రెనాల్ట్ క్యాప్చర్ బిఎస్6 మోడల్ - ఫీచర్లు, వివరాలు

ఫ్రెంచ్ కార్ బ్రాండ్ రెనాల్ట్ దేశీయ విపణిలో విక్రయిస్తున్న కాంపాక్ట్ ఎస్‌యూవీ రెనాల్ట్ క్యాప్చర్ లో ఓ సరికొత్త బిఎస్6 వెర్షన్‌ను అతి త్వరలోనే మార్కెట్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. పెట్రోల్ వెర్షన్‌లో మాత్రమే లభ్యం కానున్న ఈ రెనాల్ట్ క్యాప్చర్ ఎస్‌యూవీ మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభ్యం కానుంది.

రెనాల్ట్ క్యాప్చర్ బిఎస్6 మోడల్ - ఫీచర్లు, వివరాలు

భారత్‌లో రెనాల్ట్ మరియు నిస్సాన్ రెండూ అనుబంధ సంస్థలన్న విషయం మనకు తెలిసినదే. ఈ నేపథ్యంలో నిస్సాన్ కిక్స్ ఎస్‌యూవీలో ఉపయోగిస్తున్న 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్‌నే కొత్త రెనో క్యాప్చర్ బిఎస్‌6 వెర్షన్‌లో కూడా ఉపయోగించవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, నిస్సాన్ కిక్స్‌లో 1.3 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. కాకపోతే, రెనో క్యాప్చర్‌లో ఈ ఇంజన్‌ను ఆఫర్ చేస్తారా లేదా అనే విషయం మాత్రం తెలియాల్సి ఉంది.

రెనాల్ట్ క్యాప్చర్ బిఎస్6 మోడల్ - ఫీచర్లు, వివరాలు

ఒకవేళ నిస్సాన్ కిక్స్ ఎస్‌యూవీలో ఉపయోగిస్తున్న 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్‌ను రెనాల్ట్ క్యాప్చర్ ఎస్‌యూవీలో ఉపయోగించినట్లయితే, ఈ ఇంజన్ గరిష్టంగా 105 బిహెచ్‌పిల శక్తిని, 142 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇకపోతే 1.3 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 154 బిహెచ్‌పిల శక్తిని మరియు 254 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది.

MOST READ: మీకు తెలుసా.. గూగుల్ మ్యాప్స్ నావిగేషన్ కోసం అమితాబ్ బచ్చన్ వాయిస్‌

రెనాల్ట్ క్యాప్చర్ బిఎస్6 మోడల్ - ఫీచర్లు, వివరాలు

ఈ రెండు ఇంజన్లు కూడా స్టాండర్డ్ 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో లభిస్తాయి. కాకపోతే 1.3 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ మాత్రం ఆప్షనల్ 8-స్పీడ్ సివిటి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్‌తో లభిస్తుంది. ఉత్పాదక వ్యయాన్ని తగ్గించుకోవటంలో భాగంగా రెనాల్ట్ కూడా తమ బిఎస్6 వాహనాల్లో ఇవే ఇంజన్లు, గేర్ బాక్స్ ఆప్షన్లను పరిచయం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

రెనాల్ట్ క్యాప్చర్ బిఎస్6 మోడల్ - ఫీచర్లు, వివరాలు

ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న బిఎస్4 రెనాల్ట్ క్యాప్చర్ మోడల్‌లోని స్టాండర్డ్ 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్ 110 బిహెచ్‌పిల శక్తిని, 240 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇకపోతే రెండవ ఇంజన్ ఆప్షన్ అయిన కె9కె 1.5 లీటర్ డీజిల్ ఇంజన్‌ను బిఎస్6 నిబంధనలకు అనుగుణంగా అప్‌డేట్ చేయలేదు. ఈ నేపథ్యంలో నిస్సాన్ కిక్స్ మరియు రెనాల్ట్ క్యాప్చర్‌లు రెండూ కూడా ప్రస్తుతానికి పెట్రోల్ వెర్షన్ బిఎస్6 లో మాత్రమే లభ్యం కానున్నాయి.

MOST READ: మైల్స్ కార్ నుంచి ఇప్పుడు అద్దెకి ఎమ్‌జి హెక్టర్ కారు

రెనాల్ట్ క్యాప్చర్ బిఎస్6 మోడల్ - ఫీచర్లు, వివరాలు

ఇక బిఎస్6 2020 రెనాల్ట్ క్యాప్చర్‌లో ఇంటీరియర్ మరియు ఎక్స్టీరియర్లలో కూడా స్వల్ప మార్పులు ఉండబోతున్నాయి. రీడిజైన్ చేయబడిన క్యాబిన్, కొత్త హెడ్‌ల్యాంప్స్, టెయిల్ ల్యాంప్స్, అప్‌డేటెడ్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఉండనున్నట్లు సమాచారం. రెనాల్ట్ ఇప్పటికే అప్‌గ్రేడ్ చేయబడిన క్యాప్చర్ ఎస్‌యూవీని అంతర్జాతీయ మార్కెట్లలో విడుదల చేసింది.

రెనాల్ట్ క్యాప్చర్ బిఎస్6 మోడల్ - ఫీచర్లు, వివరాలు

రెనాల్ట్ క్యాప్చర్ బిఎస్6 మార్కెట్లో విడుదలైతే ఇది ఈ సెగ్మెంట్లోని నిస్సాన్ కిక్స్, హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్ వంటి మోడళ్లకు పోటీ ఇస్తుంది. ఇంజన్ అప్‌డేట్స్ కారణంగా రెనాల్ట్ క్యాప్చర్ బిఎస్6 ధరల్లో కూడా పెరుగదల ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం లభిస్తున్న బిఎస్4 క్యాప్చర్ ధరలు రూ.9.49 లక్షల నుంచి రూ.12.99 లక్షల మధ్యలో ఉన్నాయి (ఎన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ).

MOST READ: ట్రాఫిక్ ఉల్లంఘిస్తే ఇకపై ఇ-చలాన్ మాత్రమే, ఎక్కడో తెలుసా ?

రెనాల్ట్ క్యాప్చర్ బిఎస్6 మోడల్ - ఫీచర్లు, వివరాలు

రెనాల్ట్ క్యాప్చర్ బిఎస్6 లాంచ్‌పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

రెనో క్యాప్చర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ తొలిసారిగా భారత మార్కెట్లో విడుదలైనప్పుడు అది ఈ సెగ్మెంట్లోని కస్టమర్లు బాగా ఆకర్షించింది. స్టైలిష్ క్రాసోవర్ లుక్‌తో కనిపించే ఈ కారు ఆకర్షనీయమైన ఫీచర్లు, కాంపిటీటివ్ ధరతో మార్కెట్లోని ఇతర మోడళ్లకు గట్టి పోటీ ఇచ్చింది. కానీ ఆ తర్వాతి కాలంలో క్రమంగా దీనికి ఆదరణ తగ్గింది. అయితే, కొత్తగా రానున్న బిఎస్6 రెనాల్ట్ క్యాప్చర్‌లో మరిన్ని ఇంజన్ ఆప్షన్లను ప్రవేశపెట్టనట్లయితే ఈ మోడల్ తిరిగి మార్కెట్లో హవా కొనసాగించే అవకాశం ఉంది.

Most Read Articles

English summary
The Renault Captur BS6 is expected to launch in India sometime during this month. The upcoming Captur SUV is expected to be a petrol-only variant with manual and automatic transmission options. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X