రెనాల్ట్ జులై ఆఫర్లు, కార్లపై స్పెషల్ డిస్కౌంట్స్ - ఫుల్ డిటేల్స్
ఫ్రెంచ్ కార్ బ్రాండ్ రెనాల్ట్ ఇండియా, భారత మార్కెట్లో విక్రయిస్తున్న కొన్ని మోడళ్లు, వేరియంట్లపై జులై నెల ఆఫర్లను ప్రకటించింది. ఈ నెలలో రెనాల్ట్ కారును కొనుగోలు చేసిన వారికి ప్రత్యక తగ్గింపులతో పాటుగా పలు ఇతర ప్రోత్సాహకాలను అందిస్తోంది. రెనాల్ట్ క్విడ్, ట్రైబర్ మరియు డస్టర్ కాంపాక్ట్ ఎస్‌యూవీలపై కంపెనీ ఈ ఆఫర్లను అందిస్తోంది.

రెనాల్ట్ ప్రకటించిన జులై 2020 ఆఫర్లలో క్యాష్ సేవింగ్స్, ఎక్సేంజ్ బోనస్, కార్పోరేట్ డిస్కౌంట్స్, లాయల్టీ బోనస్‌లతో పాటుగా దేశంలోని గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చే కొనుగోలుదారుల కోసం ప్రత్యేక నగదు తగ్గింపులను కూడా అందిస్తోంది.

జూలై నెలలో రెనాల్ట్ కార్లపై మొత్తంగా రూ .70,000 వరకు ప్రయోజనాలను ఆఫర్ చేస్తున్నారు. కంపెనీ అందిస్తున్న డిస్కౌంట్ ఆఫర్లు కస్టమర్ ఎంచుకునే మోడల్, వేరియంట్‌ను బట్టి మారుతూ ఉంటాయి. ఈ ఆఫర్లు జూలై 31, 2020 వరకు అమలులో ఉంటాయి. ఈ ఆఫర్లకు అదనంగా, కంపెనీ ‘బై నౌ పే లేటర్' అనే ప్రత్యేకమైన ఫైనాన్స్ స్కీమ్‌ను కూడా అందిస్తోంది. దీని సాయంతో కొత్త కారు కొనుగోలు మరింత సులభతరం కానుంది.

రెనాల్ట్ ప్రకటించిన ‘బై నౌ పే లేటర్' ఫైనాన్స్ స్కీమ్ క్రింద ఈ బ్రాండ్ కారును కొనుగోలు చేసిన కస్టమర్లు, కొనుగోలు చేసిన తేదీ నుండి మొదటి మూడు నెలల పాటు ఎటువంటి ఈఎమ్ఐలను చెల్లించాల్సిన అవసరం లేదని కంపెనీ పేర్కొంది. దేశంలో కొనసాగుతున్న కోవిడ్-19 మహమ్మారి సమయంలో కొత్త వాహనాల కొనుగోలుకు మద్దతుగా ఈ పథకాన్ని అందిస్తున్నారు. వివిధ మోడళ్లపై కంపెనీ అందిస్తున్న ఆఫర్లు, డిస్కౌంట్ల వివరాలు ఇలా ఉన్నాయి:

రెనాల్ట్ క్విడ్
రెనాల్ట్ నుండి లభిస్తున్న ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ క్విడ్. ఈ మోడల్‌పై కంపెనీ జులై నెలలోరూ.35,000 వరకు ప్రయోజనాలను అందిస్తోంది. ఇందులో రూ.10,000 నగదు తగ్గింపు, రూ.15,000 ఎక్సేంజ్ బోనస్, రూ.10,000 లాయల్టీ బెనిఫిట్‌లు ఉన్నాయి. ప్రయోజనం ఉన్నాయి. లాయల్టీ బెనిఫిట్ ప్రస్తుతం స్టాండర్డ్, ఆర్ఎక్స్ఈ 0.8L వేరియంట్‌లకు మాత్రమే వర్తిస్తుంది.

రెనాల్ట్ ప్రతి కస్టమర్‌కి కార్పొరేట్ డిస్కౌంట్ లేదా రూ.4,000 రూరల్ బోనస్‌ను కూడా అందిస్తోంది. కస్టమర్‌కు సంబంధించిన సదరు పత్రాలను ధృవీకరించిన తర్వాతనే ఈ రెండు ఆఫర్లను వర్తింపజేయటం జరుగుతుంది. అదనంగా, కంపెనీ 8.25 శాతం తక్కువ వడ్డీ రేటుతో ప్రత్యేకమైన ఫైనాన్స్ స్కీమ్‌ను కూడా అందిస్తోంది.

రెనాల్ట్ క్విడ్ రెండు ఇంజన్లు మరియు రెండు గేర్‌బాక్స్ ఆప్షన్లతో మొత్తం ఆరు వేరియంట్లలో లభిస్తోంది. మార్కెట్లో క్విడ్ హ్యాచ్‌బ్యాక్ ప్రారంభ ధర రూ.2.94 లక్షలు కాగా, టాప్ ఎండ్ అయిన క్లైంబర్ ఆటోమేటిక్ వేరియంట్ ధర రూ.5.07 లక్షలుగా ఉంది (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్ ఢిల్లీ).

రెనాల్ట్ ట్రైబర్
రెనాల్ట్ ట్రైబర్ కంపెనీ నుంచి లభిస్తున్న ఓ విశిష్టమైన కాంపాక్ట్ ఎమ్‌పివి, ఇందులో డ్రైవర్‌తో కలిపి గరిష్టంగా ఏడుగురు ప్రయాణీకులు కూర్చోవచ్చు ఈ మోడల్‌పై రూ.30,000 వరకు ప్రయోజనాలను ఆఫర్ చేస్తుంది. మీ పాత కారును షోరూమ్‌కు విక్రయించేటప్పుడు అదనంగా రూ.20,000 ఎక్సేంజ్ బోనస్ మరియు రూ.10,000 లాయల్టీ బోనస్ ఇందులో ఉన్నాయి.

ట్రైబర్ ఎమ్‌పివిని క్విడ్ హ్యాచ్‌బ్యాక్ మాదిరిగానే ఫైనాన్స్ స్కీమ్‌తో అందిస్తున్నారు. ఒకవేళ మీ నగరంలో రెనాల్ట్ ఫైనాన్స్ స్కీమ్ అందుబాటులో లేకపోతే, కంపెనీ అదనంగా రూ.5,000 ప్రత్యేక నగదు తగ్గింపును అందిస్తుంది. ఈ ఆఫర్ క్విడ్ మరియు డస్టర్ మోడళ్లకు కూడా వర్తిస్తుంది.

రెనాల్ట్ ట్రైబర్ ఎమ్‌పివిలో 1.0 లీటర్ త్రీ సిలిండర్ల పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ 6250 ఆర్‌పిఎమ్ వద్ద గరిష్టంగా 71 బిహెచ్‌పి శక్తిని మరియు 3500 ఆర్‌పిఎమ్ వద్ద 96 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ లేదా ఆప్షనల్ ఏఎమ్‌టి ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది.

రెనాల్ట్ డస్టర్
భారత మార్కెట్లో రెనాల్డ్ క్యాప్చర్‌ను నిలిపివేయబడుతుందని ప్రకటించిన తరువాత, డస్టర్ ఈ బ్రాండ్ యొక్క ప్రధాన ఎస్‌యూవీగా మారింది. ప్రస్తుతం ఈ మోడల్‌పై కంపెనీ రూ.60,000 ప్రయోజనాలను అందిస్తోంది. ఇందులో రూ.15,000 నగదు తగ్గింపు, రూ.25,000 ఎక్సేంజ్ బెనిఫిట్స్, రూ.20,000 లాయల్టీ బెనిఫిట్స్ ఉన్నాయి.

వీటితో పాటు, కార్పొరేట్ బోనస్ / గ్రామీణ ఆఫర్‌లో భాగంగా కస్టమర్ అందించే ధృవీకరణ పత్రాన్ని బట్టి రూ.10,000 అదనపు నగదు తగ్గింపు కూడా లభిస్తుంది. భారత మార్కెట్లో రెనాల్ట్ డస్టర్ ప్రారంభ ధర రూ.8.49 లక్షలు, ఎక్స్-షోరూమ్, ఢిల్లీగా ఉంది.

రెనాల్ట్ జులై ఆఫర్లపై డ్రైవ్‍స్పార్క్ అభిప్రాయం.
రెనాల్ట్ ప్రకటించిన జైల్ ఆఫర్లలో క్విడ్, డస్టర్ ఎస్‌యూవీలపై మంచి ఆఫర్లను అందిస్తోంది, ట్రైబర్ ఎమ్‌పివిపై ఆఫర్లు నామమాత్రంగానే ఉన్నాయని తెలుస్తోంది. ప్రత్యేకించి డస్టర్‌పై గరిష్టంగా అందిస్తున్న ఆఫర్లను చూస్తుంటే, కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలో డస్టర్ అమ్మకాలను పెంచుకునేందుకు కంపెనీ గట్టిగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications