రెనాల్ట్ డస్టర్‌లో కొత్త టర్బో పెట్రోల్ వేరియంట్; ఆగస్ట్‌లో విడుదల!

ఫ్రెంచ్ కార్ బ్రాండ్ రెనాల్ట్ అందిస్తున్న ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీ రెనాల్ట్ డస్టర్‌లో కంపెనీ ఓ కొత్త 1.3-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌ను విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. ఈ ఏడాది ఆరంభంలో 2020 ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో రెనాల్ట్ తమ కొత్త 1.3 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌ను ప్రదర్శనకు ఉంచింది.

రెనాల్ట్ డస్టర్‌లో కొత్త టర్బో పెట్రోల్ వేరియంట్; ఆగస్ట్‌లో విడుదల!

కార్అండ్‌బైక్ నుంచి వచ్చిన తాజా ప్రకారం, రెనాల్ట్ డస్టర్ టర్బో పెట్రోల్ వేరియంట్ ఆగస్టు చివరిలో భారతదేశంలో విడుదల కానున్నట్లు తెలుస్తోంది. అయితే, ఖచ్చితంగా ఏ రోజున ఈ వాహనాన్ని మార్కెట్లో విడుదల చేసే విషయాన్ని కంపెనీ ఇంకా వెల్లడించలేదు.

రెనాల్ట్ డస్టర్‌లో కొత్త టర్బో పెట్రోల్ వేరియంట్; ఆగస్ట్‌లో విడుదల!

రెనాల్ట్ డస్టర్‌లో ఉపయోగించబోయే ఈ కొత్త 1.3 లీటర్ ఫోర్ సిలిండర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 153 బిహెచ్‌పి శక్తిని మరియు 250 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇ ఇంజన్ స్టాండర్డ్ సిక్స్-స్పీడ్ ట్రాన్స్‌మిషన్‌తో పాటుగా ఆప్షనల్ సివిటి ఆటోమేటిక్‌తో గేర్‌బాక్స్‌తో కూడా లభ్యం కానుంది.

MOST READ: లూనా ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ : దీనికి లైసెన్స్ అవసరం లేదు

రెనాల్ట్ డస్టర్‌లో కొత్త టర్బో పెట్రోల్ వేరియంట్; ఆగస్ట్‌లో విడుదల!

ప్రస్తుతం మార్కెట్లో విక్రయిస్తున్న రెనాల్ట్ డస్టర్‌లో బిఎస్6 కంప్లైంట్ 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 104 బిహెచ్‌పి శక్తిని మరియు 142 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది.

ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఈ 1.5-లీటర్ న్యాచురల్లీ ఆస్పైర్డ్ పెట్రోల్ ఇంజన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో లభ్యమవుతోంది. మిడ్ మరియు టాప్ ఎండ్ వేరియంట్లలో ఈ కొత్త టర్బో ఇంజన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

రెనాల్ట్ డస్టర్‌లో కొత్త టర్బో పెట్రోల్ వేరియంట్; ఆగస్ట్‌లో విడుదల!

త్వరలో విడుదల కానున్న రెనాల్ట్ డస్టర్ 1.3 టర్బో పెట్రోల్ వేరియంట్ డిజైన్ విషయానికొస్తే, ఇందులో ఇంజన్ అప్‌గ్రేడ్స్ మినహా ఎలాంటి డిజైన్ మార్పులు ఉండబోవని తెలుస్తోంది. ఫ్రంట్ గ్రిల్ మరియు ఫాగ్ లాంప్ హౌసింగ్ వద్ద రెడ్ కలర్ హైలైట్స్ ఉండే అవకాశం ఉంది.

MOST READ: గర్భిణీ భార్య కోసం 4000 కి.మీ ప్రయాణించిన భర్త

రెనాల్ట్ డస్టర్‌లో కొత్త టర్బో పెట్రోల్ వేరియంట్; ఆగస్ట్‌లో విడుదల!

ఈ కొత్త వేరియంట్ వెనుక భాగంలో తక్కువ క్లాడింగ్, రీడిజైన్ చేసిన రూఫ్ ర్యాక్స్ రెడ్ కలర్ డస్టర్ లోగోతో ఉంటాయి. అలాగే బూట్ లిప్‌పై కూడా రెడ్ కలర్‌లో డస్టర్ బ్యాడ్జింగ్ ఉంటుంది. ఇంకా ఇందులో ప్రొజెక్టర్ హెడ్‌లైట్స్, ఎల్‌ఈడి డిఆర్‌ఎల్‌లు మరియు టెయిల్ లైట్లతో మరింత అగ్రెసివ్‌గా కనిపించే బంపర్‌లను కలిగి ఉంటుంది.

రెనాల్ట్ డస్టర్‌లో కొత్త టర్బో పెట్రోల్ వేరియంట్; ఆగస్ట్‌లో విడుదల!

రెనాల్ట్ డస్టర్ 1.3 టర్బో పెట్రోల్ వేరియంట్లలో రెడ్ హైలైట్స్‌లో ఉండే కొత్త అప్‌హోలెస్ట్రీ, సెవన్ ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో సపోర్ట్, పూర్తి ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఉండనున్నాయి.

MOST READ: సూపర్ లుక్ లో ఉన్న మోడిఫైడ్ ఫోర్డ్ జీప్ [వీడియో]

రెనాల్ట్ డస్టర్‌లో కొత్త టర్బో పెట్రోల్ వేరియంట్; ఆగస్ట్‌లో విడుదల!

సేఫ్టీ ఫీచర్ల విషయానికి వస్తే, ఈబిడితో కూడిన ఏబిఎస్, డ్రైవర్ మరియు ప్యాసింజర్ ఎయిర్‌బ్యాగులు, వెనుక పార్కింగ్ సెన్సార్లు, సీట్ బెల్ట్ రిమైండర్ అలారం మరియు హై-స్పీడ్ అలెస్ట్ సిస్టమ్, రివర్స్ పార్కింగ్ కెమెరా, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ మరియు హిల్-స్టార్ట్ అసిస్ట్ మొదలైన ఫీచర్లు ఉండే అవకాశం ఉంది.

రెనాల్ట్ డస్టర్‌లో కొత్త టర్బో పెట్రోల్ వేరియంట్; ఆగస్ట్‌లో విడుదల!

భారత మార్కెట్లో ఈ టర్బో వేరియంట్ రెనో డస్టర్ మోడల్ ధర సుమారు రూ.12.5 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉండొచ్చని అంచనా.

రెనో డస్టర్ 1.3 లీటర్ పెట్రోల్ టర్బో వేరియంట్‌పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

టర్బో పెట్రోల్ ఇంజన్ కలిగిన కార్లు డ్రైవ్ చేయటానికి ఎప్పుడూ సరదాగానే ఉంటాయి. తాజాగా రెనాల్ట్ డస్టర్‌లో కొత్తగా 1.3 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌ను చేర్చడం మంచి విషయంగా చెప్పుకోవచ్చు. ఇది ప్రస్తుతం అందుబాటులో ఉన్న మోడళ్ల కంటే మరింత శక్తివంతమైనదిగా ఉంటుంది. ఇది ఎక్కువ మంది వినియోగదారులను ఆకర్షించడంలో సహాయపడుతుంది.

Source:carandbike

Most Read Articles

English summary
French auto manufacturer Renault is ready to launch the Duster with a new 1.3-litre turbo petrol engine. The brand showcased the engine earlier this year at the Delhi Auto Expo. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X