రెనో కార్లపై భారీ ఆఫర్లు.. ఏకంగా 2 లక్షల వరకు తగ్గింపు

రెనో కంపెనీ ఇండియన్ మార్కెట్లో విక్రయిస్తున్న కార్లపై జనవరి 2020 ఆఫర్లను ప్రకటించింది. రెనో లైనప్‌లో ఉన్న అన్ని మోడళ్లపై అద్భుతమైన ఆఫర్లు అందిస్తున్నట్లు రెనో అధికారిక వెబ్‌సైట్లో ప్రకటించింది.

రెనో కార్లపై భారీ ఆఫర్లు.. ఏకంగా 2 లక్షల వరకు తగ్గింపు

2019 మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్‌తో తయారైన స్టాకును క్లియర్ చేసుకునేందుకు ఇంతక ముందెన్నడూ లేని విధంగా కొన్ని మోడళ్లు మరియు వేరియంట్లపై ఏకంగా 2 లక్షల రూపాయల వరకూ ఆఫర్లను ప్రకటించింది.

రెనో కార్లపై భారీ ఆఫర్లు.. ఏకంగా 2 లక్షల వరకు తగ్గింపు

రెనో క్విడ్ ఫేస్‌లిఫ్ట్:

రెనో క్విడ్ కారును గత ఏడాది ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లో లాంచ్ చేసింది. ఇంటీరియర్ మరియు ఎక్ట్సీరియర్‌లో అత్యంత అట్రాక్టివ్ స్టైలిష్ ఎలిమెంట్లను అందించింది. ఎంట్రీ లైవల్ హ్యాచ్‌బ్యాక్ కార్లలో క్విడ్ ఫేస్‌లిఫ్ట్ ఒకటి. 2019లో తయారైన మోడళ్లపై నమ్మశక్యంగాని ఆఫర్లను అందించింది.

రెనో కార్లపై భారీ ఆఫర్లు.. ఏకంగా 2 లక్షల వరకు తగ్గింపు

2019 స్టాక్ రెనో క్విడ్ మీద రూ. 15,000 క్యాష్ డిస్కౌంట్, రూ. 10,000 లోయల్టీ బోనస్ మరియు కార్పోరేట్ బోనస్ కింద మరో రూ. 4,000 వరకూ డిస్కౌంట్ లభిస్తుంది. రెనో ఫైనాన్స్ 0 శాతం వడ్డీతో 18 నెలలకు గాను రూ. 2.2 లక్షల లోన్‌ సదుపాయం కూడా అందిస్తున్నారు.

రెనో కార్లపై భారీ ఆఫర్లు.. ఏకంగా 2 లక్షల వరకు తగ్గింపు

రెనో ట్రైబర్

రెనో ఇండియా గత ఏడాది క్విడ్ ఆధారిత ఎంపీవీ ట్రైబర్ కారును మార్కెట్లోకి లాంచ్ చేసింది. రెనో CMF-A+ ఆర్కిటెక్చర్ మీద నిర్మించిన రెనో ట్రైబర్ చీపెస్ట్ 6-సీటర్ ఎంపీవీ కారు. సౌకర్యంతమైన సీటింగ్, విశాలమైన క్యాబిన్ వంటివి ట్రైబర్ కారును రెనో ఇండియా బెస్ట్ సెల్లింగ్ కారుగా నిలిపాయి.

రెనో కార్లపై భారీ ఆఫర్లు.. ఏకంగా 2 లక్షల వరకు తగ్గింపు

రెనో ట్రైబర్ ధర శ్రేణి రూ. 4.95 లక్షల నుండి రూ. 6.63 లక్షల మధ్య ఎక్స్-షోరూమ్ మధ్య ఉంది. రెనో లైనప్‌లో అత్యధికంగా అమ్ముడవుతున్న కారు కావడంతో ట్రైబర్ ఎంపీవీ మీద ఎలాంటి డిస్కౌంట్లు మరియు కార్బోరేట్ బోనస్‌లు అందివ్వడం లేదు. అయితే, డీలర్లతో మాట్లాడితే ఏదైనా ఆఫర్ లేదా కొద్దిగా డిస్కౌంట్ లభించే అవకాశం ఉంది.

రెనో కార్లపై భారీ ఆఫర్లు.. ఏకంగా 2 లక్షల వరకు తగ్గింపు

రెనో డస్టర్

రెనో కంపెనీకి ఇండియన్ మార్కెట్లో మంచి గుర్తింపు తెచ్చిపెట్టిన మోడళ్లలో రెనో డస్టర్ ఒకటి, రెనో డస్టర్ ఇప్పటికే ఎన్నో రకాల ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లలో విడుదలైంది. గత ఏడాది కూడా పలు మార్పులు చేర్పులతో లేటెస్ట్ జనరేషన్ డస్టర్ కారును మార్కెట్లోకి ప్రవేశపెట్టారు.

రెనో కార్లపై భారీ ఆఫర్లు.. ఏకంగా 2 లక్షల వరకు తగ్గింపు

రెనో డస్టర్‌లోని పెట్రోల్ వేరియంట్ల మీద ఎలాంటి ఆఫర్లు లేవు, అంతే కాకుండా కంపెనీ 85PS డీజల్ ఇంజన్ వేరియంట్ల ప్రొడక్షన్ కూడా నిలిపేసింది. అయితే గత ఏడాది విడుదలైన రెనో డీజల్ వేరియంట్లు డీలర్ల వద్ద లభిస్తే మీ అదృష్టమే.. అవును ఫేస్‍‌లిఫ్ట్ కంటే ముందున్న డస్టర్ కార్ల స్టాక్ మీద సుమారు 1.5 లక్షల వరకూ ప్రయోజనాలున్నాయి.

రెనో కార్లపై భారీ ఆఫర్లు.. ఏకంగా 2 లక్షల వరకు తగ్గింపు

నిజానికి ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ డస్టర్‌తో పోలిస్తే, పాత రెనో డస్టర్‌లో పెద్దగా చెప్పుకోదగ్గ ఫీచర్లేమీ లేవు, కానీ రెనో డస్టర్ కావాలనుకునే కస్టమర్లు ఇదొక బెస్ట్ ఛాయిస్ అని చెప్పవచ్చు. ఈ మోడల్ మీద ఇప్పుడు రూ. 50,000 క్యాష్ డిస్కౌంట్, 10 వేల రూపాయల కార్పోరేట్ బోనస్ మరియు 20 వేల వరకూ లోయల్టీ బోనస్‌తో పాటు ఇతర ఫైనాన్స్ స్కీమ్స్‌తో కలుపుకొని మొత్తం లక్షన్నర వరకూ ప్రయోజనాలు ఉన్నాయి.

రెనో కార్లపై భారీ ఆఫర్లు.. ఏకంగా 2 లక్షల వరకు తగ్గింపు

రెనో లాజీ

రెనో లాజీ ఎంపీవీ కారు మార్కెట్లో ఆశించిన మేర సక్సెస్ కాకపోయేసరికి.. సేల్స్ నుండి ఈ మోడల్‌ను తొలగించింది. అయితే, డీజల్ వేరియంట్ల ప్రొడక్షన్ ఆపేసి కేవలం పెట్రోల్ వేరియంట్లను మాత్రమే ఉత్పత్తి చేస్తోంది. మార్కెట్లో ఉన్న మారుతి ఎర్టిగా మోడల్‌కు సరాసరి పోటీనిస్తోంది.

రెనో కార్లపై భారీ ఆఫర్లు.. ఏకంగా 2 లక్షల వరకు తగ్గింపు

డీలర్ల వద్ద మిగిలిపోయిన 2019 మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్‌తో తయారైన రెనో లాజీ కార్లపై భారీ డిస్కౌంట్లు ప్రకటించింది. 10 వేల రూపాయల కార్పోరేట్ బోనస్‌‌తో పాటు 2 లక్షల క్యాష్ డిస్కౌంట్ కూడా అందిస్తోంది.

రెనో కార్లపై భారీ ఆఫర్లు.. ఏకంగా 2 లక్షల వరకు తగ్గింపు

రెనో క్యాప్చర్

రెనో క్యాప్చర్ క్రాసోవర్ ఎస్‌యూవీని ఎన్నో అంచనాలతో తీసుకొచ్చారు, కానీ కస్టమర్లను ఆకట్టుకోవడంలో విఫలమైంది. ఒకానొక సందర్భంలో క్యాప్చర్ ఎస్‌యూవీని మార్కెట్‌ నుండి శాశ్వతంగా తొలగించాలని కూడా భావించారు.

రెనో కార్లపై భారీ ఆఫర్లు.. ఏకంగా 2 లక్షల వరకు తగ్గింపు

ప్రస్తుతం రెనో క్యాప్చర్ డీజల్ వేరియంట్లలోని టాప్ ఎండ్ మోడల్ మీద గరిష్టంగా రూ. 2 లక్షల తగ్గింపు ప్రకటించారు. అదనంగా 10 వేల కార్పోరేట్ డిస్కౌంట్ మరియు 20 వేల లాయల్టీ బోనస్ కూడా అందిస్తున్నారు.

More from DriveSpark

Article Published On: Tuesday, January 21, 2020, 11:02 [IST]
English summary
Renault announces discount offers. Read in Telugu.
Read more on: #రెనో #renault
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+