అటల్ టన్నెల్‌లో కొత్త రికార్డ్ ; ఏంటో అది అనుకుంటున్నారా.. ఇది చూడండి

ప్రపంచంలోనే అత్యంత పొడవైన సొరంగ మార్గం "అటల్ టన్నెల్" ఇటీవల భారత ప్రధాని నరేద్ర మోడీ ప్రారంభించిన సంగతి అందరికి తెలిసిందే. అటల్ టన్నెల్ ఇప్పుడు ఒక పర్యాటక కేంద్రంగా కూడా మారింది. అటల్ టన్నెల్ ఏర్పడినప్పటి నుండి కొన్ని చిన్న చిన్న చర్చల జరుగుతూనే ఉన్నాయి.

 అటల్ టన్నెల్‌లో కొత్త రికార్డ్ ; ఏంటో అది అనుకుంటున్నారా.. ఇది చూడండి

ఇదిలా ఉండగా అటల్ టన్నెల్ గుండా ఆదివారం రికార్డు స్థాయిలో 5,450 వాహనాలు, మనాలి నుంచి 2,800 వాహనాలు, లాహౌల్ నుంచి 2,650 వాహనాలు ప్రయాణించాయని హిమాచల్ ప్రదేశ్ పోలీసులు తెలిపారు.

 అటల్ టన్నెల్‌లో కొత్త రికార్డ్ ; ఏంటో అది అనుకుంటున్నారా.. ఇది చూడండి

అటల్ టన్నెల్ ప్రారంభించినప్పటి నుండి, ఒకే రోజులో ఇన్ని వాహనాలు ప్రయాణించడం నిజంగా ఒక రికార్డు అనే చెప్పాలి. అటల్ టన్నెల్‌లో వాహనాల కదలికను కొనసాగించడానికి, రెండు వైపులా 'నో ఓవర్‌టేకింగ్ జోన్' అమలు చేయబడింది. ఈ కారణంగా ఆదివారం భారీ ట్రాఫిక్ ఏర్పడింది. మనాలిలోకి ప్రవేశించడానికి సుమారు 8 కిలోమీటర్ల పొడవైన లైన్ ఏర్పడింది.

MOST READ:ఖరీదైన లగ్జరీ కార్ కొనుగోలు చేసిన బాలీవుడ్ భామ.. ఈ కార్ ధర ఎంతంటే ?

 అటల్ టన్నెల్‌లో కొత్త రికార్డ్ ; ఏంటో అది అనుకుంటున్నారా.. ఇది చూడండి

ఇటీవల కాలంలో అంటే డిసెంబర్ 24 న అటల్ టన్నెల్‌లో ఈకువ ట్రాఫిక్ కి కారణమైన 10 మంది వ్యక్తులను మరియు వారి కార్లను స్వాధీనం చేసుకున్నారు. వీరు వాహనాలను సొరంగంలో ఆపి డ్యాన్స్ వేయడం వల్ల అక్కడ భారీ రద్దీ ఏర్పడింది. ఈ కారణంగా ఆ వ్యక్తులను మరియు వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

 అటల్ టన్నెల్‌లో కొత్త రికార్డ్ ; ఏంటో అది అనుకుంటున్నారా.. ఇది చూడండి

అటల్ టన్నెల్ ప్రపంచంలోనే అతి పొడవైన రహదారి సొరంగ మార్గం, ఇది మనాలి మరియు లే మధ్య దూరాన్ని 46 కిలోమీటర్లు తగ్గిస్తుంది. ఈ కారణంగా ప్రయాణీకులకు దాదాపు 4 గంటల సమయం ఆదా అవుతుంది.

MOST READ:ఇకపై ఈ రైళ్లకు డ్రైవర్ అవసరం లేదు.. ఇదెక్కడో కాదు మనదేశంలోనే..

 అటల్ టన్నెల్‌లో కొత్త రికార్డ్ ; ఏంటో అది అనుకుంటున్నారా.. ఇది చూడండి

ఈ సొరంగం 10,000 అడుగుల ఎత్తులో నిర్మించబడింది మరియు దీని పొడవు 9.02 కిలోమీటర్లు. 3 వేల కార్లు మరియు 1500 ట్రక్కులు దాని గుండా వెళ్ళే విధంగా అటల్ టన్నెల్ నిర్మించబడింది. కానీ ప్రస్తుతం వాహనాలు భారీగా పెరిగిపోయాయి. ఇక్కడ ఈ ట్రాఫిక్ నివారించడానికి కొన్ని చర్యలు కూడా తీసుకోవడం జరిగింది.

 అటల్ టన్నెల్‌లో కొత్త రికార్డ్ ; ఏంటో అది అనుకుంటున్నారా.. ఇది చూడండి

అటల్ టన్నెల్ లో ప్రతి 250 మీటర్లకు సిసి టివి కెమెరాలు ఏర్పాటు చేయబడ్డాయి. అంతే కాకుండా లోపల ప్రతి 500 మీటర్లకు ఒక ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఏర్పాటు చేయబడింది. ప్రతి 60 మీటర్లకు ట్యాప్‌లో ఫైర్ హైడ్రాంట్లు ఏర్పాటు చేయబడ్డాయి మరియు ప్రతి 150 మీటర్లకు టెలిఫోన్ సౌకర్యం కల్పించబడింది. దీనితో, ప్రతి 1 కిలోమీటరుకు గాలి నాణ్యత మానిటర్ చేయడానికి అనుకూలమైన సదుపాయాలు కల్పించబడ్డాయి.

MOST READ:అక్కడ వాహనాలపై ఆ పేర్లు ఉన్నాయంటే.. ఇక అంతే..!

 అటల్ టన్నెల్‌లో కొత్త రికార్డ్ ; ఏంటో అది అనుకుంటున్నారా.. ఇది చూడండి

ఈ సొరంగం యొక్క రెండు వైపులా 1 మీటర్ ఫుట్‌పాత్ ఉంది. దీనితో కలిపి ఇది 10.5 మీటర్ల వెడల్పు కలిగి ఉంది. ఇది పూర్తి చేయడానికి పట్టిన కాలం 6 సంవత్సరాల కన్నా తక్కువ అని చెప్పారు. కానీ దీనిని పూర్తి చేయడానికి పదేళ్ల సమయం పట్టింది. ఈ అటల్ టన్నెల్ లో వేగ పరిమితిని గంటకు 80 కి.మీ వద్ద ఉంచారు.

 అటల్ టన్నెల్‌లో కొత్త రికార్డ్ ; ఏంటో అది అనుకుంటున్నారా.. ఇది చూడండి

అటల్ టన్నెల్ ప్రజల సౌకర్యార్థం నిర్మించబడింది. కానీ అక్కడికి వచ్చే వాహనదారులు దుశ్చర్యలకు పాల్పడుతున్నారు. ఈ కారణంగా తోటి ప్రయాణికులకు ఇబ్బందులు కలుగుతాయి. ఈ ప్రపంచ ప్రసిద్ధి చెందిన అటల్ టన్నెల్ లో నిరంతరం నిబంధనలను ఉల్లంఘిస్తూ కనిపిస్తారు. ఈ చర్యలను పూర్తిగా రూపు మాపడానికి పోలీసులు ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నప్పటికీ వీటిని పూర్తిగా నివారించలేకపోతున్నారు.

MOST READ:బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్‌నే తుక్కు తుక్కు చేసిన టయోటా ఫార్చ్యూనర్ [వీడియో]

Most Read Articles

English summary
Record 5,450 Vehicles Crosses Atal Tunnel in One Day. Read in Telugu.
Story first published: Monday, December 28, 2020, 20:22 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X