భారతదేశంలోని కొత్త నగరాల్లో తమ ఆటో సేవలను విస్తరించడంతో ఇప్పుడు ర్యాపిడో యూజర్లు బైక్ టాక్సీలు అందుబాటులో లేకపోతే ర్యాపిడో ఆటోను బుక్ చేసుకోవచ్చు.

Most Read Articles

English summary
Rapido Auto Enters New Cities In India, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X